S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/11/2016 - 04:26

చెన్నై, సెప్టెంబర్ 10: రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని సాధించిపెట్టిన మరియప్పన్ తంగవేలుకు తమిళనాడు ప్రభుత్వం రెండు కోట్ల రూపాయల నజరానాను ప్రకటించింది. రాష్ట్రానికి, దేశానికి పేరుప్రఖ్యాతులు ఆర్జించిపెట్టిన తంగవేలు విజయం యువతకు స్ఫూర్తినిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత్ ఒక ప్రకటనలో ప్రశంసించారు.

09/11/2016 - 04:25

రియో డి జెనీరో: జావెలిన్ త్రో ఎఫ్-44 విభాగంలో భారత అథ్లెట్ సుందీప్ కాంస్య పతకాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. అతను నాలుగో స్థానంలో నిలిస్తే, మరో త్రోయర్ నరేందర్ రణ్‌బీర్‌కు ఆరో స్థానం దక్కింది. 20 ఏళ్ల సందీప్ జావెలిన్‌ను 54.30 మీటర్ల దూరం విసిరాడు. ఇది అతని వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన. అయితే, కాంస్య పతకాన్ని అతను 0.69 మీటర్ల తేడాతో కోల్పోయాడు.

09/11/2016 - 04:24

న్యూయార్క్: లారా సీగెమండ్, మేట్ పావిక్ జోడికి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ లభించింది. ఫైనల్‌లో వీరు కొకో వాండెవాగె, రాజీవ్ రామ్ జోడీ ని 6-4, 6-4 తేడాతో ఓడించి టైటిల్ సాధించారు.

09/11/2016 - 04:22

న్యూయార్క్, సెప్టెంబర్ 10: ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్, మూడో సీడ్ స్టానిస్లాస్ వావ్రిన్కా ఇక్కడ జరుగుతున్న యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో తలపడనున్నారు. ఈసారి టైటిల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్న జొకోవిచ్ సెమీ ఫైనల్‌లో పదోసీడ్ గేల్ మోన్ఫిల్స్‌తో తలపడ్డాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు జొకోవిచ్ సులభంగా గెలుస్తాడన్న అభిప్రాయం వ్యక్తమైంది.

09/10/2016 - 16:19

చెన్నై: రియో పారాలింపిక్స్‌లో హై జంపింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన తంగవేలుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాష్ట్ర ప్రభుత్వం తరపున 2కోట్ల రూపాయల నగదు ప్రకటించారు.తమ రాష్ట్ర క్రీడాకారుడు స్వర్ణం గెలుపొందడంపై జయలలిత హర్షం వ్యక్తం చేశారు. తంగవేలు గెలుపు ఎంతోమంది క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. మరియప్పన్ తంగవేలుకు క్రీడా శాఖ 75లక్షల రివార్డ్ ప్రకటించింది.

09/10/2016 - 14:09

ఢిల్లీ : పారాలింపిక్స్‌లో భారతదేశానికి బంగారు పతకం తెచ్చిన మొట్ట మొదటి హై జంపర్‌గా మరియప్పన్ తంగవేలు రికార్డు సృష్టించాడు. 1.89 మీటర్లు జంప్ చేసి ఈ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మరో క్రీడాకారుడు వరుణ్ సింగ్ భాటి 1.86 మీటర్లు జంప్ చేసి కాంస్య పతకాన్ని సాధించాడు. టీ-42 హైజంప్ ఈవెంట్‌లో వీరిద్దరూ ఈ పతకాలు సాధించారు. స్వర్ణ పతక విజేతకు రూ.75 లక్షలు, కాంస్య పతక విజేతకు రూ.

09/10/2016 - 08:36

న్యూయార్క్, సెప్టెంబర్ 9: స్వదేశంలో జరుగుతున్న యుఎస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న సెరెనా విలియమ్స్ అనూహ్యంగా ఓటమిపాలైంది. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను కూడా చేజార్చుకొని, రెండు విధాలా నష్టపోయింది. ప్రపంచ నంబర్ వన్‌గా బరిలోకి దిగిన సెరెనా ద్వితీయ ర్యాంక్ క్రీడాకారిణిగా యుఎస్ నుంచి నిష్క్రమించింది.

09/10/2016 - 08:33

న్యూయార్క్, సెప్టెంబర్ 9: గ్రాండ్ శ్లామ్ టెన్నిస్‌లో అత్యధిక టైటిళ్లు సాధించిన మార్గరెట్ కోర్ట్ రికార్డు సెరెనాకు అందు తుందా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీ యాంశమైంది. గ్రాండ్ శ్లామ్ చాంపియన్‌షిప్స్ ఓపెన్ టోర్నీలుగా మారిన తర్వాత స్ట్ఫె గ్రాఫ్ 22 టైటిళ్లను కైవసం చేసుకుంది. అత్యధిక పర్యాయాలు విజేతగా నిలిచిన క్రీడాకారిణుల జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

09/10/2016 - 08:33

న్యూయార్క్, సెప్టెంబర్ 9: సెరెనాను రెండో స్థానంలోకి నెట్టి, ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన ఏంజెలిక్ కెర్బర్ మరో గ్రాండ్ శ్లామ్ టైటిల్ వేటను కొనసాగిస్తున్నది. యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో మాజీ ప్రపంచ నంబర్ వన్ కారోలిన్ వొజ్నియాకిని ఆమె 6-4, 6-3 తేడాతో ఓడించి ఫైనల్ చేరింది. టైటిల్ కోసం కరోలినా ప్లిస్కోవాతో ఫైనల్ పోరును ఖాయం చేసుకుంది.

09/10/2016 - 08:33

రియో డి జెనీరో, సెప్టెంబర్ 9: సుమారు మూడు వారాల క్రితం రియో ఈత కొలనులో అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ ప్రకటనలు సృష్టించాడు. ఐదు స్వర్ణాలను, ఒక రజత పతకాన్ని గెల్చుకొని తనకు తిరుగులేదని నిరూపించాడు. ఇప్పుడు పారాలింపిక్స్ జరుగుతుండగా, స్విమ్మింగ్ పూల్‌లో మరో ఫెల్ప్స్ దర్శనమిస్తున్నాడు.

Pages