S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/31/2017 - 01:44

న్యూఢిల్లీ, జూలై 30: ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనే అర్హత లభిస్తుందని తాను ఊహించలేదని భారత యువ బాడ్మింటన్ స్టార్ సమీర్ వర్మ అన్నాడు. ఆదివారం అతను పిటిఐతో మాట్లాడుతూ, అనుకోకుండా తనకు అవకాశం కలిసివచ్చిందని, దీనిని సద్వినియోగం చేసుకొని పతకంతోనే తిరిగి వస్తానని అన్నాడు. ఈ ఏడాది మే మాసం వరకూ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడే అవకాశం తనకు ఉండిందని, కానీ, సింగపూర్ ఓపెన్‌లో విఫలమయ్యానని చెప్పాడు.

07/31/2017 - 01:49

న్యూఢిల్లీ, జూలై 30: చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న 48వ గ్రాండ్ ప్రీ ఉస్తీ నాడ్ లాబెమ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో రాణించింది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం ఐదు స్వర్ణాలు, రెండు రజతాలతోపాటు ఒక కాంస్య పతకాన్ని కూడా సాధించింది. ప్రపంచ చాంపియన్‌షిప్స్ కాంస్య పతక విజేత శివ ధాపా 60 కిలోల విభాగంలో విజేతగా నిలిచాడు.

07/31/2017 - 01:40

మియామీ, జూలై 30: ఇంటర్నేషనల్ చాంపియన్స్ కప్ సాకర్ టైటిల్‌ను బార్సిలోనా కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఈ జట్టు చిరకాల ప్రత్యర్థి రియల్ మాడ్రిడ్‌ను 3-2 తేడాతో ఓడించింది. గారార్డ్ పెక్ కీలక గోల్ చేసి, బార్సిలోనా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బార్సిలోనాకు స్టార్ ఆటగాళ్లు లియోనెల్ మెస్సీ, ఇవాన్ రాకిటిక్ చెరొక గోల్ అందించారు.

07/30/2017 - 01:35

గాలే, జూలై 29: శ్రీలంకతో గాలే స్టేడియంలో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 304 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్‌లో 17వ శతం సాధించి, భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌ను మూడు వికెట్ల నష్టానికి 240 పరుగుల స్కోరువద్ద డిక్లేర్ చేసిన కోహ్లీ సేన తన ప్రత్యర్థి ముందు 550 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

07/30/2017 - 01:33

భారత్ తొలి ఇన్నింగ్స్: 133.1 ఓవర్లలో 600 ఆలౌట్ (శిఖర్ ధావన్ 190, చటేశ్వర్ పుజారా 153, అజింక్య రహానే 57, రవిచంద్ర అశ్విన్ 47, నువాన్ ప్రదీప్ 6/132, లాహిరు కుమార 3/131-3).
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్: 78.3 ఓవర్లలో 291 ఆలౌట్ (ఉపుల్ తరంగ 64, ఏంజెలో మాథ్యూస్ 83, దిల్‌రువాన్ పెరెరా 92 నాటౌట్, మహమ్మద్ షమీ 2/45, రవిచంద్రన్ అశ్విన్ 1/84, రవీంద్ర జడేజా 3/67, హార్దిక్ పాండ్య 1/13).

07/30/2017 - 01:32

బెంగళూరులో అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన మహిళల ఆసియా కప్
‘బి’ డివిజన్ టైటిల్‌ను సాధించిన భారత జట్టు ఆనందం. ఫైనల్‌లో కజకిస్తాన్‌ను భారత్ ఓడించి టైటిల్ అందుకుంది

07/30/2017 - 01:30

మాడ్రిడ్, జూలై 29: రియల్ మాడ్రిడ్ తరఫున ఆడుతున్న పోర్చుగీసు సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో పన్ను ఎగవేత కేసులో సోమవారం కోర్టు ముందుకు హాజరవుతాడని సమాచారం. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న క్రీడాకారుడిగా ఎదిగిన అతను 17.2 మిలియన్ డాలర్లు (సుమారు 117 కోట్ల రూపాయలు) మేరకు పన్ను ఎగవేశాడన్న అభియోగాన్ని ఎదుర్కొంటున్నాడు.

07/30/2017 - 01:43

గాలే, జూలై 29: శ్రీలంకలో 2015లో పర్యటించినప్పుడు గాలే మైదానంలోనే అనుకోని ఓటమి ఎదురైందని, ఆ పరాజయానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నామని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మొదటి టెస్టును నాలుగు రోజుల్లోనే ముగించిన తర్వాత అతను విలేఖరులతో మాట్లాడుతూ నిజానికి రెండేళ్ల క్రితం జరిగిన మ్యాచ్‌లోనూ తాము గెలిచే స్థితిలోనే ఉన్నామని, కానీ, ఎవరూ ఊహించని రీతిలో ఓడామని చెప్పాడు.

07/30/2017 - 01:27

న్యూఢిల్లీ, జూలై 29: మహిళా అథ్లెట్ పియు చిత్ర కేసులో కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఎఎఫ్‌ఐ)కి కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్ సూచించాడు. ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ మహిళల 1,500 మీటర్ల విభాగంలో చిత్ర స్వర్ణ పతకం సాధించింది.

07/30/2017 - 01:37

హైదరాబాద్, జూలై 29: ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో టెలు గు టైటాన్స్ జట్టు అనూహ్యంగా పాట్నా పైరేట్స్ చేతిలో ఓటమిపాలైంది. పరదీప్ నర్వాల్ 15 పరుగులు సాధించడంతో పాట్నా పైరేట్స్ జట్టు 35 పాయంట్లు చేయగలిగింది. మోనూ గోయత్ 8, విశాల్ మానే 3 చొప్పున పాయంట్లు సంపాదించారు. హైదరాబాద్ తరఫున రాహుల్ చౌదరి 7 పాయంట్లతో టాపర్‌గా నిలిచాడు.

Pages