S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న టిడిపి

అనంతపురం, జూన్ 2 : వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా గురువారం కిష్టిపాడులో ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమన్నారు. ఇందులో భాగంగా కిష్టిపాడు నుంచి రాయలచెరువు వెళ్తున్న జగన్ కాన్వాయికు స్థానిక టిడిపి నాయకులు అడ్డుకునేందుకు రోడ్డును దిగ్బంధించారు. అనంతరం జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జగన్ విజ్ఞత మర్చిపోయి మాట్లాడుతున్నారంటూ జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత అన్నారు. శుక్రవారం కూడా టిడిపి శ్రేణులు ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
5న వైకాపా ధర్నా.. హాజరు కానున్న జగన్

పాముకాటుకు తల్లీకొడుకు బలి

గుత్తి, జూన్ 2 : మండల పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన చంద్రకళ (30), ఏడాది కుమారుడు గురువారం పాముకాటుతో మృతి చెందా రు. భర్త లింగన్న, చంద్రకళ కలిసి పశుపోషణ ద్వారా జీవనం సాగిస్తుండేవారు. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామున పశువులకు పాలు పితకడానికి వెళ్లింది. పశువుల పాకలో పాలు పితుకుతుండగా పాము కాటు వేసింది. అయితే చీకటిగా ఉండటంతో గమణించని ఆమె ఉదయం 7 గంటలకు తన కుమారుడు నిద్ర లేవగా పాలు పట్టించింది. దీంతో ఇద్దరికి విషం శరీరంలోకి ఎక్కడంతో ఏడాది బాలుడు పసుపు వర్ణంలోకి మారాడు. అనంతరం చంద్రకళ తీవ్ర అస్వస్థతకు చేరింది. వెంటనే చంద్రకళను గుత్తి ఆర్‌ఎస్‌లోని నాటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.

సమస్యలు పక్కన పెట్టి సంబరాలా...

కదిరి టౌన్, జూన్ 2: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలను గాలికి వదిలిపెట్టి నవ దీక్ష నిర్మాణం, వికాస్ పర్వాల పేరిట సిఎం చంద్రబాబు, దేశ ప్రధాని మోదీలు ఎవరిని ఉద్ధరించడానికి ఈ సంబరాలు చేస్తున్నారని ఎపి పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. గురువారం కదిరి పట్టణంలోని దాదా ఫంక్షన్ హాల్ నందు జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులు సాకే శైలజానాథ్, జిల్లా అధ్యక్షులు కోటా సత్యం, మాజీ ఎమ్మెల్యే టిడి నాగరాజరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరైనారు.

అందరి సహకారంతో రాజధాని అభివృద్ధి

రాప్తాడు, జూన్ 2: అందరి సహకారంతోనే రాజధానిని అభివృద్ధి చేసుకుందామని రాష్ట్ర పౌర సరపరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా గురువారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయం ఎదురుగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాధపడాల్సిన రోజని, తెలంగాణాలో ప్రజలు సంబరాలు జరుపుకుంటుంటే ఇక్కడ మనం బాధలతో వున్నామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని విడగొట్టద్దంటూ ప్రతి ఒక్కరూ ఎన్నో ఉద్యమాలు చేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేశారన్నారు.

తెలంగాణ నీటి చౌర్యం రాయలసీమకు మరణ శాసనం

నల్లమాడ, జూన్ 2: పట్టపగలే తెలంగాణ ప్రభుత్వం మనకు రావాల్సిన 165 టీయంసీల నీటిని దోచుకెళ్తుందోని, అది రాయలసీమ వాసులకు మరణ శాసనంగా మారనుందని, తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటి చౌర్యం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్లమాడ మండలంలోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆయన ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ టిడీపీవి అన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలని రెండేళ్ల కాలంలోనే రాష్ట్రంలో ప్రజా ద్రోహులుగా మిగిలారని విమర్శించారు.

నవ నిర్మాణ దీక్ష పేర అధికార దుర్వినియోగం

అనంతపురంటౌన్, జూన్ 2: నవ నిర్మాణ దీక్షల పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ చంద్రబాబునాయుడు నాటకాలు ఆడుతున్నారని పిసిసి ఉపాధ్యక్షుడు శైలజానాథ్ ధ్వజమెత్తారు. గురువారం స్థానిక పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో చంద్రబాబునాయుడు సమైక్య రాష్ట్ర విషయంపై ఒక్క మాట మాట్లాడలేదన్నారు. పైపెచ్చు మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల పర్యటనలో చంద్రబాబు రాష్ట్ర విభజనకు తాను అనుకూలమని నిండు సభలలో ప్రకటించటం జరిగిందన్నారు. అయితే విభజన తర్వాత ప్రజల ముందు కాంగ్రెస్‌ను విలన్‌గా చూపేందుకు బాబు యత్నిస్తున్నారని అన్నారు.

జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి

గుత్తి, జూన్ 2 : కరవుకు నిలయమైన మన జిల్లాలో క్రీడలకు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎపి ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జెసి పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ఫుట్‌బాల్ మైదానంలో జెసి పవన్ యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడాకారుల పరిచయ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారన్నారు. వారికి సరైన ప్రోత్సాహం లభించకపోవడం వల్ల సరైన గుర్తింపునకు నోచుకోవడం లేదన్నారు. అయితే తాను రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన తర్వాత జిల్లాలో క్రీడల అభివృద్ధికి రూ.1 కోటి వరకూ ఖర్చు చేసినట్లు వివరించారు.

జలంతోనే మానవ మనుగడ

గార్లదినె్న, జూన్ 2 : నీటిని పెంపొందించుకోవడం ద్వారానే మానవ మనుగడ సాధ్యమని నాబార్డు సంస్థ ఎజిఎం డాక్టర్ రవీంద్రప్రసాద్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కోటంక గ్రామంలో రిడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జల సంరక్షణ, వినియోగ సార్థకతపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట సంజీవిని పథకం కింద జిల్లాలో లక్ష ఫారంపాండ్లను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుని 54వేల ఫారంపాండ్లు పూర్తి చేశామన్నారు. రైతులందరూ ఈ పథకాన్ని వినియోగించుకుని పొలాల్లో తవ్వించుకోవాలన్నారు.

అగ్రస్థానానికి అహరహం కృషి

ఏలూరు, జూన్ 2: రాష్ట్రాన్ని 2029నాటికి నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషికి అందరూ సహకరించాలని రాష్ట్ర గనులు, స్ర్తి,శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత కోరారు. స్ధానిక ఫైర్‌స్టేషన్ సెంటరులో గురువారం ఏర్పాటుచేసిన నవనిర్మాణ దీక్షా కార్యక్రమంలో ప్రజలతో నవనిర్మాణ దీక్షా ప్రతిజ్ఞను ఆమె చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విభజన పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు కోలుకోలేనంతగా అన్యాయం చేసారన్నారు.

భావితరాలకు బంగారు బాట వేయాలి

ఏలూరు, జూన్ 2: ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణంలో ఉద్యోగులు మరింత సమర్ధవంతంగా పనిచేసి భావితరాలకు బంగారుబాటలు వేయాలని ఏలూరు రేంజ్ డిఐజి పివిఎస్ రామకృష్ణ కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నవనిర్మాణదీక్షా కార్యక్రమంలో భాగంగా స్ధానిక పోలీసు పెరేడ్‌గ్రౌండ్స్ నుండి ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాధమిక హక్కులను ప్రతిఒక్కరూ గౌరవిస్తూ ఆచరణలో అమలు చేయాలని, రాష్ట్ర నవనిర్మాణానికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో ఉద్యోగులు, అధికారులు భాగస్వాములు కావాలన్నారు.

Pages