S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/14/2016 - 08:02

విశాఖపట్నం, మే 13: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నీ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలను ఇప్పటికే దాదాపు కోల్పోయిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌కు షాక్ ఇచ్చింది.

05/14/2016 - 07:53

దుబాయ్, మే 13: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) క్రికెట్ కమిటీ చైర్మన్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తిరిగి నియమితుడయ్యాడు. శుక్రవారం అతడిని రెండోసారి ఈ పదవిలో నియమించారు. అలాగే కుంబ్లే సహచరుడు, భారత జట్టు మాజీ కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌ను ఈ కమిటీలో సభ్యుడిగా నియమించారు.

05/14/2016 - 07:53

అమలాపురం, మే 13: ప్రతిష్ఠాత్మకమైన థామస్ కప్ బాడ్మింటన్ టోర్నీకి తూర్పు గోదావరి జిల్లా అమలాపురం క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ఎంపికయ్యాడు. రాష్ట్ర విభజన అనంతరం అంతర్జాతీయ బాడ్మింటన్ పోటీలకు రాష్ట్రం నుండి ఎంపికైన మొట్టమొదటి క్రీడాకారుడుగా సాత్విక్ రికార్డులకెక్కాడు. సాత్విక్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.

05/14/2016 - 07:52

ముంబయి, మే 13: ప్రో కబాడీ లీగ్ రాబోయే సీజన్‌కోసం శుక్రవారం జరిగిన ఆటగాళ్ల వేలంలో వాయువ్య రైల్వేలో క్లర్క్‌గా పని చేస్తున్న డిఫెండర్ మోహిత్ షిల్లర్‌ను బెంగళూర్ బుల్స్ జట్టు 53 లక్షల రూపాయల అత్యధిక మొత్తానికి దక్కించుకుంది. రెండో సీజన్ విజేత అయిన యుముంబా జట్టునుంచి చిల్లర్‌ను అత్యధిక మొత్తానికి బెంగళూరు జట్టు దక్కించుకోవడమే ఈ రోజు వేలంలో హైలైట్.

05/14/2016 - 07:51

కోల్‌కతా, మే 13: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కావలసిన అర్హతా ప్రమాణాలు తనకు లేవని టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సిఎబి) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం స్పష్టం చేశాడు. మంగళవారం బిసిసిఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ గురువారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే.

05/14/2016 - 07:51

న్యూఢిల్లీ, మే 13: భారత మహిళా ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సోనా చౌదరి తన కాలంలో మహిళా ఆటగాళ్లను అధికారులు ఎలా లైంగిక వేధింపులకు గురి చేసే వారో తన తాజా పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించారు. సోనా చౌదరి 1995నుంచి 1998 మధ్య కాలంలో భారత మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ‘గేమ్ ఇన్ గేమ్’ పేరుతో హిందీలో రాసిన పుస్తకంలో ఆమె ఈ ఆరోపణలు చేశారు.

05/14/2016 - 07:50

బెంగళూరు, మే 13: లాంగ్ జంప్‌లో పాతికేళ్ల క్రితం ప్రపంచ రికార్డు సృష్టించిన అమెరికా మేటి అథ్లెట్ మైక్ పావెల్ (52) ఇప్పటికీ తన శక్తిసామర్ధ్యాలపై ధీమాతో ఉన్నాడు. ఐదు పదుల వయసు దాటినప్పటికీ తనలో చేవ తగ్గలేదని అతను స్పష్టం చేశాడు. అంతేకాకుండా ఈ ఏడాది బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో జరిగే ఒపింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ప్రయత్నిస్తానని పావెల్ సంచలన ప్రకటన చేశాడు.

05/13/2016 - 00:48

న్యూఢిల్లీ, మే 12: రియో ఒలింపిక్స్‌కు భారత్‌లో గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉండాలంటే భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) నుంచి తనకు ఎలాంటి ప్రతిపాదన రాలేదన్న ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఎఆర్ రెహ్మాన్ గురువారం ఆ జాబితాలో చేరాడు. ‘లెజెండరీ బ్యాట్స్‌మన్’ సచిన్ తెండూల్కర్, స్టార్ షూటర్ అభినవ్ బింద్రా, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన ఇప్పుడు రెహ్మాన్ కూడా చేరాడు.

05/13/2016 - 00:47

దుబాయ్, మే 12: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి స్వతంత్ర ప్రతిపత్తిగల చైర్మన్‌గా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్ష పదవికి రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఇతరత్రా ప్రతిపాదనలు ఏవీ రాకపోవడంతో, అతను ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఐసిసి ఒక ప్రకటనలో తెలిపింది. ఐసిసికి గతంలో అధ్యక్షుడు ఒక్కడే ఉండేవాడు.

05/13/2016 - 00:46

న్యూఢిల్లీ, మే 12: తాను ఐసిసి చైర్మన్ పదవి కోసం బిసిసిఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయలేదని శశాంక్ మనోహర్ అన్నాడు. 2014లో ఐసిసి నిబంధనావళిలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో ఐసిసికి అధ్యక్షుడితోపాటు కొత్తగా చైర్మన్ పదవి కూడా వచ్చిచేరింది. తొలి చైర్మన్‌గా అప్పటి బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ ఎన్నికయ్యాడు.

Pages