S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/16/2016 - 08:23

గయానా, సెప్టెంబర్ 15: వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ రాంనరేష్ శర్వాణ్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించాడు. రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నానని, అధికారికంగా ప్రకటిస్తానని ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శర్వాణ్ చెప్పాడు. 2013 చాంపియన్స్ ట్రోఫీలో అతను చివరిసారి భారత్‌పై వనే్డ ఇంటర్నేషనల్ ఆడాడు. ఆతర్వాత జట్టులో అతనికి స్థానం దక్కలేదు.

09/15/2016 - 05:22

పారాలిపింక్స్ జావెలిన్ త్రోలో దేవేంద్ర రికార్డు

09/15/2016 - 05:20

రియో డి జెనీరో: పురుషుల ఎఫ్-46 జావెలిన్‌త్రో ఈవెంట్‌లో పోటీపడాల్సిన సుందర్ సింగ్ గుజ్రార్ గైర్హాజరుకావడం చర్చనీయాంశమైంది. ఈ విభాగంలో భారత్ నుంచి మొత్తం ముగ్గురు పోటీపడాల్సి ఉండింది. దేవేంద్రతోపాటు రింకూ హూడా, సుందర్ సింగ్ కూడా ప్రాక్టీస్ ఎరినాలో వామప్ అయ్యారు. నిర్వాహకులు పేర్లు పిలిచిన వెంటనే దేవేంద్ర, రింకూ వెళ్లగా, సుందర్ అక్కడ కనిపించలేదు.

09/15/2016 - 05:19

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: స్పెయిన్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం డేవిస్ కప్ పోరులో భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్‌కు భాగస్వామిగా సాకేత్ మైనేని బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి మరో డబుల్స్ ఆటగాడు రోహన్ బొపన్నతో కలిసి పేస్ ఆడాల్సి ఉండింది. అయితే, ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ బొపన్న హటాత్తుగా పోటీ నుంచి వైదొలిగాడు.

09/15/2016 - 05:18

గ్రేటర్ నోయడా, సెప్టెంబర్ 14: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ టైటిల్‌ను ఇండియా బ్లూ జట్టు కైవసం చేసు కుంది. ఇండియా రెడ్‌తో జరిగిన ఐదు రోజుల ఫైనల్‌లో 355 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా బ్లూ 9 వికె ట్లకు 693 పరుగులు సాధించగా, అందుకు సమాధానం గా ఇండియా రెడ్ మొదటి ఇన్నింగ్స్‌లో 356 పరుగులకు ఆలౌటైంది.

09/14/2016 - 06:15

రియో డీ జెనిరో, సెప్టెంబర్ 13: పారాలింపిక్స్ పురుషుల టి-13 క్లాస్ 1,500 మీటర్ల రేసులో పోటీపడిన అథ్లెట్లలో నలుగురు అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ సంభ్రమాశ్చర్యాకు గురి చేశారు. రియో ఒలింపిక్స్‌లో ఇదే ఈవెంట్‌లో పసడి పతకాన్ని కైవసం చేసుకున్న అథ్లెట్ కంటే తక్కువ సమయంలో 1,500 మీటర్ల రేసును పూర్తిచేసి ఈ నలుగురు పారాలింపియన్లు సంచలనం సృష్టించారు.

09/14/2016 - 06:13

రియో డీ జెనిరో, సెప్టెంబర్ 13: నడుము నుంచి కింది భాగమంతా చచ్చుబడిపోయి, 31 ఆపరేషన్లు, 183 కుట్లు పడిన తర్వాత వీల్‌చైర్‌కే పరిమితమైన వాళ్లు ఏం సాధిస్తారని ఎవరైనా అనుకుంటారు. అది కూడా 45 ఏళ్ల వయసు వచ్చాక ఇక సాధించడానికి ఏముంటుంది? అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

09/14/2016 - 06:12

జైపూర్, సెప్టెంబర్ 13: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సిఎ)లో వారసత్వ రాజకీయాలకు తెర లేచింది. ఆర్‌సిఎ అధినేతగా వ్యవహరిస్తున్న ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) మాజీ కమిషనర్ లలిత్ మోడీ కుమారుడు రుచిర్ అల్వార్ జిల్లా క్రికెట్ సంఘ (డిసిఎ) అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాడు.

09/14/2016 - 06:11

టెహ్రాన్, సెప్టెంబర్ 13: అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ సమాఖ్య (్ఫబా) ఆధ్వర్యాన జరుగుతన్న ఆసియా చాలెంజ్ టోర్నమెంట్‌లో భారత జట్టు అరుదైన విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన గ్రూప్-ఇ రెండో రౌండ్ పోరులో భారత జట్టు పటిష్టమైన చైనా జట్టును మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్ బెర్తును కైవసం చేసుకునేందుకు రేసులో నిలిచింది.

09/14/2016 - 06:11

లాసానే (స్విట్జర్లాండ్), సెప్టెంబర్ 13: డోపింగ్ పరీక్షలో విఫలమైనందుకు తనపై విధించిన రెండేళ్ల నిషేధాన్ని తగ్గించాలని కోరుతూ రష్యా టెన్నిస్ క్వీన్ మరియా షరపోవా చేసుకున్న అప్పీలుపై వచ్చే నెల ఆరంభంలో తీర్పును వెలువరిస్తామని అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎస్‌ఎ) మంగళవారం ప్రకటించింది.

Pages