S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/21/2018 - 23:03

న్యూఢిల్లీ, మార్చి 21: కామనె్వల్త్ గేమ్స్, ఆసియా క్రీడలతోపాటు 2020 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలను సాధించడమే తన లక్ష్యమని భారత స్టార్ రెజ్లర్, 2016 రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ స్పష్టం చేసింది.

03/21/2018 - 22:59

హరారే, మార్చి 21: ప్రపంచ కప్ క్రికెట్ క్వాలిఫయంగ్ ఈ వెంట్, సూపర్ సిక్స్‌లో భాగంగా స్కాట్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధిం చింది. వర్షం వల్ల అంతరాయం ఏర్పడిన ఈ మ్యాచ్‌లో ఫలితా నిర్ధారించడానికి డక్‌వర్త్ లూయస్ విధానాన్ని అమలు పరిచా రు.

03/21/2018 - 22:59

న్యూఢిల్లీ, మార్చి 21: కామనె్వల్త్ గేమ్స్‌లో పోటీపడేందుకు సిద్ధమైన భారత బాస్కెట్‌బాల్ బృందం త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నది. 2006లో మొదటిసారి కామనె్వల్త్ గేమ్స్‌లో అరంగేట్రం చేసిన బాస్కెట్‌బాల్‌కు ఆతర్వాత చోటు దక్కలేదు. సుమారు 12 సంవత్సరాల తర్వాత ఈసారి మళ్లీ ఈ విభాగానికి కామనె్వల్త్‌లో అభిమానులను ఆకట్టుకునే అవకాశం దక్కింది.

03/21/2018 - 22:58

న్యూఢిల్లీ, మార్చి 21: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వంటి ప్రతిష్ఠాత్మకమైన టోర్నమెంట్‌ను నిర్వహించడానికి ఎంతో కసరత్తు చేయాల్సిన టోర్నీ అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహించారనడానికి ఇదో ఉదాహరణ. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలుకావడానికి ఒక రోజు ముందు ఈ టోర్నీ ప్రారంభ వేడుకలు జరిగేవి.

03/21/2018 - 22:57

పారిస్, మార్చి 21: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రైజ్‌మనీ ఎనిమిది శాతం పెరిగింది. పురుషులు, మహిళల విభాగాల్లో చెరి 2.7 మిలియన్ డాలర్లను ప్రైజ్‌మనీగా నిర్ధారించినట్టు రోలాండ్ గారోస్ డైరెక్టర్ గో ఫార్గెట్ ప్రకటించాడు. దీనితో మొత్తం ప్రైజ్‌మనీ 48 మిలియన్ డాలర్లకు చేరినట్టు అతను తెలిపాడు.

03/21/2018 - 22:57

రియో డి జెనీరో, మార్చి 21: భారీ ధరకు బార్సిలోనా నుంచి పారిస్ సెయింట్ జర్మెయిన్ (పీఎస్‌జీ)కి తరలి వెళ్లిన బ్రెజిల్ సాకర్ సూపర్ స్టార్ నేమార్ వేగంగా కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు డాక్టర్ రాడ్రిగో లాస్మర్ ప్రకటించాడు. కాలి గాయంతో బాధపడుతున్న నేమార్‌కు ఈనెల మూడో తేదీన శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే.

03/21/2018 - 04:03

న్యూఢిల్లీలోని రాష్టప్రతి భవన్‌లో మంగళవారం జరిగిన పద్మ అవార్డులు-2018 ప్రదానం కార్యక్రమంలో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ అవార్డులు అందుకుంటున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్, టెన్నిస్ క్రీడాకారుడు సోమదేవ్ కిశోర్ దేవర్మన్

03/21/2018 - 02:23

ఢిల్లీ, మార్చి 20: నాణ్యత లేని హెల్మెట్లు తయారు చేస్తున్న ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి భారత మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ తెండూల్కర్ ఒక లేఖ రాశాడు. ‘నాణ్యతలేని మెటీరియల్‌తో హెల్మెట్లు తయారు చేసి వాటిపై ఐఎస్‌ఐ మార్కు వేస్తున్న ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోండి. క్రికెటర్‌గా నాకు హెల్మెట్‌కు ఉన్న ప్రాధాన్యత ఏమిటో తెలుసు.

03/21/2018 - 02:22

ముంబయి, మార్చి 20: రానున్న రెండు, మూడేళ్లలో తాము మునుపటి ఫాం సాధిస్తామని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపింది. ఇటీవల ఆస్ట్రేలియాతో వడోదరలో జరిగిన మూడు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల సిరీస్‌ను 0-3తో కోల్పోయిన విషయమై ఆమె ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుతం తమ జట్టు పటిష్టంగా లేదని ఒప్పుకుంది.

03/21/2018 - 02:21

న్యూఢిల్లీ, మార్చి 20: భారత మహిళా క్రికెట్ పటిష్ఠతకు ఉన్నతస్థాయిలో గట్టి చర్యలు చేపట్టనున్నారు. వడోదరలో ఇటీవల జరిగిన వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా జట్టుపై టీమిండియా ఘోరంగా ఓటమి చెందిన నేపథ్యంలో మహిళా టీమ్‌ను అన్ని విభాగాల్లో బలపరచేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

Pages