S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/11/2017 - 01:45

హైదరాబాద్, డిసెంబర్ 10: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. వారంలో మూడు కేసులు నమోదయ్యాయి. ఆదివారం మల్కాజ్‌గిరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారినుంచి భారీగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో 200 కేజీల గంజాయి, 70 గ్రాముల కొకైన్ పట్టుబడగా, మల్కాజ్‌గిరిలో ఆదివారం హెరాయిన్, కిలో ఓపియం పట్టుబడింది.

12/11/2017 - 01:43

హైదరాబాద్, డిసెంబర్ 10: ప్రపంచ తెలుగు మహాసభలను నిబద్ధత, క్రమశిక్షణ, పక్కా ప్రణాళికతో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాసభలను ఒక పండగలా నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తుండటంతో ఎక్కడా లోటుపాట్లు లేకుండా నిర్వహకులు, అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభల కోసం 50 కోట్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పటికే 20 కోట్లు విడుదల చేసింది.

12/11/2017 - 04:09

హైదరాబాద్, డిసెంబర్ 10: ప్రపంచ తెలుగు మహాసభల ప్రచారం కోసం సైకిల్ యాత్రను తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ నందిని సిధారెడ్డి ఆదివారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ మహాసభలకు తెలుగు వారందరినీ ఆహ్వానిస్తున్నామని సిధారెడ్డి తెలిపారు. మహాసభల విశిష్టతను తెలియజేసే విధంగా ఈ సైకిల్ యాత్ర కూడా దోహదం చేస్తుందని సిధారెడ్డి తెలిపారు.

12/11/2017 - 01:38

హైదరాబాద్, డిసెంబర్ 10: తెలంగాణలో కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది. తెరాస వ్యతిరేక శక్తులను కూడదీసి బలోపేతమయ్యే దిశగా అడుగులేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చే అవకాశాలున్న వాతావరణం కనిపిస్తుండటంతో, వాటివల్ల ఓటు బ్యాకు చీలిపోకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.

12/11/2017 - 01:34

హైదరాబాద్, డిసెంబర్ 10: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం కొనసాగుతోన్న సహకార సంఘాల పదవీ కాలం నెలలో ముగియనున్నప్పటికీ ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో గడువులోగా సహకార ఎన్నికలు నిర్వహించే అవకాశం లేనట్టుగానే ఉంది. సహకార సంఘాల పాలక వర్గాలకు ఫిబ్రవరి 4తో పదవీకాలం ముగిసిపోతుంది.

12/11/2017 - 01:22

విజయవాడ, డిసెంబర్ 10: కాల్ సెంటర్ 1100 తమకు ప్రతిపక్షం వంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుంటారు. కాల్ సెంటర్ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ అందరి అభిమానం చూరగొంది. అయితే ప్రభుత్వ కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే ప్రజల జేబులకు చిల్లు పడుతోంది. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా కాల్ సెంటర్ 1100ను ఏప్రిల్‌లో ప్రభుత్వం ప్రారంభించింది.

12/11/2017 - 01:20

విజయవాడ, డిసెంబర్ 10: రాజధాని అమరావతిలో పరిపాలనా నగరానికి సంబంధించి డిజైన్లపై హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబుతో ప్రముఖ సినీ దర్శకుడు రాజవౌళి ఆదివారం భేటీ అయ్యారు. రాజధాని నగరానికి సంబంధించి నార్మన్ ఫోస్టర్ సంస్థ బృందం అందచేసిన డిజైన్ల గురించి చర్చించారు. పరిపాలనా నగరం, శాసనసభ భవనాలకు సంబంధించి కొన్ని డిజైన్లను ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు.

12/11/2017 - 01:19

విజయవాడ, డిసెంబర్ 10: కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తరువాతే ప్రాజెక్టుకు సంబంధించి వివిధ అంశాల్లో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కీలకమై అప్పర్ కాఫర్ డ్యామ్ నిర్మాణం, కొత్త టెండర్లు..వంటి అంశాలపై కేంద్ర మంత్రి పర్యటన తరువాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు.

12/11/2017 - 01:17

ఉరవకొండ, డిసెంబర్ 10 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ ఆదివారం అనంతపురం జిల్లా కూడేరులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.

12/11/2017 - 01:15

విజయవాడ, డిసెంబర్ 10: రాష్ట్రంలో ప్రతి ఇంటినీ ఇంధన సామర్థ్యం వెల్లివిరిసేలా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇంధన పరరిక్షణ ఆవశ్యకతపై ఉద్యమస్ఫూర్తితో ప్రజలను మరింత చైతన్యపర్చాలని ఆదేశించారు. ఇంధన సామర్థ్య సాధనలో ప్రపంచ అగ్రదేశాల్లో ఉన్న ఉత్తమ పద్ధతులను అనుసరించాలని, తద్వారా ఒనగూరిన ఫలాలు వినియోగదారులకు చేరేలా కృషి చేయాలని ఉద్బోధించారు.

Pages