S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైజీరియాలో హైకమిషనర్‌గా నాగభూషణరెడ్డి

హైదరాబాద్/కడప, జూన్ 2: ఇండియన్ ఫారిన్ సర్వీసు అధికారి బొల్లవరం నాగభూషణరెడ్డి నైజీరియాలో భారత హైకమిషనర్‌గా నియమితులయ్యారు. నాగభూషణరెడ్డి స్వస్థలం కడప జిల్లా పొద్దుటూరు. ఆయన తండ్రి రామసుబ్బారెడ్డి పొద్దుటూరులో ప్రముఖ వైద్యుడు. ప్రస్తుతం నాగభూషణరెడ్డి జెనీవాలోని పర్మినెంట్ మిషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు. గతంలో ఆయన ఉమ్మడి రాష్ట్రాల ట్రాన్స్‌పోర్టు అధికారిగా కూడా పని చేశారు.

ఇక రెవెన్యూ సంస్కరణలు

గుంటూరు, జూన్ 2: రెవెన్యూశాఖలో సంస్కరణలకు ఏపి సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ భూములకు సంబంధించి కచ్చితమైన లెక్కలు తేలకపోవటానికి స్థానికంగా ఉండే అధికారులే కారణమని ప్రభుత్వం భావిస్తోంది. స్థానికంగా ఉండే తహశీల్దార్లు, వీఆర్వోలను ఇతర మండలాలు, జిల్లాలకు బదిలీ చేయడం ద్వారా పాలనలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది.

కల నెరవేరేనా ‘ప్రభూ’!

హైదరాబాద్, జూన్ 2: దేశానికి ఎవరు రైల్వే మంత్రిగా వచ్చినా వారికి ముందుగా గుర్తుకొచ్చేది సొంత రాష్ట్రం. కొత్త రైళ్లు, సర్వే లైన్లు.. ఒకటేమిటి అన్ని వరాలూ సొంత రాష్ట్రాలకే వెళుతుంటాయి. అందుకే లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, జాఫర్ షరీఫ్ రైల్వే మంత్రులుగా పనిచేసి, అన్ని ప్రాజెక్టులనూ తమ రాష్ట్రాలకు తరలించుకుపోయారు. అందుకే వారిని దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించే కేంద్ర మంత్రులుగా కాకుండా, ‘సొంత రాష్ట్ర రైల్వే మంత్రులు’గా ముద్ర వేసుకున్నారు.

దోషులు 24 మంది

అహ్మదాబాద్, జూన్ 2: పధ్నాలుగేళ్ల క్రితం గుజరాత్‌లో నాటి కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జాఫ్రీ సహా 69మందిని కిరాతకంగా ఊచకోత కోసిన గుల్బర్గ్ సొసైటీ కేసులో 24 మందికి శిక్ష పడింది. అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు ఈ కేసులో గురువారం తీర్పు చెప్పింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పిబి దేశాయ్ ఈ కేసులో తీర్పు చెప్తూ బీజేపీ సిట్టింగ్ కార్పొరేటర్ బిపిన్ పటేల్ సహా 36మందిని నిర్దోషులుగా విడుదల చేశారు. మిగతా 24మందిలో 11మందిపై ఐపిసీ 302 సెక్షన్ కింద హత్యారోపణలు రుజువైనాయి. విహెచ్‌పీ నేత అతుల్ వైద్యతో సహా 13మందికి చిన్న నేరాల కింద దోషులుగా తీర్పు చెప్పారు.

కేంద్ర ఉద్యోగుల జీతాలు పెంపు

న్యూఢిల్లీ, జూన్ 2: ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా చూస్తున్న ఎదురుచూపులు ఇక ముగియనున్నాయి. వచ్చే నెల నుంచి కేంద్ర ఉద్యోగులందరికీ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కేబినెట్ కార్యదర్శి పికె సిన్హా నాయకత్వంలో కొందరు కార్యదర్శుల బృందం జూన్ 11న సమావేశమై వేతన సంఘం సిఫార్సులకు తుది రూపాన్ని ఇవ్వనుంది. ఈ కమిటీ స్క్రీనింగ్ కమిటీలా వ్యవహరిస్తుంది. వేతన సంఘం సిఫార్సుల అమలుకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు గత జనవరిలో కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కార్యదర్శి పికె సిన్హా నేతృత్వంలో అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

ప్రజాసేవకు టిడిపి వేదిక

విజయవాడ, జూన్ 2: ప్రకాశం జిల్లా కందుకూరు వైకాపా ఎమ్మెల్యే పోతిన రామారావు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో రామారావుకు పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు ఆ నియోజకవర్గానికి చెందిన ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలు తదితరులు టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కాపులను రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని చెప్పారు. అలాగే మిగిలిన అగ్రవర్ణాల్లో కూడా ఉన్న పేదలను ఆదుకుంటామని చెప్పారు.

అత్యున్నత ప్రమాణాలతో రాష్రాభివృద్ధి లక్ష్యం

రాజంపేట, జూన్ 2:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2050 సంవత్సరం నాటికి ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు లక్ష్యమని విప్ మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని గాంధీ విగ్రహం దగ్గర నవ నిర్మాణ దీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ కొంత మంది స్వార్ధపరులు తమ స్వలాభం కోసం రాష్ట్రా న్ని రెండు ముక్కలుగా చీల్చారని, గత రెండేళ్ల క్రితం జూన్ 2న ఎపి రెండు రాష్ట్రాలుగా విభజించగా మన రాష్ట్రానికి రూ. 16 వేల కోట్ల లోటుబడ్జెట్, తెలంగాణకు రూ. 36 వేల కోట్లు మిగులు బడ్జెట్ ఉండేదన్నారు.

బిసి, ఇబిసిలకు ఫీజులందక అవస్థలు

కడప,జూన్ 2:ప్రతిభావంతులైన నిరుపేదలై బిసి, ఇబిసిల విద్యార్థులకు గత విద్యా సంవత్సరంలో చేరిన నూతన విద్యార్థులకు గత రెండేళ్లుగా చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రెన్యువల్స్ చెల్లించని కారణంగా విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. గత విద్యా సంవత్సరంలో రూ.46కోట్లు జిల్లాలో విద్యనభ్యసిస్తున్న బిసి, ఇబిసి విద్యార్థులకు రూ.46 కోట్లు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.29కోట్లు మాత్రమే బిసి సంక్షేమశాఖ సంబంధిత విద్యాసంస్థలకు చెల్లించింది. ప్రభుత్వాన్ని నమ్ముకుని కళాశాలల్లో చేరిన విద్యార్థులు విద్యనభ్యసించగా వారికి ఫీజులు అందకపోవడం శాపంగా మారింది.

జిల్లా కాపుల కట్టడికి ఎమ్మెల్సీ పదవి

కడప, జూన్ 2:కాపు సంఘం అధినేత ముద్రగడ పద్మనాభం శరవేగంతో చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కాపులను ఆకర్షించేందుకు తెలుగుదేశంపార్టీ అధిష్టానం జిల్లాలో వచ్చే ఏడాది మార్చిన ఖాళీ ఏర్పడుతున్న ఎమ్మెల్సీ పదవుల్లో జిల్లాలోని ఒక కాపు నేతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి 2019 ఎన్నికలకు రెండుగానీ, మూడు కానీ అసెంబ్లీ స్థానాలను కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

అభివృద్ధిలో రాష్ట్రం అగ్రగామి

కడప, జూన్ 2: దేశంలోనే ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ముందుచూపుతో అన్నిరంగాల్లో ముందుంచేందుకు కృషి చేస్తున్నారని, జిల్లాలోని ప్రతి పౌరుడు నడుం బిగించాలని, అంకితభావంతో ప్రతి ఒక్కరు పనిచేస్తే బాబుకలలు ఫలిస్తాయని జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ పిలుపునిచ్చారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా గురువారం నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన అధికార, అనధికార సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు గురువారం రాష్టవ్య్రాప్తంగా అధికారులు, అనధికారులు, పౌరులచే చేపట్టిన ప్రతిజ్ఞను ఏకకాలంలో ఆయన ప్రతిజ్ఞ చేయించి ప్రసంగించారు.

Pages