S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/24/2016 - 00:48

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఇటీవల జరిగిన ఎన్నికల్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్షుడిగా ఎన్నికైన నరీందర్ బత్రాను భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) శుక్రవారం ఘనంగా సన్మానించింది. ఇక్కడి ఒలింపిక్ భవన్‌లో అతనితోపాటు ఐఒఎ చీఫ్ రామచంద్రన్ కూడా సన్మానం పొందాడు.

12/24/2016 - 00:45

నగానో (జపాన్), డిసెంబర్ 23: భారత వింటర్ ఒలింపియన్ శివ కేశవన్ ఇక్కడ జరిగిన ఆసియా ల్యూజ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించాడు. ఒకానొక దశలో గంటకు 130.4 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన అతను రెండో హీట్‌ను ఒక నిమిషం, 39.962 సెకన్లలో పూర్తి చేశాడు. ఆ టైమింగ్ అతనికి స్వర్ణాన్ని సంపాదించిపెట్టింది. జపాన్‌కు చెందిన తనకా షోహే ఒక నిమిషం, 44.874 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసి రజత పతకాన్ని అందుకున్నాడు.

12/24/2016 - 00:42

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు వచ్చేనెల 3వ తేదీన ఇవ్వబోయే తీర్పు ఎలా ఉంటుందో వేచి చూస్తామని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నాడు. ప్రస్తుత పరిస్థితులు క్రికెటర్లకు మేలు చేసేవిగా లేవని ప్రో రెజ్లింగ్ లీగ్ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఠాకూర్ వ్యాఖ్యానించాడు. కేసు కోర్టులో ఉన్నందున తాను ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడలేనని చెప్పాడు.

12/24/2016 - 00:42

న్యూఢిల్లీ: గతంలో రెండు పర్యాయాలు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ప్రేమ్ కుమార్ ధుమాల్ కుమారుడే అనురాగ్ ఠాకూర్. అందుకే, రాజకీయాలు అతనికి కొత్తకాదు. అంతేగాక, చాలా మంది క్రికెటర్లతో అతనికి మంచి సంబంధాలున్నాయి. అతను బిసిసిఐ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా వంటి సీనియర్ క్రికెటర్లకు మళ్లీ జాతీయ జట్టులో స్థానం దక్కడం గమనార్హం.

12/24/2016 - 00:41

మెల్బోర్న్, డిసెంబర్ 23: ఆస్ట్రేలియా, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య సోమవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో ఉద్రవాద దాడులకు వ్యూహ రచన చేస్తున్నారని అనుమానిస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

12/24/2016 - 00:38

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఫుట్‌బాల్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 135వ స్థానం లభించింది. 2009 తర్వాత భారత్‌కు ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం గమనార్హం. అప్పట్లో భారత్ 134వ స్థానాన్ని సంపాదించింది. ఈడాదిని 135వ స్థానంతో ముగిస్తున్నది. భారత ఫుట్‌బాల్ జట్టు చాలాకాలం తర్వాత మెరుగైన ర్యాంక్‌ను అందుకున్నప్పటికీ, సాధించాల్సి ఎంతో ఉందని కోచ్ స్టెఫెన్ కాన్‌స్టాంటైన్ వ్యాఖ్యానించాడు.

12/24/2016 - 00:38

కొలంబో, డిసెంబర్ 23: అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. శుక్ర వారం జరిగిన ఫైనల్‌లో భారత్ 34 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి వరుసగా మూడోసారి విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 273 పరుగులు సాధించింది. అనంతరం శ్రీలంక 239 పరుగులకు ఆలౌటైంది.

12/24/2016 - 00:37

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: భారత బాక్సర్లలో వికాస్ కిషన్ టాపర్‌గా ఈ ఏడాదిని ముగిస్తున్నాడు. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) తాజాగా ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అతనికి 75 కిలోల విభాగంలో నాలుగో స్థానం దక్కింది. రియో ఒలింపిక్స్‌లో వికాస్ క్వార్టర్ ఫైనల్స్ చేరిన విషయం తెలిసిందే. ఎఐబిఎ అతనిని ఇప్పటికే ఉత్తమ ప్రో బాక్సర్‌గా ఎంపిక చేసింది.

12/24/2016 - 00:36

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: అంతర్జాతీయ ఈవెంట్స్‌లో మెరుగైన ప్రదర్శనతో రాణించాలంటే అందుకు తగిన సన్నాహాలు చేసుకోవాల్సిన అవసరం ఉందని రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ అన్నది. క్రమం తప్పకుండా విదేశాల్లో ఏడాదికి కనీసం రెండు పర్యాయాలు శిక్షణా శిబిరాలను నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని భారత రెజ్లింగ్ అధికారులకు ఆమె సూచించింది.

12/23/2016 - 00:30

దుబాయ్, డిసెంబర్ 22: ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) 2015-16 సీజన్‌కు ప్రకటించిన రెండు అత్యుత్తమ అవార్డులను దక్కించుకొని డబుల్ బొనాంజాను కొట్టేశాడు.

Pages