S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/02/2016 - 02:17

న్యూఢిల్లీ, ఆగస్టు 1: డోపింగ్ అభియోగాల నుంచి రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు విముక్తి కల్పించి దేశం తరఫున అతను రియో ఒలింపిక్స్ బరిలోకి దిగేందుకు వీలుకల్పించాలని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సోమవారం తీసుకున్న నిర్ణయాన్ని సహచర రెజ్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్టు సుశీల్ కుమార్ స్వాగతించాడు.

08/02/2016 - 02:06

మార్లో (ఇంగ్లాండ్), ఆగస్టు 1: ఇంగ్లాండ్ చేతిలో భారత జూనియర్ హాకీ జట్టుకు పరాజయం ఎదురైంది. మార్లోలోని బిషామ్ అబే స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు 2-1 గోల్స్ తేడాతో భారత జూనియర్ జట్టుపై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో భారత జట్టు బాగానే ఆడినప్పటికీ పలు అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయింది.

08/02/2016 - 02:05

ముంబయి, ఆగస్టు 1: స్పెయిన్‌లోని సెగోవియాలో జరిగిన ఎటిపి చాలెంజర్ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లు పురవ్ రాజా, దివిజ్ శరణ్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఈ టోర్నీలో మూడో సీడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు ఆదివారం రాత్రి జరిగిన డబుల్స్ ఫైనల్ పోరులో జోవాక్విన్ మునోజ్ హెర్నాండెజ్ (స్పెయిన్), అకీరా సాంటిల్లన్ (జపాన్) జోడీపై విజయం సాధించారు.

08/01/2016 - 17:59

దిల్లీ: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రెజ్లర్‌ నర్సింగ్‌ యాదవ్‌కు మార్గం సుగమమైంది. రెజ్లింగ్‌ 74 కిలోల విభాగంలో భారత్‌ తరఫున నర్సింగ్‌ యాదవ్‌ బరిలో దిగనున్నాడు. డోపింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కు భారత డోపింగ్‌ నిరోధక సంస్థ(నాడా) క్లీన్‌చిట్‌ ఇచ్చింది. రియోకు సిద్ధమైన నర్సింగ్‌ డోపింగ్‌ పరీక్షలో దొరికిపోయాడు.

08/01/2016 - 00:35

న్యూఢిల్లీ, జూలై 31: రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు పతకాలతోపాటు అక్కడి ప్రజల హృదయాలనూ గెలుస్తారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

08/01/2016 - 00:28

లాస్ ఏంజిలిస్, జూలై 30: డోపింగ్ పరీక్షలో పట్టుబడి సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్న రష్యా స్విమ్మర్ నికిటా లొబిత్సెవ్ తనపై చర్య తీసుకోవడాన్ని సవాలు చేస్తూ అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్)ను ఆశ్రయించాడు. అతనితోపాటు, ఇదే సమస్యను ఎదుర్కొంటున్న మరో స్విమ్మర్ వ్లాదిమీర్ మొరోజొవ్ కూడా సిఎఎస్‌లో తన సస్పెన్షన్‌పై సవాలు చేశాడు.

08/01/2016 - 00:28

రియో డి జెనీరో, జూలై 31: టెన్నిస్ డబుల్స్ విభాగంలో టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి బరిలోకి దిగాల్సిన స్పెషలిస్టు ఆటగాళ్లు బాబ్ బ్రియాన్, మైక్ బ్రియాన్ తాము ఒలింపిక్స్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన ‘బ్రియాన్ బ్రదర్స్’ హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరమైన పరిణామం.

08/01/2016 - 00:27

రియో డి జెనీరో, జూలై 31: వందకుపైగా అథ్లెట్లు డోపింగ్ పరీక్షలో పట్టుబడి, సస్పెన్షన్ వేటును ఎదుర్కొంటున్న నేపథ్యంలో రష్యాను ఒలింపిక్స్ నుంచి బహిష్కరించాలన్న డిమాండ్‌పై చర్చించి, నివేదికను సమర్పించడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ డోపింగ్ సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి, ప్రతిపాదనలు చేస్తుందని ఐఒసి అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపాడు.

08/01/2016 - 00:27

కింగ్‌స్టన్, జూలై 31: అశ్విన్ స్పిన్ మాయాజాలానికి వెస్టిండీస్ విలవిల్లాడింది. తొలి ఇన్నింగ్స్‌లో 52.3 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్ 52 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్‌కు జెర్మైన్ బ్లాక్‌వుడ్ (62), మార్లొన్ శామ్యూల్స్ (37) తప్ప ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లను అందించలేకపోయారు. చివరిలో మిగుల్ కమిన్స్ అజేయంగా 24 పరుగులు చేశాడు.

07/31/2016 - 15:43

న్యూఢిల్లి:2020 ఒలింపిక్స్‌కు ఇండియాలో ప్రతి జిల్లానుంచి ఒక అథ్లెట్ పాల్గొనేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని, మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే రియో ఒలింపిక్స్‌కు హాజరవుతున్న క్రీడాకారులకు అభినందనలు తెలపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. క్రీడారంగంలో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు యువత నడుంబిగించాలని ఆయన అన్నారు.

Pages