S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/29/2016 - 07:16

న్యూఢిల్లీ, ఆగస్టు 28: రియో ఒలింపిక్స్‌లో అద్భుతంగా రాణించి, దేశాన్ని గర్వంతో తలెత్తుకునేలా చేసిన అమ్మాయిలను చూసి గర్విస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

08/29/2016 - 01:09

న్యూయార్క్, ఆగస్టు 28: టెన్నిస్‌లో నాలుగు గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో ఒకటి, ప్రతి ఏడాదీ ఆఖరు జరిగే యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. పవర్ ప్లేకు కాకుండా కళాత్మక విలువలకు అద్దం పట్టే ఈ టోర్నమెంట్‌లో విజేతలు ఎవరైనా, ప్రతి మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయం. పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ మరోసారి టైటిల్ వేటను కొనసాగించనున్నాడు.

08/29/2016 - 07:17

హైదరాబాద్, ఆగస్టు 28: రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన పివి సింధు, సాక్షి మాలిక్ ప్రస్థానంలో ఇది ఆరంభం మాత్రమేనని, వారికి ఉజ్వల భవిష్యత్తు ఉందని భారత ‘లెజెండరీ క్రికెటర్’ సచిన్ తెండూల్కర్ అన్నాడు. బాడ్మింటన్ స్టార్, తెలుగు అమ్మాయి సింధు రియోలో రజత పతకాన్ని కైవసం చేసుకోగా, మహిళల రెజ్లింగ్‌లో సాక్షి కాంస్య పతకాన్ని గెల్చుకున్న విషయం తెలిసిందే.

08/29/2016 - 00:53

న్యూ హవెన్ (అమెరికా), ఆగస్టు 28: భారత టెన్నిస్ బ్యూటీ సానియా మీర్జా ఇక్కడ జరిగిన కనెక్టికట్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. రుమేనియాకు చెందిన మోనికా నికులెస్క్యూతో కలిసి బరిలోకి దిగిన ఆమె ఫైనల్‌లో కాతెరినా బొండరెన్కో (ఉక్రెయిన్), చువాంగ్ చియా జంగ్ (తైవాన్) జోడీని 7-5, 6-4 తేడాతో ఓడించింది. యుఎస్ ఓపెన్ సోమవారం నుంచి ప్రారంభం కానుండగా, సానియా మళ్లీ ఫామ్‌లోకి రావడం విశేషం.

,
08/29/2016 - 00:51

లాడెర్‌హిల్ (అమెరికా), ఆగస్టు 28: భారత్, వెస్టిండీస్ జట్ల ఆదివారం నాటి చివరి, రెండో టి-20 మ్యాచ్‌కి వర్షం కా రణంగా రద్దయంది. వర్షం వల్ల కొంత, అవుట్ ఫీల్డ్‌పై గుంట లు ఏర్పడడం వల్ల మరికొంత ఇబ్బంది తలెత్తడంతో, ఆట జ రగడం అసాధ్యంగా మారింది. ఆదివారం ఉదయం జల్లులు కురుస్తుండడంతో ఆట ఆలస్యంగా ఆరంభమైంది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసే వరకూ ఎలాంటి ఆటంకాలు ఏర్పడలేదు.

08/29/2016 - 00:48

లాహోర్, ఆగస్టు 28: లాహోర్‌లో క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు వెళుతున్న శ్రీలంక క్రికెటర్లపై దాడికి తెగబడిన నలుగురు ఉవ్రాదులను హతమార్చినట్టు పాకిస్తాన్ పోలీస్ అధికారులు ప్రకటించారు. 2009లో జరిగిన ఆ సంఘటనలో తొమ్మిది మంత్రి పోలీసులు, ఇద్దరు పౌరులు మృతి చెందగా, ఆరుగురు క్రికెటర్లు స్వల్పంగా గాయపడ్డారు. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే లంక ఆటగాళ్లు పాకిస్తాన్ టూర్‌ను రద్దు చేసుకొని స్వదేశానికి వెళ్లిపోయింది.

08/28/2016 - 05:07

హైదరాబాద్, ఆగస్టు 27: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం సాగించిన కృషి, కొన్ని దశాబ్దాల పాటు నత్తనడక నడిచిన తీరుపై నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు శనివారం సోదాహరణగా వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్షాలు పలు రకాలుగా విమర్శలు చేయడంతో ఈ ప్రాజెక్టు వాస్తవ స్థితి గతుల గురించి మీడియాకు వర్క్ షాప్ తరహాలో హరీశ్‌రావు వివరించారు.

,
08/28/2016 - 04:55

లాడెర్‌హిల్ (అమెరికా), ఆగస్టు 27: వెస్టిండీస్‌తో శనివారం చివరి క్షణం వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మొదటి టి-20 మ్యాచ్‌లో భారత్ ఒక పరుగు తేడాతో ఓటమిపాలైంది. టెస్టు ఆటగాడిగా ముద్ర వేయంచుకున్న లోకేష్ రాహుల్ బాధ్యతాయుతమైన శతకం టీమిండియా ను గెలిపించలేకపోయంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చివరి ఓవర్ చివరి బంతికి అవుట్ కావడం భారత్ పరాజయానికి కారణమైంది.

08/28/2016 - 04:51

న్యూయార్క్, ఆగస్టు 27: ఈ ఏడాది చివరి గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీ యుఎస్ ఓపెన్‌కు స్టార్లు సిద్ధమవుతున్నారు. సోమవారం మొదలై సెప్టెంబర్ 11 వరకు జరిగే ఈ మెగా టోర్నీ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు.

08/28/2016 - 04:50

న్యూయార్క్, ఆగస్టు 27: భారత టెన్నిస్ ఆటగాడు సాకేత్ మైనేని యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ మెయన్ డ్రా కు అర్హత సంపాదించాడు. చివరి క్వాలిఫయర్‌లో అతను సెర్బియాకు చెందిన పెజా క్రిస్టిన్‌ను 6-3, 6-0 తేడాతో సునాయాసంగా ఓడించాడు. ఈ మ్యాచ్ కేవలం 56 నిమిషాల్లో ముగియడం గమనార్హం. కాగా, భారత్ నుంచి పురుషుల సింగిల్స్ మెయన్ డ్రాకు సాకేత్ ఒక్కడే అర్హత సంపాదించాడు.

Pages