S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/12/2017 - 01:42

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 3943 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు ప్రభుత్వం జీవో 179ను జారీ చేసింది.

12/12/2017 - 01:41

హైదరాబాద్, డిసెంబర్ 11: మిషన్ భగీరథ పనులు నెలాఖరుకు పూర్తి చేసి జనవరి 1నుంచి నూతన సంవత్సర కానుకగా ఇంటింటికి మంచినీటిని సరఫరా చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. నూతన సంవత్సరం నుంచి ఇంటింటికి మంచినీటిని అందించనున్నట్టు ఇప్పటికే ప్రకటించడంతో, నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయని కాంట్రాక్టు ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

12/12/2017 - 01:39

విశాఖపట్నం, డిసెంబర్ 11: విశాఖ రైల్వే జోన్.. విశాఖ వాసులకు నెరవేరని కల. తెలుగోడికి జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్ సభ్యులు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు కానీ ప్రశ్నించడం లేదు. ఒడిశా అధికారుల మోచేతి నీరు తాగలేక, వారి ఆధిపత్యాన్ని భరించలేక కుమిలిపోతున్న తెలుగు ఉద్యోగుల బాధను, బాధ్యతగల నేతలు పట్టించుకోవడంలేదు. అనేక సంవత్సరాల విశాఖ వాసుల జోన్ సెంటిమెంట్‌కు ఏ రాజకీయ పార్టీ కూడా విలువిఇవ్వడం లేదు.

12/12/2017 - 01:37

అమరావతి, డిసెంబర్ 11: అమరావతి నగరంలో నూతన నిర్మాణ ఆకృతుల పరిశీలన, కసరత్తు, చర్చలతోనే సమయం వృథా అవుతోంది. గత రెండేళ్ల నుంచి జరుగుతున్న చర్చలు, పర్యటనలన్నీ ఆకృతుల పరిశీలనకే సరిపోవడంతో కాలహననం అవుతోంది తప్ప, ఆ దిశగా ఒక్క అడుగు ముందుకుపడటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

12/12/2017 - 01:35

ఏలూరు, డిసెంబర్ 11: ‘రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని ఎంతోకాలంగా చెపుతూనే వస్తున్నా. ఈ ప్రాజెక్టు ప్రజల సెంట్‌మెంట్‌గా మారింది. అడ్డుకుంటే సహించేది లేదు’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సోమవారం సందర్శించారు.

12/12/2017 - 01:29

హైదరాబాద్, డిసెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంఅగా నిర్వహిస్తోన్న ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులేనని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ సభలకు దేశ విదేశాల నుంచి 8 వేలమంది ప్రతినిధులు హాజరుకానున్నారని ప్రభుత్వం అంచనా వేసింది. నేరుగా, ఆన్‌లైన్లో నమోదు చేసుకున్న ప్రతినిధుల సంఖ్య సోమవారానికి 8 వేలకు చేరుకుంది.

12/12/2017 - 03:58

హైదరాబాద్, డిసెంబర్ 11: కేంద్రం వెంటపడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయించాల్సిన బాధ్యత ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. కమీషన్ల కోసమే పోలవరం నిర్మాణ బాధ్యతను ముఖ్యమంత్రి తీసుకున్నారని బుగ్గన సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

12/11/2017 - 04:31

హైదరాబాద్, డిసెంబర్ 10: చట్ట సభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళతానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఆదివారం కృష్ణయ్య నేతృత్వంలో పలువురు బిసి సంక్షేమ సంఘం నాయకులు చంద్రబాబును కలిసి వినతి పత్రం అందజేశారు.

12/11/2017 - 04:20

హైదరాబాద్, డిసెంబర్ 10: ప్రపంచంలోనే ఆధునాత సిగ్నలింగ్ టెక్నాలజీ హైదరాబాద్ మెట్రో రైలుకు సమకూరింది. ప్రముఖ థాలెస్ సిగ్నలింగ్ వ్యవస్థను హైదరాబాద్ మెట్రోకు ఏర్పాటు చేయడంతో ఆధునాతన సాంకేతిక ప్రమాణాలతో రైలు నడిపేందుకు అవకాశం కలిగింది.

12/11/2017 - 03:59

నల్లగొండ, డిసెంబర్ 10: ఫ్లోరైడ్ పీడిత ప్రాంత ప్రజలకు, రైతులకు తాగు, సాగునీరందించే లక్ష్యంతో ఎస్‌ఎల్‌బీసీ బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను రెండు నెలల్లో పూర్తి చేసి ప్రారంభించబోతున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు.

Pages