S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/21/2018 - 02:20

న్యూఢిల్లీ, మార్చి 20: సుశీల్ కుమార్...రెజ్లర్‌గా అతని పేరును ఎప్పుడో సుస్థిరం చేసుకున్నాడు. నేటి యువతలో చాలామంది రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నారంటే అతని సత్తా ఏమిటో వారందరికీ తెలుసు. గత కొనే్నళ్లుగా పాల్గొన వివిధ పోటీల్లో ఎన్నో ఘనవిజయాలను అందుకున్న అతను త్వరలో జరుగబోయే కామనె్వల్త్ గేమ్స్‌పై దృష్టి సారించాడు.

03/21/2018 - 02:19

న్యూఢిల్లీ, మార్చి 20: మెక్సికోలో ఇటీవల జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ షూటింగ్‌లో మన దేశానికి నాలుగు బంగారు పతకాలతో సహా తొమ్మిది పతకాలను అందించిన యువ షూటర్లు మరింతగా మెరిసేందుకు మరిన్ని అవకాశాలు వేచిచూస్తున్నాయి.

03/21/2018 - 02:18

మంబయి, మార్చి 20: టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఫిబ్రవరిలో రెండు రోజులు దుబాయ్‌లో గడిపాడని బీసీసీఐ తెలిపింది. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం షమీ దుబాయ్ వెళ్లాడని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి అక్కడ పాకిస్తాన్‌కు చెందిన అలిష్బా అనే మహిళ నుంచి డబ్బులు తీసుకున్నాడని షమీ భార్య హసీన్ జహాన్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే.

03/21/2018 - 02:17

హైదరాబాద్, మార్చి 20: నిదహాస్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య ఇటీవల కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న విధ్వంస ఘటనపై నివేదిక వెలువడింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఈ ఘటనకు కారణమని తేలింది. డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు పగిలిపోయిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన మ్యాచ్ రిఫరీ రూమ్ అద్దాలు పగిలిపోయిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్..

03/21/2018 - 02:17

మొహాలీ, మార్చి 20: ఈ ఏడాది ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సొంతగడ్డపై ఆడే మ్యాచ్ వేదికల్లో మార్పు చోటుచేసుకుంది. మే 12 నుంచి 31 వరకు మరమ్మతుల కారణంగా చండీగఢ్ విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేస్తున్నారు. దీంతో మే 4, 6, 12, 14న సొంతగడ్డపై కింగ్స్ ఎలెవన్ ఆడే మ్యాచ్‌లను మొహాలీలో కాకుండా ఇండోర్‌లో నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను కోరింది.

03/21/2018 - 02:16

దుబాయ్, మార్చి 20: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు గుడ్ న్యూస్. ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో అనుచిత ప్రవర్తన కారణంగా మ్యాచ్ రిఫరీ ఆగ్రహానికి గురైన దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడకు ఊరట లభించింది. ఆ దేశ పేసర్ కగిసో రబడ ఆస్ట్రేలియా మిగతా రెండు టెస్టుల్లో బరిలోకి దిగేందుకు మార్గం సుగమం చేస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయం తీసుకుంది.

03/20/2018 - 04:38

కొలంబో: బంగ్లాదేశ్‌తో ఆదివారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన నిదహాస్ టీ-20 ముక్కోణపు సిరీస్ ఆఖరి ఓవర్లో అద్భుతంగా రాణించి టీమిండియా ఘనవిజయానికి బాటలు వేసిన వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు.

03/20/2018 - 02:54

కొలంబో, మార్చి 19: చివరి బంతికి సిక్స్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోనీ. 2011 ప్రపంచకప్ విజయాన్నందించిన ధోనీ సిక్సర్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే షాటే. తాజాగా అలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించాడు మరో భారత యువ అటగాడు దినేశ్ కార్తీక్. నిదహాస్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఫైనల్‌ను ప్రత్యక్షంగా చూసినవాళ్లు పొందిన అనుభూతే వేరు.

03/20/2018 - 02:54

న్యూఢిల్లీ, మార్చి 19: నిదహాస్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. చేజారిపోయింది అని అనుకున్న మ్యాచ్‌ను టీం ఇండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చెలరేగి ఆడి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. అయితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ టీం ఇండియాను అభినందించబోయి చిన్న పొరపాటు చేశారు.

03/20/2018 - 02:53

కొలంబో, మార్చి 19: శ్రీలంక ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన నిదహాస్ టీ-20 ఇంటర్నేషనల్ ఫైనల్ మ్యాచ్ ఆఖరి ఓవర్ చివరి బంతిని సిక్సర్‌గా మలచి ఉత్కంఠకు తెరదించిన ఘటన తన జీవితాంతం గుర్తుంటుందని భారత క్రికెట్ టీమ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్ అన్నాడు.

Pages