S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/15/2017 - 01:48

బర్మింగ్‌హామ్, జూన్ 14: డిఫెండింగ్ చాంపియన్ భారత్ గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే చాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్‌లో హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగనుంది. కాగితంపై చూస్తే, అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థి కంటే టీమిండియా బలంగా కనిపిస్తున్నది. అయితే, పరిమిత ఓవర్ల ఫార్మాట్ అంటేనే అనూహ్య ఫలితాలకు వేదిక. అందులోనూ, బంగ్లాదేశ్ వంటి జట్టు పోటీలో ఉన్నప్పుడు, ముందుగానే ఫలితాన్ని ఊహించడం అసాధ్యమవుతుంది.

06/15/2017 - 01:45

జకార్తా, జూన్ 14: ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు హెచ్‌ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. ప్రంచ ర్యాంకింగ్స్‌లో 29వ స్థానంలో ఉన్న ప్రణయ్ తన కంటే ఏడు స్థానాలు ముందున్న ఆంథోనీ సిరిసకా గింటింగ్‌ను 21-13, 21-18 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. మొదటి సెట్‌ను సునాయాసంగానే గెల్చుకున్న ప్రణయ్‌కి రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి ఎదురైంది.

06/15/2017 - 01:45

లండన్, జూన్ 14: భారత స్టార్ డిఫెండర్ రూపీందర్‌పాల్ సింగ్ గురువారం నుంచి మొదలయ్యే హాకీ వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్స్ పోటీలకు అందుబాటులో ఉండడం లేదు. కాలి కండరాలు బెణకడంతో అతను బాధపడుతున్నాడని, మ్యాచ్ ఆడే అవకాశం లేదని భారత జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. కాగా, సమర్థుడైన డ్రాగ్ ఫ్లికర్‌గా పేరు తెచ్చుకున్న ఎస్‌కె ఉతప్ప కూడా ఈ పోటీల్లో పాల్గొనడం లేదు.

06/15/2017 - 01:43

బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరుగుతున్న ఎఎఫ్‌సి ఆసియా కప్ సాకర్ క్వాలిఫయర్‌లో భాగంగా బుధవారం కిర్గిజ్ రిపబ్లిక్‌ను 1-0 తేడాతో ఓడించిన భారత ఫుట్‌బాల్ క్రీడాకారుల ఆనందం

06/15/2017 - 01:41

దహా, జూన్ 14: రష్యాలో జరిగే 2018 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే అవకాశాలను కతార్ సజీవంగా నిలబెట్టుకుంది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో కతార్ 3-2 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. 2022 వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న కతార్ అంతకు ముందు జరిగే ఈ మెగా టోర్నీలో ఆడాలన్న పట్టుదలతో ఉంది. అందుకే క్వాలిఫయర్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నది.

06/15/2017 - 01:40

కోల్‌కతా, జూన్ 14: చాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్‌లో భారత్‌పైనే ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్లు మహమ్మద్ అషఫ్రుల్, హబీబుల్ బషర్ వ్యాఖ్యానించారు. బుధవారం వీరు ఢాకా నుంచి పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సెమీస్‌లో బంగ్లాదేశ్ ‘అండర్ డాగ్’ ముద్ర వేయించుకొని, బరిలోకి దిగుతున్నదని, కాబట్టి, ఫేవరిట్‌గా ఉన్న విరాట్ కోహ్లీ బృందం ఒత్తిడికి లోనవుతుందని అన్నారు.

06/14/2017 - 00:52

కార్డ్ఫి, జూన్ 13: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ ఫేవరిట్‌గా బరిలోకి దిగనుంది. బుధవారం జరిగే ఈ మ్యాచ్‌లో, ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ చివరి క్షణం వరకూ పోరాడడం ఖాయం. సుమారు 42 ఏళ్లుగా ఐసిసి మేజర్ టోర్నీలో టైటిల్ కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, ఇంగ్లాండ్‌కు కల ఫలించడం లేదు. ప్రపంచ కప్‌లో మూడు పర్యాయాలు ఫైనల్ చేరినా, విజేతగా నిలవలేకపోయింది.

06/14/2017 - 00:50

జకార్తా, జూన్ 13: భారత టాప్ షట్లర్లు సైనా నెహ్వాల్, పివి సింధు ఇక్కడ మొదలైన ఇండోనేషియా సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ మొదటి రౌండ్స్‌లో తమతమ ప్రత్యర్థులను ఓడించి శుభారంభం చేశారు. సైనా 17-21, 21-18, 21-12 తేడాతో థాయిలాండ్‌కు చెందిన రచానొక్ ఇంతనాన్‌పై గెలుపొందగా, సింధు 21-12, 21-19 ఆధిక్యంతో థాయిలాండ్‌కే చెందిన పొర్న్‌పవీ చొచువాంగ్‌పై విజయం సాధించింది.

06/14/2017 - 00:48

కోల్‌కతా, జూన్ 13: బెంగాల్ క్రికెట్ సంఘం (కాబ్) వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ, లాల్ బజార్ పోలీస్ స్టేషన్‌లో కాబ్ అధికారులు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఈనెల 9న వెబ్‌సైట్‌ను ఎవరో హ్యాక్ చేశారని, అయితే, అందులోటా డాటా పదిరంగానే ఉందని వారు పేర్కొన్నారు. త్వరలోనే సమస్యను అధిగమించి, వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తామని తెలిపారు.

06/14/2017 - 00:48

కార్డ్ఫి, జూన్ 13: చాంపియన్స్ ట్రోఫీలో అత్యంత కీలకంగా మారిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించిన తర్వాత తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఇంగ్లాండ్‌తో సెమీస్‌కు తాము సిద్ధమని పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ అన్నాడు.

Pages