S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/08/2017 - 00:27

న్యూయార్క్, సెప్టెంబర్ 7: ఈసారి యుఎస్ ఓపెన్‌ను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకున్న ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ క్వార్టర్స్ నుంచే నిష్క్రమించాడు. అర్జెంటీనాకు చెందిన జెయింట్ కిల్లర్ జువాన్ మార్టిన్ డెల్ పొట్రో 7-5, 3-6, 7-6, 6-4 స్కోరుతో ఫెదరర్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. 2009లో యుఎస్ ఓపెన్ సాధించిన అతను ఆతర్వాత ఇప్పటి వరకూ రెండో గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకోలేకపోయాడు.

09/08/2017 - 00:31

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: గౌహతి, తిరువనంతపురం నగరాలు మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి ముస్తాబవుతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో జరిగే హోం సిరీస్‌ల షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఖరారు చేసింది. చెన్నై, కోల్‌కతా, ఇండోర్, బెంగళూరు, నాగపూర్ నగరాల్లో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య వనే్డ మ్యాచ్‌లు జరుగుతాయి.

09/08/2017 - 00:21

చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి, రెండో టెస్టును ఏడు వికెట్ల తేడాతో గెల్చుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్ల ఆనందం. మొదటి టెస్టులో బంగ్లాదేశ్ విజయం సాధించగా, సిరీస్‌ను డ్రా చేసుకోవడానికి తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఆస్ట్రేలియా అద్భుత పోరాట పటిమను కనబరచింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులకు ఆలౌట్‌కాగా, ఆసీస్ 377 పరుగులు చేసి, 72 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది.

09/07/2017 - 23:39

కొలంబో, సెప్టెంబర్ 6: బౌలర్లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ తగినంత స్వేచ్ఛనిచ్చాడని, అందుకే, ఎలాంటి ఒత్తిడి లేకుండా బంతులు వేయగలిగామని భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ఆటగాళ్ల అభిప్రాయాలకు విలువనిచ్చి, తమదైన రీతిలో ఆడే అవకాశాన్ని కెప్టెన్ ఇచ్చినప్పుడు, ప్రతి ఒక్కరూ నూటికి నూరుశాతం సేవలు అందిస్తారని వ్యాఖ్యానించాడు.

09/07/2017 - 23:38

వెల్లింగ్టన్, సెప్టెంబర్ 7: భారత్ ‘ఎ’తో జరిగే రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు, ఐదు వనే్డ మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ ‘ఎ’ జట్టుకు హెన్రీ నికోల్స్ నాయకత్వం వహిస్తాడు. నాలుగు రోజుల మ్యాచ్‌లు విజయవాడలో, వనే్డ మ్యాచ్‌లు విశాఖపట్నంలో జరుగుతాయి. ఈనెల 23 నుంచి 26 వరకు మొదటి నాలుగు రోజుల మ్యాచ్ ఉంటుంది. 30 నుంచి అక్టోబర్ 3 వరకు రెండు నాలుగు రోజుల మ్యాచ్ జరుగుతుంది.

09/07/2017 - 23:37

కోల్‌కతా, సెప్టెంబర్ 7: ప్రో కబడ్డీ లీగ్‌లో గురువారం పునేరీ పల్టన్‌ను ఎదు ర్కొన్న తెలుగు టైటాన్స్ జట్టు గొప్పగా పోరాడినప్పటికీ, ఐదు పాయంట్ల తేడా తో ఓటమిపాలైంది. కాగా, బెంగళూరు వారియర్స్, దబాంగ్ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన పోరు టైగా ముగిసింది. ఈ రెండు మ్యాచ్‌లు చివరి వరకూ ఉత్కంఠగా సాగడం విశేషం. మొదటి మ్యాచ్‌లో పునేరీ పల్టన్‌తో టైటాన్స్ అమీతుమీ తే ల్చుకోవడానికి సర్వశక్తులు ఒడ్డింది.

09/07/2017 - 23:37

దుబాయ్, సెప్టెంబర్ 7: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. టీమిండియా ఖాతాలో మొత్తం 125 పాయింట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను అతి కష్టం మీద డ్రా చేసుకున్న ఆస్ట్రేలియా నాలుగు నుంచి ఐదో స్థానానికి పడిపోగా, రెండో స్థానంలో దక్షిణాఫ్రికా, మూడో స్థానంలో ఇంగ్లాండ్ ఉన్నాయి.

09/07/2017 - 23:36

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: స్వదేశంలో జరిగే హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యుఎల్) ఫైనల్‌లో భారత్ కోసం కష్టమైన డ్రా ఎదురుచూస్తున్నది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా, ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జర్మనీ వంటి మేటి జట్లు ఉన్న గ్రూప్ ‘బి’ నుంచి భారత్ పోటీపడుతుంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) గురువారం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ఈ ఏడాది డిసెంబర్ 1న మొదలవుతాయి.

09/07/2017 - 02:03

కొలంబో, సెప్టెంబర్ 6: శ్రీలంకను టెస్టు సిరీస్‌లో 3-0, వనే్డ సిరీస్‌లో 5-0 తేడాతో చిత్తుచేసిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా బుధవారం జరిగిన ఏకైక టి-20లోనూ విజయభేరి మోగించింది. ప్రత్యర్థి తన ముందు ఉంచిన 171 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

09/07/2017 - 02:02

కోల్‌కతా, సెప్టెంబర్ 6: ప్రో కబడ్డీ లీగ్‌లో భా గంగా బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో యు ముం బా, దబాంగ్ ఢిల్లీ జట్లు విజయాలను నమోదు చేశాయ. బెంగాల్ వారియర్స్‌ను ఢీకొన్న యు ముంబా అత్యంత కష్టం మీద 6 పాయంట్ల తేడా తో గెలిచింది. ఈ జట్టు 37 పాయంట్లు సాధించగా బెంగాల్ 31 పాయంట్లు చేసింది. యు ముంబా తరఫున అనూప్ కుమార్ 11, శ్రీకాంత్ జాధవ్ 8, కషిలింగ్ అడాకే 8 చొప్పున పాయంట్లు చేశారు.

Pages