S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/01/2017 - 00:56

గాలే, జూలై 31: శ్రీలంకతో జరిగిన మొదటి మ్యాచ్‌లో టెస్టు ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తన తొలి బ్యాటింగ్‌ను వనే్డ ఇన్నింగ్స్‌తో పోల్చాడు. ఆ మ్యాచ్‌లో 49 బంతుల్లోనే 50 పరుగులు సాధించిన పాండ్య భారత స్కోరు వేగంగా 600 పరుగుల మైలురాయికి చేరుకోవడంలో తనవంతు పాత్ర పోషించాడు.

08/01/2017 - 00:54

షాంఘై, జూలై 31: బ్రెజిల్ ఫుట్‌బాల్ మెగాస్టార్ నేమార్ చైనాలో సందడి చేస్తున్నాడు. షాంఘై విమానాశ్రయానికి చేరుకున్న అతనికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అత్యంత భారీ బందోబస్తు మధ్య అతనిని హోటల్‌కు తీసుకెళ్లారు. విమానాశ్రయం వెలుపల, అతను బస చేసే హోటల్ వద్ద అభిమానులు భారీ సంఖ్యలో గుమిగూడారు. నేమార్‌ను చూసేందుకు పోటీపడ్డారు.

08/01/2017 - 00:52

గాలే, జూలై 31: నెట్ ప్రాక్టీస్‌లో టీమిండియా కోచ్ రవి శాస్ర్తీ కొత్త టెక్నిక్‌ను ప్రవేశపెట్టాడు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఏ విధంగా ఆడతారో అదే రీతిలో నెట్స్‌లో ఆడాలని క్రికెటర్లకు సూచించాడు. అతను అనుసరించిన విధానం అద్భుత ఫలితాన్నిచ్చింది. ఓపెనర్ శిఖర్ ధావన్ తన కెరీర్‌లో అత్యుత్తమంగా 190 పరుగులు సాధించాడు. చటేశ్వర్ పుజారా శతకంతో అదరగొట్టాడు.

08/01/2017 - 00:51

న్యూఢిల్లీ, జూలై 31: చైనా బాక్సర్ జుల్పీకర్ మైమైతియాలీని శనివారం ముంబయిలో జరిగే ఫైట్‌లో చిత్తుచేస్తానని భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. జుల్పీకర్ తన ముందు ఎక్కువ సేపు నిలబడలేడని వ్యాఖ్యానించాడు. విజేందర్ డబ్ల్యుబివో ఆసియా పసిఫిక్ మిడిల్‌వెయిట్ చాంపియన్‌కాగా, జుల్పీకర్ డబ్ల్యుబివో ఓరియంటల్ సూపర్ మిడిల్‌వెయిట్ విజేత.

08/01/2017 - 00:50

లండన్, జూలై 31: కెన్యాకు చెందిన మిడిల్ డిస్టెన్స్ రన్నర్ డేవిడ్ రుడిషా శుక్రవారం నుంచి ప్రారంభం కాను న్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనడం లేదు. గాయం కారణంగా తాను వైదొలగుతున్నట్టు రుడి షా ప్రకటించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో అతను పురుషుల 800 మీటర్ల పరుగును 40.91 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

08/01/2017 - 00:48

న్యూఢిల్లీ, జూలై 31: లాసోస్ ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను భారత ఆటగాడు రాహుల్ యాదవ్ కైవసం చేసుకున్నాడు. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం నైజీరియాలో జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్‌లో అతను మన దేశానికే చెందిన కరన్ రాజన్ రాజరాజన్‌ను 21-15, 21-13 తేడాతో ఓడించాడు. నిరుడు మారిషస్ ఓపెన్ టైటిల్‌ను సాధించిన ఈ 19 ఏళ్ల యువ ఆటగాడు మరోసారి అదే స్థాయిలో రాణించి సత్తా చాటాడు.

08/01/2017 - 00:47

న్యూఢిల్లీ, జూలై 31: దేశంలో అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే అవకాశం మరో రెండు కేంద్రాలకు లభించే అవకాశాలున్నాయి. వీటిలో ఒకటి తిరువనంతపురం (కేరళ) స్టేడియంకాగా, మరొకటి అస్సాంలోని బర్సాపరాలో కొత్తగా నిర్మించిన స్టేడియం. ఈ ఏడాది సెప్టెంబర్-డిసెంబర్ మధ్యకాలంలో టీమిండియా రికార్డు స్థాయిలో 23 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడడం దాదాపు ఖాయమైంది.

07/31/2017 - 01:51

న్యూఢిల్లీ, జూలై 30: మహిళల 3,000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ రన్నర్ సుధా సింగ్‌కు నిరాశ తప్పలేదు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఎఎఫ్‌ఐ) నిర్వాకం కారణంగా ఆశనిరాశల మధ్య ఊగిసలాడిన సుధ తనకు అధికారులు మొండి చేయి చూపారని తెలుసుకొని దిగ్భ్రాంతికి గురైంది. వివరాల్లోకి వెళితే, లండన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనేందుకు 24 మంది సభ్యులతో కూడిన జాబితాను ఎఎఫ్‌ఐ విడుదల చేసింది.

07/31/2017 - 01:46

హైదరాబాద్, జూలై 30: ప్రో కబడ్డీ లీగ్‌లోకి కొత్తగా అడుగు పెట్టిన హర్యానా స్టీలర్స్ ఆదివారం నాటి మ్యాచ్‌లో యు ముంబాతో చివరి వరకూ పోరాడి, ఒక పాయంట్ తేడాతో ఓడించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో యు ముంబా 29 పాయంట్లు సాధించగా, హర్యానా 28 పాయంట్లు సంపాదించింది. కషిలింగ్ 7, అనూప్ కమార్ 6, సురీందర్ సింగ్ 4 చొప్పున పాయంట్లు సాధించి, యు ముంబాను విజయపథంలో నడిపారు.

07/31/2017 - 01:45

గాలే, జూలై 30: శ్రీలంకను మొదటి టెస్టులో 304 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సభ్యులు ఆటపాటల్లో బిజీ అయ్యారు. ఐదు రోజు మ్యాచ్ నాలుగు రోజుల్లోనే ముగియడంతో, షెడ్యూల్ ప్రకారం చివరి రోజైన ఆదివారం టీమిండియా ఆటగాళ్లకు ఆటవిడుపు లభించింది.

Pages