S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/25/2018 - 00:12

ముంబయి, మార్చి 24: ఇక్కడ జరుగుతున్న మహిళల క్రికెట్ టీ-20 ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు చేతిలో పరాభవం పాలైన హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో అగ్ని పరీక్షను ఎదుర్కోనుంది.

03/25/2018 - 00:11

న్యూఢిల్లీ, మార్చి 24: వచ్చే నెలలో జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడే రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టులో స్వల్ప మార్పు జరిగింది. ఈ జట్టులోని ఫాస్ట్ బౌలర్, ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ కౌల్టర్ నైల్ గాయపడిన నేపథ్యంలో అతని స్థానంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్‌కు కొరీ ఆండర్సన్‌కు చోటు దక్కింది. ఈ విషయాన్ని ఐపీఎల్ సాంకేతిక కమిటీ శనివారం ధృవీకరించింది.

03/24/2018 - 10:34

నాలుగేళ్ల క్రితం మెదడువాపు వ్యాధికి గురై, చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చేరిన శ్రీకాంత్ మృత్యువుతో పోరాడాడు. విజేతగా నిలిచాడు. ఈ నాలుగేళ్లలో ఎంతో అనుభవంతోపాటు, ఆటలో నైపుణ్యాన్ని కూడా పెంచుకున్నాడు. 2014 కామన్ వెల్త్ గేమ్స్‌లో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించిన అతను ఈసారి టైటిల్‌పై కన్నేశాడు.

03/24/2018 - 00:16

హరారేలో శుక్రవారం జరిగిన కీలక మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి, ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌కు అర్హత సంపాదించిన అఫ్గానిస్తాన్ క్రికెటర్ల ఆనందం. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 209 పరుగులు సాధించింది. పాల్ స్టిర్లింగ్ 55, కెవిన్ ఒబ్రియాన్ 41, నీల్ ఒబ్రియాన్ 36 చొప్పున పరుగులు సాధించారు.

03/24/2018 - 00:15

వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడడానికి కొన్ని క్షణాల ముందే అతను గల్లీ స్థానానికి బంతిని పంపి, సింగిల్ చేయడం ద్వారా కెరీర్‌లో 18వ టెస్టు సెంచరీని సాధించాడు. న్యూజిలాండ్ తరఫున అత్యధిక శతకాలు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. మార్టిన్ క్రో, రాస్ టేలర్ చెరి 17 సెంచరీలతో ప్రస్తుతం సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.

03/24/2018 - 00:11

సిడ్నీ, మార్చి 23: సిడ్నీ కేంద్రంగా జరుగుతున్న జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. శుక్రవారం యువ షూటర్ వివాన్ కపూర్ రెండు కాంస్య పతకాలను భారత్‌కు అందించాడు. దీంతో టోర్నమెంట్‌లో పతకాల జాబితాలో భారత్ రెండు స్వర్ణాలు, మూడు కాంస్యాలతో రెండో స్థానానికి ఎగబాకింది. తొలి స్థానంలో ఐదు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యలతో చైనా ఆగ్ర స్థానంలో ఉంది.

03/24/2018 - 00:10

ముంబయి, మార్చి 23: ముక్కోణపు టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ క్రీడాకారిణి నటాలీ సివర్ ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించి, ఆస్ట్రేలియాపై తన జట్టుకు 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించిపెట్టింది. ఆస్ట్రేలియాను 149 పరుగులకు కట్టడి చేసిన ఇంగ్లాండ్ ఆతర్వాత లక్ష్యాన్ని మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే, కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

03/24/2018 - 00:08

చెన్నై: చాలా కాలం తర్వాత మళ్లీ ఒకే దగ్గర కనిపించిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు శ్రీనివాసన్‌తోపాటు అతని అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్‌పైనా అనుమానాలు తలెత్తాయ. ఆ తర్వాత చోటు చేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో శ్రీని తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది.

03/24/2018 - 00:05

కరాచి, మార్చి 23: పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షణలో ఫిబ్రవరి 22వ తేదీ నుంచి ఈనెల 25 వరకు ప్రతిష్టాత్మకమైన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) టీ-20 క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తుంది. ఈ లీగ్‌కు సంబంధించిన మ్యాచ్‌లు యుఏఈలో జరిగాయి. ఫైనల్ మ్యాచ్ మాత్రం పేషావార్‌లో నిర్వహించనున్నది. గత తొమ్మిది సంవత్సరాల తర్వాత క్రికెట్‌లో మోగా ఈవెంట్ నిర్వహించడం ఇది ఫ్రథమం.

03/23/2018 - 03:42

ముంబయి: మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కొని, 0-3 తేడాతో పరాజయాన్ని చవిచూసిన భారత మహిళల జట్టు టీ-20 ఫార్మాట్‌లోనూ పుంజుకోలేదని స్పష్టమైంది. ముక్కోణపు టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌ను ఢీకొన్న భారత్ ఆరు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. స్మృతి మందానా అర్ధ శతకంతో రాణించినప్పటికీ, ఆమె శ్రమ వృథా అయింది.

Pages