S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలివాన బీభత్సం

వీరవాసరం, జూన్ 2: వీరవాసరం మండలంలో గాలివాన బీభత్సం సృష్టించడంతో బుధవారం రాత్రి 11 గంటల నుండి కురిసిన వర్షంతో మండలంలోని అనేక చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి నేలపై పడ్డాయి. చెట్లు నేలకొరగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వృక్షాలు కూలి విద్యుత్ వైర్లపై పడటంతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. బుధవారం అర్ధరాత్రి నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
గాఢాంధకారంలో వీరవాసరం

చేసిన సాయం చెబితే బాగుండేది

భీమవరం, జూన్ 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన నవనిర్మాణ దీక్ష ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రాష్ట్రానికి ఎటువంటి సహాయం చేశారో చెబితే బాగుండేదని బిజెపి రాష్ట్ర సమన్వయకర్త పురిఘెళ్ళ రఘురాం అన్నారు. మోదీ రాష్ట్రానికి చేసిన సహాయాన్ని ప్రస్తావించి ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థాయి మరింత పెరిగేదన్నారు. అయినా 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన నరేంద్ర మోదీ రాష్ట్రాన్ని ఆదుకుంటానని ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొన్ని రాజకీయ పార్టీలు తెలిసీ తెలియక విమర్శలు చేస్తున్నాయని ఘాటుగా స్పందించారు.

అభివృద్ధి పథంలో నడిపిస్తున్న పిఎం, సిఎం

పెంటపాడు, జూన్ 2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రం పెంటపాడు గాంధీబొమ్మ సెంటర్‌లో మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ తెలంగాణా అన్ని వనరులతో తులతూగుతుంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనుకంజలో ఉన్నా ప్రజాహిత కార్యక్రమాలు ఆగలేదన్నారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిద్రావస్థలో ఉంటే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రాజెక్టు పనులు పరిగెడుతున్నాయన్నారు.

కమిషనర్‌గా నాగ నరసింహారావు బాధ్యతల స్వీకరణ

భీమవరం, జూన్ 2: భీమవరం మున్సిపల్ కమిషనర్‌గా నాగనరసింహారావు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇప్పటివరకు గ్రేటర్ విశాఖ కార్పొరేషన్‌లో జోన్-3లో కమిషనర్‌గా పనిచేశారు. బదిలీపై ఆయన ఇక్కడకు వచ్చారు. ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. నాగనరసింహారావు మాట్లాడుతూ పుర ప్రజలకు తనవంతు సేవలందిస్తానన్నారు.

నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్

భీమవరం, జూన్ 2: భీమవరంలో నాలుగు సంవత్సరాల వయస్సు కలిగిన బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. స్థానిక బుధవారం మార్కెట్‌లోని అరవ లచ్చన్న వీధికి చెందిన దీపాటి సుబ్బారావుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు దీపాటి అబ్రహం. బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తల్లి దీపాటి రాణి కుమారుడు అబ్రహంకు భోజనం పెట్టి నీళ్ళు తెచ్చుకునేందుకు బిందెలతో నీళ్ళ కుళాయి వద్దకు వెళ్ళింది. తల్లి రాణి ఇంటికి వచ్చి చూసేసరికి కుమారుడు కనిపించలేదు. దీంతో భర్త సుబ్బారావుకు రాణి సమాచారం ఇచ్చింది.

కేంద్ర మంత్రి సుజనాచౌదరికి ఎంపి తోట శుభాకాంక్షలు

భీమవరం, జూన్ 2: కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనాచౌదరిని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి గురువారం హైదరాబాద్‌లో కలిశారు. రెండవసారి రాజ్యసభకు ఎంపికైన సందర్భంగా ఆయనకు తోట సీతారామలక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. సుజనాచౌదరి జన్మదినోత్సవం సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అందరూ సమిష్టిగా పనిచేద్దామని ఎంపి తోట సీతారామలక్ష్మికి సుజనాచౌదరి సూచించారు. సుజనాచౌదరిని అభినందించిన వారిలో నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు కూడా ఉన్నారు.

అభివృద్ధి అంటే నచ్చని జగన్

పాలకొల్లు, జూన్ 2: అభివృద్ధి అంటే పడని జగన్ ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగటం దురదృష్టకరమని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. గురువారం పాలకొల్లులో జరిగిన నవ నిర్మాణ దీక్షలో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి భూసేకరణచేస్తే ఎందుకుచేశారటం, నదులు అనుసంధానం చేస్తానంటే గోదావరి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ప్రారంభించక ముందే కోట్లు కాజేశారని ప్రచారం చేస్తున్నారన్నారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపడానికి కృషిచేస్తున్నామన్నారు.

రైతులకు పూర్తి న్యాయం:మంత్రి సుజాత

ఏలూరు, జూన్ 2: చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోయే రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం కల్పించి ఆశించిన ధర అందేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం భూములు కోల్పోయే రైతులతో మంత్రి చర్చించారు. మెట్ట ప్రాంతాన్ని డెల్టాగా మార్చేందుకు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని, ఈ విషయంలో భూములు కోల్పోయే ప్రతీ రైతుకూ పూర్తిస్థాయిలో న్యాయం చేయాలన్నదే ప్రభుత్వోద్ధేశ్యమని చెప్పారు. ఈ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని కోరారు.

ఈదురు గాలులతో మామిడి రైతులకు తీవ్ర నష్టం

మొగల్తూరు, జాన్ 2: మండలంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా మామిడితోటల రైతులకు తీవ్ర నష్టం ఏర్పడింది. అసలే ఈ ఏడాది మామిడి కాయలు అంతంత మాత్రంగానే ఉండడం, దానికితోడు ప్రకృతి వైపరీత్యాల కారణంగా మామిడి పూత పూర్తిగా మాడిపోయింది. ఉన్న కాస్త పూత, పిందెలకూ లేనిపోని తెగుళ్లు, వాటి నివారణకు మందులు వాడి రక్షించుకుంటుంటే ఈదురుగాలులు, వర్షాలతో ఉన్న కాస్త కాయ నేలరాలి తీరని నష్టాన్ని తెచ్చిందని రైతులు లబోదిబోమంటున్నారు.

రెండు రోజుల్లో 40 శాతం రేషన్ పంపిణీ:జెసి

ఏలూరు, జూన్ 2 : జిల్లాలో గత రెండు రోజుల్లో 40 శాతం మంది పేదలకు రేషన్ సరఫరా చేసి రికార్డు సృష్టించామని జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లాలోని తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లతో ఆయన గురువారం సాయంత్రం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి జూన్ మాసంలో బియ్యం, కిరోసిన్, పంచదారను ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని గత రెండు రోజుల నుండి ఇ-పాస్ విధానం ద్వారా 40 శాతం మంది పేదలకు రేషన్ అందించగలిగామని రాబోయే రెండు రోజుల్లో 50 శాతం రేషన్ అందించేందుకు నిరంతరం కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు.

Pages