S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/23/2016 - 00:29

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఇటీవల జూనియర్ హాకీ ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు కోచ్ హరేంద్ర సింగ్‌కు ఎయిర్ ఇండియా 25,000 రూపాయల నజరానా ప్రకటించింది. అదే విధంగా ఆ జట్టులో ఆడిన అర్మాన్ ఖురేషీకి 10,000 రూపాయలు ఇవ్వనున్నట్టు ఒక ప్రకటనలో తెలిదింది. తమ సంస్థలో వీరిద్దరూ పని చేయడం ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపింది. క్రీడలను భవిష్యత్తులోనూ ఇదే విధంగా ప్రోత్సహిస్తామని ప్రకటించింది.

12/23/2016 - 00:29

దుబాయ్, డిసెంబర్ 22: భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) 2016 సంవత్సరానికి ప్రకటించిన వనే్డ జట్టులో కెప్టెన్ హోదా లభించింది. అయితే, మండలి విడుదల చేసిన టెస్టు జట్టులో అతనికి స్థానం లభించలేదు. వనే్డ జట్టుకు కోహ్లీని కెప్టెన్‌గా ఎంపిక చేసిన ఐసిసి, టెస్టు జట్టుకు అలస్టర్ కుక్ పేరును ఖాయం చేసింది.

12/23/2016 - 00:27

లండన్, డిసెంబర్ 22: ఇంగ్లాండ్‌లో వచ్చే ఏడాది జరిగే ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ టికెట్లకు భారీ స్పందన వచ్చింది. 60 దేశాల నుంచి 4,17,000 టికెట్లకు ఆర్డర్లు వెల్లువెత్తాయి. మొత్తం 15 మ్యాచ్‌ల్లో 11 మ్యాచ్‌లకు సంబంధించి, అన్ని ధరల్లోనూ టికెట్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి.

12/23/2016 - 00:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఇటీవల కాలంలో ప్రముఖంగా వినిపించిన వాదనే నిజమైంది. భారత డేవిస్ కప్ జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా ఉన్న ఆనంద్ అమృత్‌రాజ్‌పై వేటు పడింది. అతని స్థానంలో మహేష్ భూపతిని నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా నియమిస్తున్నట్టు అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఎఐటిఎ) ప్రధాన కార్యదర్శి హరణ్మయ్ చటర్జీ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పాడు.

12/23/2016 - 00:23

న్యూఢిల్లీ: భారత డేవిస్ కప్ జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా కొనసాగడం మహేష్ భూపతికి కష్టమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవుట్ గోయింగ్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్ అనంద్ అమృత్‌రాజ్ కూడా ఇలాంటి అనుమానమే వ్యక్తం చేశాడు. ఎఐటిఎ నుంచి అతనికి సరైన సహకారం లభిస్తుందా అన్నది అనుమానమేనని అన్నాడు. సహజంగా ప్రతి కొత్త కెప్టెన్‌కు ఎదురయ్యే సమస్యలే భూపతిని కూడా వేధిస్తాయని జోస్యం చెప్పాడు.

12/23/2016 - 00:22

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: రెండు పర్యాయాలు ఒలింపిక్స్‌లో ఆడిన యుఎస్ ఓపెన్ మాజీ ఫైనలిస్టు రోహన్ బొపన్నపై వేటు వేసి, షాకిచ్చింది. న్యూజిలాండ్‌తో జరిగే డేవిస్ కప్ పోటీల్లో పాల్గొనే భారత జట్టులో అతనికి స్థానం దక్కలేదు. వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్‌కు భాగస్వామిగా సాకేత్ మైనేనికి అవకాశం కల్పించారు.

12/23/2016 - 00:20

జొహానె్నస్‌బర్గ్, డిసెంబర్ 22: స్పాట్ ఫిక్సింగ్ కేసులో దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ అల్విరో పెటెర్సెన్‌పై రెండేళ్ల సస్పెన్షన్ వేటు పడింది. 2014-15 సీజన్‌లో దక్షిణాఫ్రికాలో జరిగిన పలు మ్యాచ్‌లు ఫిక్సింగ్‌కు గురయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

12/22/2016 - 08:17

మాంట్రెక్స్ (స్విట్జర్లాండ్), డిసెంబర్ 21: ఈ ఏడాది తమతమ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనతో రాణించిన భారత బాక్సర్లు, మేరీ కోమ్, వికాస్ కిషన్‌లకు అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఎఐబిఎ) అవార్డులు లభించాయి. అత్యంత వైభవంగా ఇక్కడ జరిగిన సమాఖ్య 70వ వార్షికోత్సవంలో మేరీ కోమ్ ‘లెజెండ్స్’ అవార్డును స్వీకరించింది. వికాస్‌కు ప్రొఫెషనల్స్ విభాగంలో ఉత్తమ బాక్సర్ ట్రోఫీ దక్కింది.

12/22/2016 - 08:16

లండన్, డిసెంబర్ 21: ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ అలస్టర్ కుక్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ద్వైపాక్షిక టెస్టు క్రికెట్ సిరీస్‌లు 1932లో భారత జట్టు ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లడంతో మొదలయ్యాయి. ఇప్పటి వరకూ రెండు జట్ల మధ్య 117 మ్యాచ్‌లు జరిగితే, ఇంగ్లాండ్ 43 విజయాలు సాధించింది. భారత్ 25 మ్యాచ్‌లను సొంతం చేసుకోగా, 49 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

12/22/2016 - 08:15

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) అధ్యక్షుడిగా ప్రఫుల్ పటేల్ వరుసగా మూడోసారి ఎన్నికై, హ్యాట్రిక్ సాధించాడు. అతను నాలుగేళ్లు ఈ పదవిలో కొనసాగుతాడు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాను అనుసరించి ఇక్కడ జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎఐఎఫ్‌ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.

Pages