S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లాలో లక్ష ఫారంపాండ్లు

కనగానపల్లి, మే 30: మండల పరిధిలోని పర్వతదేవరపల్లిలో రైతుల పొలాల్లో ఏర్పాటుచేసిన నీటి కుంటలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సోమవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం భూ గర్భ జలాలు పెంపొందించేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా లక్ష ఫారంపాండ్లు నిర్మాణాలను చేపట్టిందన్నారు. పర్వతదేవరపల్లి గ్రామానికి చెందిన శంకరయ్య పొలంలో నిర్మించిన ఫారంపాండ్ శనివారం రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా నిండి జల కళను సంతరించుకుంది. దీంతో మంత్రి పరిటాల సునీతతోపా టు డ్వామా పిడి నాగభూషణం, ఆర్‌డిఓ బాలానాయక్‌లు సోమవారం సందర్శించారు.

చంద్రబాబు లక్ష్యం

కదిరి టౌన్, మే 30: దక్షిణ భారతదేశంలో అత్యంత వెనుకబడి వున్న అనంతను కరవురహిత జిల్లాగా చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్యేయమని ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. సోమవారం శ్రీనివాస జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుపై జిల్లా ప్రజలు విశ్వాసం వుంచి 12 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను టీడీపీ తరపున గెలిపించడం జరిగిందన్నారు. జిల్లాపై ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రేమ వుందని, కరవు రహిత జిల్లాగా మార్చాలని చూస్తున్నారన్నారు. హంద్రీనీవాను పూర్తి చేసి జిల్లాలోని 1263 చెరువులకు నీరును నింపి భూగర్భ జలాలను పెంచడమే టీడీపీ ధ్యేయమన్నారు.

కరవు సీమలో వజ్రాల వేట

గుంతకల్లు, మే 30: కరవు సీమలో ఉద్యోగ, ఉపాధి వేటతో పాటు వజ్రానే్వషణలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉద్యోగ, ఉపాధు లు కరువైన యువతతో పాటు మహిళలు, వృద్ధులు ప్రస్తుతం కురిసే తొలకరి వర్షాలకు భూగర్భంలో నిక్షిప్తమై వున్న వజ్రాల కోసం వేట సాగిస్తుంటారు. జూన్ మాసం ప్రారంభం లో కానున్న వర్షాలతో పాటు సెప్టెంబర్ వరకు కురిసే వర్షాలకు భూగర్భంలో వున్న వజ్రాలపై వున్న మట్టి తొలగి, భూ పైపొరలకు చేరుకుంటాయి. దీంతో అనే్వషకులను ఇట్టే ఆకర్షిస్తాయని ఇక్కడి ప్రజల నమ్మకం, ఇందుకు అనుగుణంగా అనేక మార్లు అత్యంత ఖరీదైన వజ్రాలు వజ్రకరూరు ప్రాంతంలో లభ్యమయ్యా యి.

అంజనీ సుతునకు మల్లెల లక్షార్చన

గుంతకల్లు, మే 30:ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి జయంతి ఉత్సవాలలో బాగంగా సోమవారం అంజనీ సుతుడైన హనుమంతునికి మల్లెల లక్షార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఆలయంలోని మూల విరాట్ ఆంజనేయస్వామికి తెల్లవారుజామున సుప్రభత సేవ, మహాభిషేకం, విశేష పుష్పాలంకరణ, బంగారు కిరీటధారణ, వజ్రకవచాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన వడమాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా స్వామి వారికి అష్టోత్తర కలశాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.

మొక్కలు నాటుదాం

తాడిమర్రి, మే 30: రాష్ట్రంలో ప్రతి గ్రామంలోను ఇంటింటా మొక్కలు నాటి పర్యావరణ అభివృద్ధికి అంద రూ కృషి చేయాలని మండలంలోని నారసింపల్లి(దత్తత గ్రామం)లో డిజిపి జెవి.రాము డు పేర్కొన్నారు. సోమవారం డిజిపి స్వగ్రామమైన నారసింపల్లిలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు చైర్మన్ సంపత్‌కుమార్ ఆచార్య అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఆర్థిక అక్షరాస్యత, అవగాహన సదస్సుకు రాష్ట్ర డిజిపితోపాటు రాయలసీమ ఐజి శ్రీ్ధర్, కలెక్టర్ కోన శశిధర్, ఎస్‌పి రాజశేఖరబాబు, ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణలు హాజరయ్యారు.

వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు

అనంతపురం, మే 30:వర్షా కాలం నేపథ్యంలో రోగాలు పొంచి ఉన్నా యి. రోను తుపాను ప్రభావంతో జిల్లా పలు చోట్ల వర్షాలు పడ్డాయి. గత మూడు రోజుల క్రితం కూడా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు మోస్తరు నుంచి భారీగా కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల రోగాలు విజృంభించే ప్రమా దం ఉంది. ముఖ్యంగా ప్రజలు విష జ్వరా లు, డయేరియా, మలేరియా, డెంగీ, మెదడు వాపు, ఫైలేరియా, చికు న్ గన్యా తదితర వ్యా ధుల బారిన పడే ప్రమాదం ఉంది. వీటితో పాటు సాధారణ జబ్బు లు జలుబు, దగ్గు లాం టివి చిన్నాపెద్దా తేడా లేకుం డా సోకనున్నా యి.

ఉత్తమ మున్సిపాలిటీగా హిందూపురం

హిందూపురం టౌన్, మే 30:పట్టణాల్లో పాలకులు చొరవ చూపితే పాలన మెరుగవుతుంది అనడానికి నిదర్శనం హిందూపురం, తాడిపత్రి మున్సిపాలిటీలే. రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల రాష్ట్రంలోని 110 పట్టణాల్లో సర్వే నిర్వహించి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టాప్‌టెన్‌లో జిల్లా నుండి ఏకంగా మూడు మున్సిపాలిటీలు ఎంపిక కావడం గమనార్హం. మూడు మున్సిపాలిటీల్లోనూ మున్సిపల్ సేవలు మెరుగైన రీతిలో అందేలా చర్యలు తీసుకోవడమే ఎంపికకు కారణంగా కనిపిస్తోంది. గతంలో హిం దూపురం మున్సిపాలిటీలో అట్టడుగు స్థానాల్లో కనిపించేది.

దద్దరిల్లిన మున్సిపల్ సమావేశం

గుత్తి, మే 30:పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారుల వైఫల్యంపై అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిల్ అధికారులపై ధ్వజమెత్తడంతో కౌన్సిల్ సమావేశం దద్దరిల్లింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ భవనంలో మున్సిపల్ చైర్మన్ తులసమ్మ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో తాగునీరు, పారిశుద్ధ్యం సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. మున్సిపాలిటి పరిధిలోని వివిధ ప్రాంతాలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చిందని, పట్టణ ప్రజల తాగునీటి పడరాని పాట్లు పడుతూంటే అధికారులు నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు.

అర ఎకరం కోసం దారుణ హత్య

బుక్కరాయసముద్రం, మే 30: బుక్కరాయసముద్రం మండల కేం ద్రంలో సోమవారం ఉదయం బస న్న(65)ని అర ఎకరం పొలం కోసం అన్న కొడుకు అయిన బండి వెంకటేషులు దారుణంగా కొడవలితో నరికి చంపాడు. స్థానికులు, ఇటుకలపల్లి సిఐ రాజేంద్రనాధ్‌యాదవ్, బుక్కరాయసముద్రం ఇన్‌ఛార్జ్ ఎస్సై శివలు తెలిపిన వివరాల మేరకు బసన్న, నిందితుడి తండ్రి ఓబిలేసు ఇరువురు అన్నదమ్ములని, వీరికి బుక్కరాయసముద్రం 376 సర్వే నెంబర్‌లో 8 ఎకరాల 20 సెంట్లు పొలం ఉందన్నారు. అన్నదమ్ములిరువురు భాగ పరిష్కారాల సమయంలో బసన్న 4 ఎకరాల 60 సెంట్లు, అతని అన్న ఓబిలేసు పేరిట 3 ఎకరాల 60 సెంట్లు భాగ పరిష్కారం జరిగిందన్నారు.

6న కేంద్ర మంత్రి ప్రకాశ్‌జవదేకర్ జిల్లా పర్యటన

ఉరవకొండ, మే 30:కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప జూన్ 6న జిల్లా పర్యటన చేపడుతున్నారని, ఈ పర్యటనను విజయవంతం చేయాలని బిజెవైఎం నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా వికాశ్‌పర్వ కార్యక్రమం చేపడుతున్నదన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎపికి అందించిన ఆర్థిక సహాయం, కేంద్రప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లోకి తీసుకువెళ్లుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో బిజెవైఎం మండల ఉపాధ్యక్షులు బాలకృష్ణ పాల్గొన్నారు.

Pages