S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ్యాంధ్రకోసం అహర్నిశలు కృషి చేద్దాం

కడప(క్రైమ్), జూన్ 2:తెలుగు రాష్ట్రాలు విడిపోయి నేటికి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రజలందరూ అహర్నిశలు కృషి చేస్తూ నవ్యాంద్ర నిర్మాణానికి పాటుపడాలని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణంలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. పో లీసు అధికారులతో నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్ర కోసం అహర్నిశలు కృషి చేసి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలన్నారు. రాష్టవ్రిభజన ప్రజలు కోరుకున్నది కాకపోయినా దీన్ని ఒక పీడ కలగా మరచిపోవాలన్నారు.

సిద్ధ్దేశ్వరం ప్రాజెక్టు తక్షణమే చేపట్టాలి

మైదుకూరు, జూన్ 2:రాయలసీమ వాసుల ప్రయోగనాలను, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సిద్దేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తక్షణమే చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనాథరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యుడు బిపి ప్రతాప్‌రెడ్డితో కలిసి గురువారం విలేఖర్లతో మాట్లాడారు. సిద్దేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సీమవాసులే స్వయంగా శంకుస్థాపన చేసేందుకు పూనుకోవడాన్ని బట్టి చూస్తే ఆప్రాజెక్టు ఆవశ్యకత ఎంతుందో దీన్ని బట్టే అర్థమవుతుందని చెప్పారు.

జిల్లావ్యాప్తంగా వర్షాలు

కడప(టౌన్), జూన్ 2:కడప జిల్లా వ్యాప్తంగా 29 మండలాల్లో వర్షం కురవగా 22 మండలాల్లో వర్షం నమోదుకాలేదు. కడప నగరంలో 49.2మి.మీ.వర్షపాతం నమోదైంది. దీంతో పాదాచారులకు, ద్విచక్రవాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జమ్మలమడుగులో 43మి.మీ, నందలూరులో 33.6మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 528 మి.మీ.వర్షపాతం నమోదైంది. కమలాపురం, రాయచోటి , పులివెందుల, కోడూరు నియోజకవర్గాల పరిధిలో అతితక్కువ వర్షపాతం నమోదైంది.

ఎరుకల అభివృద్ధికి కృషి

కడప(కల్చరల్), జూన్ 2:ఆర్థికం గా, సామాజికంగా వెనుకబడి వున్న ఎరుకల అభివృద్ధికోసం కృషి చేస్తామని ఎరుకల పోరాట సమితి రాష్ట్ర ప్రధానకార్యదర్శి డి.శ్రీనివాసులు పే ర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో సంఘం ఎరుకల టైమ్స్, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరుకల సమస్యలు, కడప జిల్లాలో అధికారులు పట్టించుకోవడం లేదని, కనీసం వౌళిక వసతులు లేకుండా ఎంతోమంది ఆదివాసి ఎరుకలు ఇబ్బందులుపడుతున్నారని , గిరిజన సంక్షేమశాఖ పేరుకుమాత్రమే ఉందని విమర్శించారు.

పరిశ్రమల స్థాపనకు త్వరగా అనుమతులు ఇవ్వాలి

కడప(కల్చరల్), జూన్ 2:జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ పాలసీ కింద ఆన్‌లైన్ ద్వారా అందిన దరఖాస్తులను నిర్ణీత గడువు లోగా పరిష్కరించి పరిశ్రమల స్థాపనకు అనుమతులు జారీ చేయాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల అభివృద్ధి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని వౌళిక వసతులు పుష్కలంగా ఉన్నాయన్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడలో 7 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని తెలిపారు.

బౌద్ధరామాల అభివృద్ధికి కృషి

కడప(కల్చరల్), జూన్ 2:నందలూరు మండలంలోని బౌద్ధరామాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా పర్యాటక రంగ అభివృద్ధి సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు నెమళ్లదినె్న నాగవాణి, యవజన విభాగం కో ఆర్డినేటర్ జార్జి గురువారం రాజంపేటలోని టిడిపి కార్యాలయంలో మేడాను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సంస్థ గౌరవాధ్యక్షుడు సిద్దవటం సీతారామయ్య ఆదేశాల మేరకు ఆయన్ను కలవడం జరిగిందన్నారు. బౌద్దరామాల వద్ద 150అడుగుల బుద్దుని ధ్యాన విగ్రహం ఏర్పాటుచేయాలని , నందలూరు సౌమ్యనాథ దేవాలయం నుంచి బౌద్ధరామాల వరకు రోడ్లు వెడల్పుచేసి లైటింగ్ వేయాలని కోరారు.

5న దూదేకుల యువగర్జన

కడప(కల్చరల్), జూన్ 2:ఆంధ్రప్రదేశ్ నూర్‌బాషా, దూదేకుల బిసి ముస్లిం సంక్షేమ సంఘం నిర్మాణ సారథ్యంలో నూర్‌బాషా, దూదేకుల ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 5న కర్నూలులోని రావూరి గార్డన్‌లో జరిగే దూదేకుల యువగర్జనకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున యువత తరలిరావాలని ఏపి నూర్‌బాషా సంక్షేమసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకేసుల ఖాదర్‌బాషా, నాయకులు డి.జి.అక్బర్ అలీ, కె.బాబా ఫకృద్దీన్, బి.సుభాన్‌లు పిలుపునిచ్చారు.

భువనగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి

రాజంపేట టౌన్, జూన్ 2:రాజంపేట పట్టణ శివారులోని భువనగిరి గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని గురవారం శాసన మండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య దర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగ తం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాభివృద్ధికి తన వంతు సహయ, సహకారాలు అందిస్తామన్నారు. గ్రామస్తులు సమైక్యంగా దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు సి.రా మచంద్రయ్య, మణిలను దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు.

రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కండి

అనంతపురం సిటీ, జూన్ 2: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసి రెండేళ్లు పూర్తయ్యిందని, ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ నవ నిర్మాణ దీక్షను జరుపుకుంటున్నామని, నూతన రాష్ట్ర నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతలు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక టవర్‌క్లాక్ వద్ద నవ నిర్మాణ దీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభాకర్‌చౌదరి, పార్థసారథి, ఎమ్మెల్సీ శమంతకమణి, జెడ్పి ఛైర్మన్ చమన్ సాబ్, ప్రభుత్వ విప్ యామినీ బాల, కలెక్టర్ కోన శశిధర్‌లు హాజరయ్యారు.

రాష్ట్ర విభజనకు సహకరించిన చంద్రబాబుకు నవనిర్మాణ దీక్ష చేసే హక్కులేదు

పెద్దవడుగూరు, జూన్ 2 : రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు నవ నిర్మాణ దీక్ష చేసే నైతిక హక్కు లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా మండలంలో పర్యటిస్తున్న జగన్ యాత్ర రెండవ రోజు గురువారం ఉదయం 8 గంటలకు మేడిమాకులపల్లిలో ప్రారంభించి లక్షుంపల్లి, ముప్పాలగుత్తి, బుర్నకుంట, కడదరకుంటపల్లె గ్రామాల్లో రోడ్డు షో నిర్వహించారు. మద్యాహ్నం 3 గంటలకు కిష్టిపాడు చేరుకుని ఆత్మహత్య చేసుకున్న చేనేత నాగరాజు కుటుంబాన్ని పరామర్శించారు.

Pages