S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడులేని పేదలకు ఇళ్ల నిర్మాణం

బీర్కూర్, మే 30: బీర్కూర్ మండలంలోని బైరాపూర్ గ్రామంలో గూడు లేని నిరుపేదలకు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంతో లబ్ధి చేకూరుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకంలో భాగంగా సోమవారం ఆయన మండలంలోని బైరాపూర్ గ్రామంలో ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. అంతకు ముందు రెండు పడకల ఇళ్ల నిర్మాణాలపై మంత్రి మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పోచారం మాట్లాడుతూ, ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 65వేల ఇళ్ల నిర్మాణానికి గాను 4000కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందన్నారు.

నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి

ఇందూర్, మే 30: నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు పోలీసు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని డిఐజి, నిజామాబాద్ రేంజ్ ఇంచార్జ్ డిఐజి అకున్ సబర్వాల్ సూచించారు. అకున్ సబర్వార్ నిజామాబాద్ రేంజ్ ఇంచార్జ్ డిఐజిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమవారం మొదటిసారిగా జిల్లా చేరుకుని, పోలీసు కార్యాలయంలో గౌరవ వందనం స్వీకరించి, అధికారులతో సమావేశమయ్యారు. ముందు జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ, డిఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలతో పరిచయ కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ సబ్ డివిజన్ల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

గుంతలో పడి ఇద్దరు దుర్మరణం

కడెం, మే 30: ఆదిలాబాద్ జిల్లా, కడెం మండలంలోని గొడిసిర్యాల గ్రామంలో రాజరాజేశ్వరస్వామి ఆలయానికి నిజామాబాద్ జిల్లాలోని జక్రామ్‌పెల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన పుచ్చల నరేష్(25), ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన గుండ నాగేంద్రస్వామి (23) అనే యువకులు రాజన్న స్వామి దర్శనానికి వచ్చి సోమవారం మధ్యాహ్నం ఆలయ సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలోపడి మృతిచెందారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి...

మంత్రి అల్లోలను కలిసిన జిల్లా ఎస్పీ దుగ్గల్

దివ్యనగర్, మే 30: ఇటీవల నూతనంగా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విక్రమ్‌జిత్ దుగ్గల్ సోమవారం నిర్మల్‌లో రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందించారు.

క్రీడలతోనే మానసికోల్లాసం

వేమనపల్లి, మే 30: క్రీడలతోనే మానసికోల్లాసం కలుగుతుందని చెన్నూర్ ఏ ఎస్పీ సునీల్ దత్ శర్మ అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మూడు మండలాల వాలీబాల్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. పోలీసుల ఆధ్వర్యంలో వేమనపల్లి, కోటపల్లి, చెన్నూర్ మండలాల క్రీడాకారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడల్లో రాణించి జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు. మారుమూల మండలాల్లో ప్రతిభగల క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారికి పోలీసుల ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని, ప్రతిభగల క్రీడాకారులు తమ సత్తా చాటి ఉన్నత స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు.

6న డిప్యూటి సిఎం కడియం జిల్లాకు రాక

ఆదిలాబాద్, మే 30: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి జూన్ 6న జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని కలెక్టర్ ఎం.జగన్మోహన్ తెలిపారు. మంత్రి శ్రీహరి జూన్ 6న మధ్యాహ్నం 2.30 గంటలకు మంచిర్యాల చేరుకొని అక్కడ పార్టీ నాయకులతో సమావేశమై అనంతరం జిల్లా అధికారులతో వివిధ శాఖల పనితీరుపై సమీక్షిస్తారని అన్నారు. అనంతరం వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.

ఘనంగా ముగిసిన శతచంఢీయాగం

నిర్మల్, మే 30: గత ఐదు రోజులుగా రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నివాసంలో చేస్తున్న శతచంఢీయాగం సోమవారం ఘనంగా ముగిసింది. చివరి రోజు పూర్ణాహుతిని వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మద్య అట్టహాసంగా నిర్వహించారు.

కడెం ప్రాజెక్టు ప్రధానకాలువ మరమ్మత్తు పనులను ప్రారంభించిన ఖానాపూర్, మంచిర్యాల ఎమ్మెల్యేలు

కడెం, మే 30: జిల్లాలోని ఐదు మండలాలకు సాగునీరందించే కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ప్రధాన కాలువైన ఎడమకాలువకు రింగ్‌వాల్ హెడ్ రెగ్యులేటర్ సిస్టం నిర్మాణం పనులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి 46 లక్షల 60 వేల రూపాయలు నిధులు మంజూరయ్యాయి. కాగా సోమవారం కడెం ప్రాజెక్టు వద్ద ప్రధాన కాలువైన రింగ్‌వాల్ హెడ్ రెగ్యులేటర్ సిస్టం నిర్మాణం పనులను ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు.

చెరువుల పునరుద్దరణతో రైతులకు మేలు

దండేపల్లి, మే 30: చెరువుల పునరుద్ధరణతో ప్రజలకు మేలు చేకూరుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. మండలంలోని కనె్నపెల్లి, రెబ్బన్‌పల్లి, నెల్కివెంకటాపూర్ గ్రామాల్లో మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్దరణ పనులను శనివారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు లాభం చేకూర్చేందుకు మిషన్ కాకతీయ పథకంతో తెలంగాణలోని 40వేల చెరువుల మరమ్మత్తులకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. చెరువుల్లో నీరుంటే పంటలు సమృద్దిగా పండుతాయని రైతులకు లాభం చేకూర్చేందుకు ముఖ్యమంత్రి మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.

నకిలీ విత్తనాలతో అమాయక గిరిజనులు బలి

ఆదిలాబాద్, మే 30: ఈసారి ముందస్తు నైరుతి రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో విత్తనాల మాయాజాలంలో పడి ఆమాయక రైతులు దగా పడుతున్నారు. ప్రతి ఏటా జూన్‌కు ముందే నకిలీ విత్తనాల బెడద రైతుల పుట్టిముంచుతున్న దీని కట్టడి కోసం పటిష్టమైన యంత్రాంగం పనిచేయకపోవడంతో రైతులు నకిలీ విత్తనాలు సాగుచేసి నిలువున మోసపోవాల్సి వస్తోంది. జిల్లాలో గత ఏడాది 3.36 లక్షల హెక్టార్లలో పత్తిపంట సాగుచేయగా ఈసారి పత్తికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నప్పటికీ అనుమతి లేని నకిలీ విత్తనాల చెలామణి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది.

Pages