S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/27/2017 - 01:08

ముంబయి, జూలై 26: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవడం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో చిరస్మరణీయ విజయాలను సాధిస్తామని భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నది. ఇంగ్లాండ్‌లో జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన మిథాలీ బృందం బుధవారం ఇక్కడికి చేరుకున్నప్పుడు ఘన స్వాగతం లభించింది. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన భారత మహిళల జట్టుకు అధికారులు స్వాగతం పలికారు.

07/27/2017 - 01:08

గాలే: యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన 289వ ఆటగాడిగా చరిత్ర పుస్తకంలోకి ఎక్కాడు. జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అతనికి టెస్టు క్యాప్‌ను అందచేశాడు. కొద్ది రోజుల క్రితమే తుది జట్టులోకి పాండ్యను తీసుకునే అవకాశం ఉందని పరోక్షంగా ప్రకటించిన కోహ్లీ, ఇప్పుడు ఆ వార్తను నిజం చేశాడు.

07/27/2017 - 01:08

న్యూఢిల్లీ, జూలై 26: లోధా కమిటీ చేసిన సిఫార్సుల్లో ఐదింటిని మినహాయించి, మిగతా వాటిని అమలు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించింది. బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో లోధా సిఫార్సులపై విస్తృతంగా చర్చించింది. మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఐదు కీలక అంశాలపై మరోసారి విముఖత ప్రదర్శించింది. అవి తప్ప మిగతా సిఫార్సులను ఆమోదించింది.

07/25/2017 - 20:11

న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించే సత్తా ఉన్నప్పటికీ, మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టు కొన్ని పొరపాట్లు చేసిందని, అందుకే రన్నరప్ ట్రోఫీకి పరిమితమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఫైనల్‌లో పరాజయాన్ని చవిచూసినప్పటికీ, యావత్ భారత దేశం మిథాలీ బృందం సాగించిన పోరాటానికి నీరాజనాలు పలకడం విశేషం. భారత మహిళా క్రికెటర్లను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.

07/25/2017 - 00:49

లండన్, జూలై 24: ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో తీవ్రమైన ఒత్తిడికి గురికావడమే తమ ఓటమికి ప్రధాన కారణమని భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పింది. తుది పోరులో ఓడినప్పటికీ, ఈ టోర్నీ మొత్తంలో జట్టు అద్భుతంగా ఆడిందని, అందుకు తాను గర్వపడుతున్నానని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

07/25/2017 - 00:47

న్యూఢిల్లీ: ఇంగ్లాండ్‌తో జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓడినప్పటికీ, చివరి వరకూ వీరోచితంగా పోరాడిన భారత జట్టును పలువురు వేర్వేరు మాధ్యమాల్లో ప్రశంసించారు. మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత జట్టు చివరి వరకూ గట్టిపోటీనిచ్చిందని, ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. వరల్డ్ కప్‌లో భారత్ ఆటతీరు అద్భుతంగా ఉందని మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

07/25/2017 - 00:46

చండీగఢ్, జూలై 24: ప్రస్తుతం వెస్టర్న్ రైల్వేస్‌లో పని చేస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సూపర్ ఆఫర్ ఇచ్చాడు. మహిళల ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో అజేయ శతకంతో రాణించిన హర్మన్ అంగీకరిస్తే, ఆమెకు పంజాబ్ పోలీస్ శాఖలో డిఎస్పీగా నియమిస్తామని ప్రకటించాడు.

07/25/2017 - 00:45

ఆనాహెమ్ (అమెరికా), జూలై 24: యుఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను హెచ్‌ఎస్ ప్రణయ్ దక్కించుకున్నాడు. ఇద్దరు భారతీయుల మధ్య జరిగిన ఈ టైటిల్ పోరు అందరినీ ఆకట్టుకుంది. హోరాహోరీగా పోరాడిన ప్రణయ్ 21-15, 22-20, 21-12 స్కోరుతో కశ్యప్‌ను ఓడించాడు.

07/25/2017 - 00:44

హెడింగ్లే, జూలై 24: సీనియర్స్ స్థాయి క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రాస్ వైట్లీకి చోటు దక్కింది. వర్సెస్టర్‌షైర్ తరఫున ఆడుతున్న అతను ఇంగ్లీష్ టి-20 టోర్నమెంట్‌లో భాగంగా యార్క్‌షైర్ స్పిన్నర్ కార్ల్ కార్వెర్ బౌలింగ్‌లో ఆరు బంతులను ఆరు సిక్సర్లుగా మార్చాడు. అయితే, ఆ మ్యాచ్‌లో వర్సెస్టర్‌షైర్ 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

07/25/2017 - 00:42

న్యూఢిల్లీ, జూలై 24: భారత క్రికెట్‌పై పెత్తనం చెలాయించడానికి శత విధాలా ప్రయత్నిస్తున్న బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్, సీనియర్ అధికారి నిరంజన్ షాకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బోర్డు సమావేశాల్లో పాల్గొనే అర్హత వీరికి లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన బోర్డు సమావేశాలకు శ్రీని, షా హాజరుకావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Pages