S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/25/2016 - 02:37

హైదరాబాద్, డిసెంబర్ 24: వివిధ అంతర్జాతీయ ఈవెంట్స్‌లో మెరిసిన బాడ్మింటన్ స్టార్లతోపాటు, ఎవరూ ఊహించని విధంగా విఫలమైన వారు కూడా ఫామ్‌పై దృష్టి కేంద్రీకరించారు. ఒకటో తేదీ నుంచి మొదలుకానున్న ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)లో పోటీ పడేందుకు ఆరు ఫ్రాంచైజీ జట్లు సిద్ధంగా ఉన్నాయి.

12/25/2016 - 02:02

విశాఖపట్నం, డిసెంబర్ 24: జాతీయ జట్టులో టెస్టు ఓపెనర్‌గా ప్రధాన భూమిక పోషిస్తున్న లోకేష్ రాహుల్, ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టులో ఏకంగా ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టిన కరుణ్ నాయర్ వంటి ఆటగాళ్లు ఉన్న కర్నాటక జట్టు ఇక్కడ జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో చిత్తయింది. నాలుగు రోజుల ఈ మ్యాచ్‌ని కేవలం రెండు రోజుల్లోనే ముగించిన తమిళనాడు సెమీస్‌కు దూసుకెళ్లింది.

12/25/2016 - 01:59

వెల్లింగ్టన్, డిసెంబర్ 24: వచ్చేనెల జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అర్జెంటీనా ఆటగాడు జువాన్ డెల్ పొట్రో పాల్గొనడం లేదు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 38వ స్థానంలో ఉన్న డెల్ పొట్రో చాలాకాలంగా ఫిట్నెస్ సమస్యతో సతమతమవుతున్నాడు. గాయాల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, అందుకే, ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనడం లేదని అతను ఒక ప్రకటనలో తెలిపాడు.

12/25/2016 - 01:58

లాసనే్న, డిసెంబర్ 24: సోచీ వింటర్ ఒలింపిక్స్‌లో నకిలీ డోప్ శాంపిల్స్ ఆరోపణలపై అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) విచారణను ముమ్మరం చేసింది. మొత్తం 28 మంది రష్యన్లను ఇప్పటికే దోషులుగా తేల్చింది. వీరిపై విచారణ కొనసాగుతున్నదని ఐఒసి ప్రకటించింది.

12/25/2016 - 01:57

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: నాలుగేళ్లు వేధించిన సమస్యకు తెరపడడంతో, తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భారత బాక్సర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అఖిల భారత బాక్సింగ్ సంఘంపై నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు రావడంతో, అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) దానిపై సస్పెన్షన్ వేటు వేసింది.

12/25/2016 - 01:55

పోర్ట్ ఎలిజబెత్, డిసెంబర్ 24: అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికాపై సోమవారం నుంచి ప్రారంభం కానున్న మొదటి టెస్టులో శ్రీలంక కఠిన పరీక్ష ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తున్నది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో లంక ‘అండర్ డాగ్’ ముద్రతో బరిలోకి దిగుతున్నది.

12/25/2016 - 01:53

బ్యూనస్ ఎయిర్స్, డిసెంబర్ 24: తన చిరకాల స్నేహితురాలు, చాలాకాలంగా తాను సహజీవనం చేస్తున్న ఆంటోనెల్లా రొకూజోను పెళ్లి చేసుకోవడానికి అర్జెంటీనా సాకర్ హీరో లియోనెల్ మెస్సీ ఏర్పాట్లు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మెస్సీ ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. అయితే, వచ్చే ఏడాది వేసవిలో వీరి వివాహం జరుగుతుందని, అందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని అర్జెంటీనా మీడియా వార్తా కథనాలను ప్రచురించింది.

12/25/2016 - 01:51

టోక్యో, డిసెంబర్ 24: జపాన్ ఒకవైపు 2020 ఒలింపిక్స్‌కు సిద్ధమవుతుండగా, అక్కడి ప్రభుత్వం బడ్జెట్‌లో కోత పెట్టింది. మొత్తం 17 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయడానికి వీల్లేదని ఒలింపిక్ నిర్వాహణ కమిటీ (ఒసి)ని ఆదేశించింది. బ్రెజిల్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో అక్కడ ఒలింపిక్స్‌ను నిర్వహించడంతో నానా గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

12/24/2016 - 05:40

చిత్రం..ముంబయిలోని సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్‌కేర్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొని, కేన్సర్ బాధిత చిన్నారులను పరామర్శిస్తున్న భారత క్రికెటర్ యువరాజ్ సింగ్

12/24/2016 - 00:49

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌కు పదవీ గండం తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. జనవరి 3న సుప్రీం కోర్టు బోర్డుకు వ్యతిరేకంగానే వస్తుందన్న అనుమానాలు బలపడుతుండగా, తాను చివరి వరకూ వేచి చూస్తానని ఠాకూర్ అంటున్నాడు.

Pages