S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు

ఖానాపూర్ రూరల్, మే 30: మినీ మహానాడు కావడంతో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పంటించి ధ్వంసం చేయడం మండలంలో సంచలనంగా మారింది. మండలంలోని బాదన్‌కుర్తి రహదారిపై సుర్జాపూర్ శివారులోని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి నిప్పంటించారు. సోమవారం విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు విగ్రహం వద్ద గల రహదారిపై బైఠాయించి దుండగులను వెంటనే అరెస్ట్‌చేయాలని అన్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని, దీనిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

గుంటలో పడి ఇద్దరు యువకుల మృతి

కడెం, మే 30: మండలంలోని గొడిసిర్యాల గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి నిజామాబాద్ జిల్లాలోని జక్రామ్‌పెల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన పుచ్చల నరేష్(25), ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన గుండ నాగేంద్రస్వామి(23) అనే యువకులు రాజన్న స్వామి దర్శనానికి వచ్చి సోమవారం మధ్యాహ్నం ఆలయ సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలోపడి మృతిచెందారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి...

రైతుల అభివృద్ధి సహకార సంఘాలదే

నిర్మల్, మే 30: వ్యవసాయ సహకార సంఘాలు రైతుల అభివృద్ధి కోసం కృషిచేయాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ సమావేశమందిరంలో సోమవారం వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, వ్యవసాయ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బంగారు తెలంగాణ సాకారం కోసం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. రైతులకు వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల ద్వారా అవసరమైన విత్తనాలను, ఎరువులను సబ్సిడీతో పంపిణి చేస్తున్నామన్నారు.

విరివిగా వినతులు

సంగారెడ్డి, మే 30: ఇటీవలే జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి ప్రజావిజ్ఞప్తుల దినోత్సవాన్ని యథావిధిగా నిర్వహించారు. వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న బాధితులు ఎస్పీ కార్యాలయానికి చేరుకుని తమ పేర్లను నమోదు చేయించుకుని ఎస్పీకి వివరించారు. బాధితుల సమస్యలను తెలుసుకుని సంబంధిత పోలీస్ డివిజన్లు, సర్కిళ్లు, పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. బాధ్యతలు చేపట్టిన మొదటి సారిగా ప్రజావిజ్ఞప్తుల కార్యక్రమాన్ని నిర్వహించారు. జోగిపేట, పుల్‌కల్ తదితర ప్రాంతాలకు చెందిన బాధితులు వారు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించి న్యాయం చేయాలని కోరారు.

మడమ తిప్పని పోరు

తొగుట, మే 30: 2013చట్టంను మల్లన్నసాగర్ భూసేకరణలో అమలు చేయాలని డిమాండ్ చేస్త్తూ మండలంలోని ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామస్థులు పంచాయతీ చౌరస్తాలో నిరసనబాట పట్టారు. సోమవారం గ్రామంలో పలువురు భూములను 123జిఓ ప్రకారం రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ వారి ఇళ్లపై దాడి చేసిన గ్రామస్థులు అనంతరం గ్రామసభ నిర్వహించారు. సభలో గ్రామస్థుల అభీష్టానికి వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్లు చేసినవారు బహిరంగ క్షమాపణ చెప్పాలని, కలెక్టర్ గ్రామస్థులకు 123జిఓ, 2013 చట్టంలో ఒకటి ఎంచుకొని తమకు నివేదిస్తే ఆ మేరకు పరిహారం చెల్లిస్తామన్న హామీని విస్మరించారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

2 నుంచి సాదాబైనామాల క్రమబద్ధం

మెదక్, మే 30: సాదాబైనమాలలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రమబద్ధీకరణ చేయడం జరుగుతుందని మెదక్ ఆర్డీఓ మెంచు నగేష్ తెలిపారు. సోమవారం నాడు మాయా గార్డెన్‌లో జరిగిన తహశీల్దార్లు, జడ్పీటిసి, ఎంపిపి, సర్పంచ్‌లు, విఆర్‌ఓలు, రెవెన్యూ సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సాదాబైనామాలపై క్రయ విక్రయాలు చేసుకున్నవారు జూన్ 2 నుంచి 10 వరకు దరఖాస్తులు మీసేవా కేంద్రం ద్వారా ఫారం-5ను పూర్తి చేసి నమోదు చేసుకోవాలన్నారు. సాదాబైనమాపై జరిగిన క్రయ విక్రయాలను క్రమబద్ధీకరణ చేయించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు.

‘అవతరణ’ వేడుకల్లో అందరి భాగస్వామ్యం

సంగారెడ్డి, మే 30: జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలలో ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో జరిగే కార్యక్రమాలలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.

గ్రామాల్లోనూ అవతరణ వేడుకలు

సంగారెడ్డి, మే 30: గ్రామాల్లో ప్రజలను భాగస్వామ్యం చేసి ఒక పండుగ వాతావరణంలో జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్ వెంకటరామిరెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆర్డీవోలు, మండలాధికారులతో సోమవారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేస్తే బాగుంటుందని సూచనలకు అధికారులు ఆమోదం తెలుపుతూ అన్ని వర్గాల ప్రజలను ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం చేస్తామన్నారు.

ముంపు గ్రామాల ప్రజల నిరసన

సిద్దిపేట, మే 30 : సిద్దిపేట నియోజక వర్గం పరిధిలోని చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లిగ్రామస్తులు ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో భూమి, ఇళ్లపై ధర నిర్ణయించకుండానే నోటిపికేషన్ జారీ చేశారని ఆరోపించారు. మెరుగైన నష్ట పరిహారం అందించిన తర్వాతనే భూసేకరణ చేపట్టాలని ఆర్డీఓ కార్యాలయం ప్రధాన ద్వారం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీఓ కార్యాలయంలోకి ప్రజలు వెళ్లకుండ అడ్డుకున్నారు. ఆర్డీఓ ముత్యంరెడ్డి గ్రామస్థులను పిలిపించి చర్చించారు. గ్రామస్థులకు 123 జివో ప్రకారం మెరుగైన పరిహారం అందించిన తర్వాతనే భూమిని సేకరిస్తామన్నారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి

గజ్వేల్, మే 30 : రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన సోమవారం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో చోటుచేసుకుంది. ప్రజ్ఞాపూర్‌కు చెందిన పూదరి పోచమ్మ(60) రోడ్డుపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్ర గాయాలకు గురై అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో పోచమ్మను గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బాదిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో ప్రజ్ఞాపూర్‌లో తీవ్ర విషాదం నెలకొన్నది.

Pages