S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/23/2018 - 02:37

న్యూఢిల్లీ, మార్చి 22: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) క్లీన్‌చిట్ ఇచ్చింది. షమీ ఒక పాకిస్తాన్ యువతితో కలిసి ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆతని భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

03/23/2018 - 02:44

ఆక్లాండ్, మార్చి 22: న్యూజిలాండ్‌తో గురువారం మొదలైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ కేవలం 58 పరుగులకే కుప్పకూలింది. ట్రెంట్ బౌల్ట్ ఆరు వికెట్లు పడగొట్టి, ఇంగ్లాండ్‌ను దారుణంగా దెబ్బతీశాడు. టిమ్ సౌథీ నాలుగు వికెట్లతో రాణించి, న్యూజిలాండ్ ఆధిపత్యాన్ని కొనసాగించాడు.

03/23/2018 - 02:13

ఆక్లాండ్: ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ టెస్టుల్లో 400 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో చోటు సంపాదించాడు. న్యూజిలాండ్‌తో గురువారం ఇక్కడ ప్రారంభమైన మొదటి టెస్టు మొదటి రోజు ఆటలో టామ్ లాథమ్ వికెట్‌ను పడగొట్టిన అతను కెరీర్‌లో 400వ టెస్టు వికెట్ సాధించాడు. మిడ్ వికెట్ స్థానంలో క్రిస్ వోక్స్ చక్కటి క్యాచ్‌ని అందుకొని బ్రాడ్‌కు చిరస్మరణీయ వికెట్‌ను అందించాడు.

03/23/2018 - 02:11

ముంబయి, మార్చి 22: మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కొని, 0-3 తేడాతో పరాజయాన్ని చవిచూసిన భారత మహిళల జట్టు టీ-20 ఫార్మాట్‌లోనూ పుంజుకోలేదని స్పష్టమైంది. ముక్కోణపు టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌ను ఢీకొన్న భారత్ ఆరు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. స్మృతి మందానా అర్ధ శతకంతో రాణించినప్పటికీ, ఆమె శ్రమ వృథా అయింది.

03/23/2018 - 02:10

హరారే, మార్చి 22: ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంచలన విజయాన్ని నమోదు చేసింది. వర్షం కారణంగా అంతరాయం కలిగిన ఈ మ్యాచ్‌ని యూఏఈ మూడు పరుగుల తేడాతో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు 47.5 ఓవర్లలో 235 పరుగులు సాధించింది.

03/23/2018 - 02:49

మియామీ, మార్చి 22: ప్రపంచ మాజీ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఇక్కడ జరుగుతున్న మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ తొలి రౌండ్‌లోనే పరాజయాన్ని ఎదుర్కొంది. గత వారం ఇండియన్ వెల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న జపాన్ క్రీడాకారిణి నవోమీ ఒసాకా 6-3, 6-2 తేడాతో సెరెనాపై సులభంగా గెలిచింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆడ పిల్లకు జన్మనిచ్చిన ఆమె 13 నెలల విశ్రాంతి తర్వాత మళ్లీ కెరీర్‌ను మొదలు పెట్టింది.

03/23/2018 - 02:06

న్యూఢిల్లీ: రేప్ కేసు దాఖలు కావడంతో సౌమ్యజిత్ ఘోష్‌ను సస్పెండ్ చేయడానికి భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ) రంగం సిద్ధం చేసుకుంది. అర్జున అవార్డు గ్రహీత ఘోష్‌పై 18 ఏళ్ల యువతి చేసిన ఫిర్యాదుపై సమాఖ్య తీవ్రంగా స్పందించింది. అతనిని కామనె్వల్త్ గేమ్స్‌కు వెళ్లే భారత టీటీ బృందం నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించింది.

03/23/2018 - 02:54

కోల్‌కతా, మార్చి 22: భారత టేబుల్ టెన్నిస్ చాంపియన్ సౌమ్యజిత్ ఘోష్‌పై అత్యాచార కేసు నమోదైంది. అతను పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి, శారీరక సంబంధం పెట్టుకొని, ఇప్పుడు నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ 18 ఏళ్ల యువత బారాసాత్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 2014లో ఫేస్ బుక్ ద్వారా అతను పరిచయమయ్యాడని, ఆతర్వాత తనను ప్రేమిస్తున్నానని చెప్పాడని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.

03/23/2018 - 02:03

చెన్నై, మార్చి 22: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం మొదటి రోజున తనకు అవకాశం దక్కకపోవడంతో ఇంగ్లీష్ కౌంటీలో ఆడాల్సిందిగా ఆఫర్లు వచ్చాయని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ మురళీ విజయ్ అన్నాడు. గురువారం ఇక్కడ జరిగిన జట్టు ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న అతను మాట్లాడుతూ, మొదటి రోజు వేలంలో తనను ఎవరూ కొనుగోలు చేయని విషయాన్ని ప్రస్తావించాడు.

03/21/2018 - 23:05

ముంబయి, మార్చి 21: మహిళల క్రికెట్ టీ-20 ముక్కోణపు టోర్నమెంట్‌లో భారత్‌కు తొలి మ్యాచ్‌లోనే కఠిన పరీక్ష ఎదురుకానుంది. బలమైన ఆస్ట్రేలియాను నిలువరించి, విజయం సాధించడం హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టుకు ఎంత వరకూ సాధ్యమన్నది అనుమానంగానే కనిపిస్తున్నది.

Pages