S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/13/2017 - 02:19

హైదరాబాద్, డిసెంబర్ 12: హాస్య నటుడు విజయ్‌సాయి అంత్యక్రియలు మంగళవారం ఎర్రగడ్డలోని శ్మశానవాటికలో జరిగాయి. విజయ్ తండ్రి సుబ్బారావు, భార్య వనితల పరస్పర ఆరోపణ, ప్రత్యారోపణల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. సినిమాల్లో అవకాశాలు రాకపోవడం, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో ఇతను ఆత్మహత్యకు పాల్పడినట్టు అంతా భావించారు.

12/13/2017 - 02:17

హైదరాబాద్, డిసెంబర్ 12: స్వచ్ఛ హైదరాబాద్‌లో ప్రజలను కూడా భాగస్వాములను చేస్తూ, స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో అగ్రస్థానాన్ని దక్కించుకునేందుకు జీహెచ్‌ఎంసీ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

12/13/2017 - 02:10

హైదరాబాద్, డిసెంబర్ 12: వ్యవసాయానికి నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 31 అర్థరాత్రి నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వడం ఇక ఆటో స్టార్టర్లు అవసరం లేదని స్పష్టం చేశారు. ఆటో స్టార్టర్ల వల్ల మేలుకంటే కీడే ఎక్కువ జరగడం వల్ల రైతులు స్వచ్చందంగా వాటిని తొలగించుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.

12/13/2017 - 02:04

హైదరాబాద్, డిసెంబర్ 12: ఈ నెల 15 నుండి 19 వరకు హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు అద్భుతమైన రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. మహాసభల ఏర్పాట్లపై మంగళవారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎల్‌బి స్టేడియంలో ప్రధాన వేదికను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.

12/13/2017 - 02:02

విజయవాడ/ రాజమహేంద్రవరం/నల్లచెరువు, డిసెంబర్ 12: వంద కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు కూడబెట్టిన ఆరోపణలపై దేవాదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ (ఆర్‌జేసీ) శీలం సూర్య చంద్రశేఖర్ ఆజాద్ (46) ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం నాడు దాడులు జరిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 18 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

12/13/2017 - 02:00

అనంతపురం, డిసెంబర్ 12: ఎన్నికల సమయంలో ఇష్టమొచ్చినట్లు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని మరచి కొంగలా దొంగ జపం చేస్తూ మాయమాటలతో ప్రజలను వంచించారని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. చెరువులోని చేపలను తిన్న కొంగ కథ మారిది ఆయన రాష్ట్రంలోని ఏ వర్గాన్నీ వదిలిపెట్టకుండా తినేస్తున్నారని విరుచుకుపడ్డారు.

12/13/2017 - 01:57

విజయవాడ, డిసెంబర్ 12: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీతో భేటీ కానున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు సమావేశమై చర్చించుకోవాలంటూ ఒడిశా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన, ప్రాజెక్టుకు

12/13/2017 - 02:06

అమరావతి, డిసెంబర్ 12: రేషన్ షాపు డీలర్లకు అధిక ఆదాయం, వినియోగదారులకు సరసమైన ధరలకే వస్తువులు లభించేలా ‘చంద్రన్న విలేజ్ మాల్స్’కు శ్రీకారం చుట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రేషన్ షాపు డీలర్లు, వినియోగదారులకు వీటిని నూతన సంవత్సర కానుకగా అందిస్తున్నామని అన్నారు.

12/13/2017 - 01:54

హైదరాబాద్, డిసెంబర్ 12: పట్టిసీమ నుంచి గోదావరి జలాలను కృష్ణాబేసిన్‌లోని ప్రకాశం బ్యారేజీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర స్ధాయిలో అభ్యంతరం తెలిపింది. ఈ అంశంపై తాము సంపూర్ణ నివేదిక ఇవ్వనున్నట్లు గోదావరి బోర్డుకు తెలంగాణ స్పష్టం చేసింది. దీనికి గోదావరి బోర్డు సమ్మతిని తెలిపింది.

12/12/2017 - 02:56

హైదరాబాద్, డిసెంబర్ 11: హాస్య నటుడు విజయ్‌సాయి ఆత్మహత్య కేసు మరో కీలక మలుపు తిరుగుతోంది. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని తన నివాసంలో విజయ్‌సాయి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తొలుత సినిమాల్లో అవకాశాలు రాకపోవడం, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్టు భావించారు. కానీ..ఆత్మహత్యకు ముందు విజయ్‌సాయి సెల్‌ఫోన్‌లో తీసుకున్న సెల్ఫ్ వీడియోలో పలువురిపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Pages