S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/03/2017 - 01:10

మియామీ, సెప్టెంబర్ 2: టెన్నిస్ సూపర్‌స్టార్ సెరెనా విలియమ్స్ తల్లి అయింది. ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. దీంతో సెరెనాకు అభిమానులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెలాఖరులో 36వ పడిలో ప్రవేశించనున్న సెరెనా విలియమ్స్ తొలి కాన్పు కోసం బుధవారం వెస్ట్ పామ్ బీచ్ (్ఫ్లరిడా)లోని సెయింట్ మేరీస్ మెడికల్ సెంటర్‌లో చేరింది.

09/03/2017 - 01:09

కొలంబో, సెప్టెంబర్ 2: ఐదు వనే్డల క్రికెట్ సిరీస్‌లో భాగంగా ఆదివారం ఆతిథ్య శ్రీలంక జట్టుతో జరిగే చివరి మ్యాచ్‌తో పాటు ఆ తర్వాత జరిగే ఏకైక అంతర్జాతీయ ట్వంటీ-20 మ్యాచ్‌కి టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అందుబాటులో ఉండటం లేదు. ధావన్ తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతను శ్రీలంక నుంచి స్వదేశానికి బయలుదేరాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

09/03/2017 - 01:08

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: జాతీయ హాకీ జట్టు చీఫ్ కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్స్‌కు హాకీ ఇండియా శనివారం ఉద్వాసన పలికింది. విజయాలకోసం ఆయన ప్రతిపాదించిన దీర్ఘకాలిక ప్రక్రియపై తమకు నమ్మకం లేకపోవడమే ఆయనను కోచ్ పదవినుంచి తప్పించడానికి కారణంగా హాకీ ఇండియా పేర్కొంది.

09/02/2017 - 00:59

న్యూయార్క్, సెప్టెంబర్ 1: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్లు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు. ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆటగాడైన ఫెదరర్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ పోరులో విజయం కోసం వరుసగా మరోసారి తీవ్రస్థాయిలో ఐదు సెట్ల పాటు శ్రమించాల్సి వచ్చింది.

09/02/2017 - 00:54

లండన్, సెప్టెంబర్ 1: ప్రముఖ ఇంగ్లండ్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు వేన్ రూనీని మద్యంమత్తులో డ్రైవ్ చేస్తున్నాడన్న ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం చెప్పారు. ఇంగ్లండ్ జాతీయ జట్టు మాజీ కెప్టెన్ అయిన రూనీ అత్యధిక గోల్స్ చేసిన ఇంగ్లండ్ ఆటగాడిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

09/02/2017 - 00:53

రోమ్, సెప్టెంబర్ 1: ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ టోర్నమెంట్ శనివారం నుంచి రోమ్‌లో ప్రారంభం కానుంది. గతంలో నాలుగుసార్లు రన్నరప్ టైటిళ్లు సాధించిన భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి ఈసారి పసిడి పతకాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ టోర్నీలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

09/02/2017 - 00:53

కొలంబో, సెప్టెంబర్ 1: ఇంగ్లండ్‌లో జరిగే 2019 ప్రపంచ కప్‌వరకూ భారత జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ కొనసాగుతాడా? అనే అనుమానాలకు జట్టు హెడ్ కోచ్ రవిశాస్ర్తీ తెరదించాడు. ధోనీ కెరీర్ సగం కూడా అయిపోలేదని, 2019 ప్రపంచ కప్ వరకు అతను జట్టులో కొనసాగుతాడని స్పష్టం చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న వన్‌డే సిరీస్‌లో ధోనీ ఆడిన మూడు మ్యాచ్‌లలోను 45, 67, 49 నాటౌట్ స్కోర్లతో అదరగొట్టిన విషయం తెలిసిందే.

09/02/2017 - 00:51

న్యూయార్క్, సెప్టెంబర్ 1: మహిళల సింగిల్స్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన పోరుగా రికార్డుకెక్కిన మహా మారథాన్ మ్యాచ్ యుఎస్ ఓపెన్‌లో గురువారం జరిగింది. అమెరికా క్రీడాకారిణి షెల్బీ రోజర్స్, ఆస్ట్రేలియాకి చెందిన 25వ సీడ్ క్రీడాకారిణి దరియా గవ్రిలోవా తలపడిన ఈ మ్యాచ్ 3 గంటల 33 నిమిషాల పాటు కొనసాగింది. ఈ పోరులో రోజర్స్ 7-7(8/6), 4-6, 7-6(7/5) తేడాతో విజయం సాధించింది.

09/02/2017 - 00:49

న్యూయార్క్, సెప్టెంబర్ 1: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జాతో పాటు రోహన్ బొపన్న తమతమ విభాగాల్లో శుభారంభాన్ని సాధించారు. పురుషుల డబుల్స్ విభాగంలో ఉరుగ్వే ఆటగాడు పాబ్లో కువాస్‌తో కలసి బరిలోకి దిగిన రోహన్ బొపన్న తొలి రౌండ్ పోరులో అమెరికాకు చెందిన బ్రాడ్లీ క్లాన్, స్కాట్ లిప్‌స్కీ జోడీపై అద్భుత విజయాన్ని సాధించారు.

09/02/2017 - 00:48

కొలంబో, సెప్టెంబర్ 1: శ్రీలంకతో గురువారం జరిగిన నాలుగో వన్‌డేలో అర్ధ సెంచరీ చేసిన మనీష్ పాండే టీమిండియాలో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పారు. ఆ మ్యాచ్‌ని 168 పరుగుల తేడాతో గెలుచుకొన్న నారత్ సిరీస్‌లో 4-0 ఆధిక్యత సాధించడం తెలిసిందే.

Pages