S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీటి సంరక్షణే దేశానికి రక్ష

వాతావరణ మార్పులు దేశంలోని వివిధ ప్రాంతాలను వైపరీత్యాలతో వణికిస్తున్నాయి. తరచు అనావృష్టి, తుఫాన్లు, వరదలకు గురౌతున్నాయి. వాటి ఉధృతి మునుపటికన్నా ఎక్కువైంది. ఇటీవలి కాలంలోనే ఈ మూడురకాల వైపరీత్యాలు పెరగటం ఆందోళన కలిగించే అంశం. గతంలో దేశం చాలానే అనావృష్టులను చవిచూచింది. కాని 1998 తరువాత వాటి రాక ఎక్కువైంది. 1999, 2002, 2009, 2014, 2015 సంవత్సరాల్లో అనావృష్టుల చేదు రుచి చూడక తప్పలేదు. ఈ పరిణామం పేద రైతులను అత్యంత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేసాయి. వీరికున్న కొంచెం వ్యవసాయ భూమిని తెగనమ్ముకొనేలా చేసి, జీవనోపాధికోసం నగరాలకు వలస కూలీలుగా తరిమేసాయి.

- వి.వరదరాజు

ఉద్యోగుల సమస్యలపై ఎందుకు వివక్ష

మా ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంకోసం కట్టుబడి ఉంటుందని, తాను మారిన మనిషినని ఉద్యోగులకి వేధింపులు ఇబ్బందులు అంటూ ఉండవని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు హామీలమీద హామీలు ఇచ్చిమరీ ఓట్లేయించుకున్నారని అవసరం తీరాక పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకి రావలసిన కరువుభత్యం ఇవ్వకుండా ఇంతకాలం నెట్టుకొచ్చారు. కరువుభత్యం అడిగితే 43% ఫిట్‌మెంటు ఇచ్చాం. అంటుంటారే కానీ పెరిగిన ధరలబట్టి కరువుభత్యం ఉంటుందన్న విషయాన్ని తెలియనట్లు చెప్పటం విడ్డూరం.

- ఎన్.నాగేశ్వరరావు

నిరాశ పరుస్తున్న ఎస్‌విబి చానల్

ఆంధ్రుల ఆరాధ్యదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి. ఇది జగత్‌సత్యం. మొత్తం భారతదేశంలో వున్న భక్తులకు కూడ ఆయన ఆరాధ్యుడే. టి.టి.డి. వారు ఎస్‌విబిసి పేరుతో పది సంవత్సరాల క్రితం భక్తి టి.వి.చానల్ ప్రవేశపెట్టారు. అనేక మంది సంతోషించారు. శ్రీవారి సుప్రభాతం ఇతర సేవా కార్యక్రమాలు మీ ఎస్‌విబిసి చానల్‌లో చూసి, విని ఆనందిస్తారని అనుకున్నారు. ముఖ్యంగా శ్రీవారి సుప్రభాత సేవను విని ఆనందించాలనుకున్నారు. కాని మా ఆశను నిరాశపరిచారు. చానల్ ప్రారంభ దశలో ప్రతిరోజు ఉ.5.30 గంటలకు శ్రీవారి సుప్రభాతం, ఇతర సేవలు ప్రసారం చేసేవారు.

ప్రముఖులకు సత్కారం

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో 62మంది ప్రముఖులను గవర్నర్ నరసింహన్, ముఖమంత్రి కెసిఆర్ ఘనంగా సత్కరించి, లక్షా 116 రూపాయల నగదు అందజేశారు.

అంబరాన్ని తాకిన సంబరం

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ రెండవ వార్షికోత్సవ వేడుకలు గురువారం రాష్టవ్య్రాప్తంగా అత్యంత వైభవోపేతంగా జరిగాయి. తొలి ఏడాది నిర్వహించిన దానికంటే రెండవ ఏడాది నిర్వహించిన ఈ వేడుకలు మరింత ఘనంగా జరగడం విశేషం. మొదటి సంవత్సర వేడుకలు రాష్ట్ర రాజధానికే ప్రాధాన్యత ఇవ్వగా, ఈ సారి వీటిని రాష్టవ్య్రాప్తంగా నిర్వహించడం విశేషంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర అవతరణ వేడుకలు గతంలో పరేడు గ్రౌండ్‌లో నిర్వహించే సభకు మాత్రమే పరిమితమయ్యేలా ఉండేవి.

లొల్లి ఎందుకు?

హైదరాబాద్, జూన్ 2: రెండు రాష్ట్రాలు బాగుపడే విధంగా సామరస్యంతో ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చునని, ఇరు రాష్ట్రాల రైతులకు మేలు జరిగేట్టు చూడాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హెచ్‌ఐసిసిలో వివిధ రంగాల్లోని ప్రముఖులకు అవార్డులు బహూకరించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల నిపుణులతో సమావేశమైన ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అంటారనీ, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కర్నాటక, మహారాష్టత్రో జల వివాదాలు ఉండేవని కానీ ఇప్పుడు సామరస్య పూర్వకంగా చర్చించుకుని పరస్పరం సహకరించుకుంటున్నామని చెప్పారు.

అవరోధాలు అధిగమించాం

హైదరాబాద్, జూన్ 2: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఎన్నో బాలారిష్టాలను, అవరోధాలను అధిగిమించిందని, రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు బాగుపడతాయనే ప్రజల విశ్వాసాన్ని ఈ రెండేళ్ల పాలనలో నిలబెట్టగలిగామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా పరిపాలన సాగుతుందన్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఎంత బలమైన పునాది వేయగలిగితే రాబోయే తరాల భవిష్యత్ అంత ఉజ్వలంగా ఉంటుందన్నది తన ప్రగాఢ విశ్వాసమన్నారు.

కలిసి పనిచేద్దాం

హైదరాబాద్, జూన్ 2: సాంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో పరస్పరం సహకరించుకోవాలని కాలిఫోర్నియా గవర్నర్, తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అమెరికా పర్యటనలో భాగంగా ఐటి శాఖ మంత్రి కె తారకరామారావుకాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ జెర్రీ బ్రౌన్‌తో సమావేశమయ్యారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ సమావేశాల సందర్భంగా కాలిఫోర్నియా గవర్నర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో సాంప్రదాయేతర ఇంధన రంగంలో పరస్పర సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సమావేశానికి ప్రపంచంలో 13 ఫ్రావిన్స్‌ల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. భారతదేశం నుంచి తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఆహ్వానం అందింది.

నష్టపోయాం.. కష్టపడదాం

విజయవాడ, జూన్ 2: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి, కుట్ర రాజకీయాలకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీ కుమిలిపోయేలా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘ఇది నా కోరిక..అందుకే పట్టుదలతో పనిచేస్తున్నాను’అని అన్నారు. స్థానిక బెంజ్ సర్కిల్ వద్ద గురువారం ప్రజలతో నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర విభజన సమయంలో సంబంధిత వ్యక్తులను ఏమాత్రం సంప్రదించకుండా యుద్ధ విమానాల్లో బిల్లు తెప్పించి, వార్ రూంలో సమావేశాలు ఏర్పాటు చేసి, ఎంపిలను బెదిరించి, పార్లమెంట్ తలుపులు మూసేసి బిల్లును ఆమోదించారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అందరికీ వైద్యం.. అదే నా ఆశయం

విజయవాడ, జూన్ 2: ఎక్కువ ఖర్చుతో కూడుకున్న డయాలసిస్ వైద్య సేవలను నిరుపేదలకు చేరువ చేసేందుకు రాష్ట్రంలో పది యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పిఎంఎస్‌ఎస్‌వై గ్రాంట్ కింద వచ్చిన 150 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు ఏ దేశంలో విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉంటుందో, ఆ దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. వైద్య రంగంలో కొత్త విధానాలను తీసుకురావడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించగలుగుతున్నామని అన్నారు.

Pages