S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/08/2017 - 01:34

రాజమహేంద్రవరం, డిసెంబర్ 7: ‘కులాన్ని గౌరవిస్తా.. కానీ కులాన్ని వెనుకేసుకురాను.. ఇదే నా పార్టీ సిద్ధాంతం’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తనను ఓ కులానికి నాయకుడిగా చిత్రీకరిస్తే సహించేదిలేదని, తాను అందరివాడినని, ముఖ్యంగా భారతీయుడినని, అంతకుమించి మానవత్వం కలిగిన మనిషిని మాత్రమేనన్నారు.

12/08/2017 - 01:29

విజయవాడ, డిసెంబర్ 7: విపక్ష పార్టీలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం సాగునీటి ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైకాపాకు స్పష్టమైన వైఖరి లేదని, ప్రాజెక్టులను అడ్డుకోవడమే ఆ పార్టీ లక్ష్యమని ధ్వజమెత్తారు.

12/08/2017 - 03:46

హైదరాబాద్, డిసెంబర్ 7: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 108 అంబబులెన్స్‌సర్వీసులను బివిజి ఇండియా, యుకె స్పెషలిస్టు అంబులెన్స్ సర్వీసుల కంట్రాక్టును అప్పగించడం సబబేనంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎస్ అభినంద కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.

12/08/2017 - 03:17

హైదరాబాద్, డిసెంబర్ 7: తెలంగాణ యాస, భాష, జీవన సౌందర్యాన్ని ప్రపంచమంతా పరివ్యాప్తి చేసే విధంగా 15వ తేదీ నుండి 19వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు, నిర్వహణపై సచివాలయంలోని సి బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడారు.

12/08/2017 - 03:18

హైదరాబాద్, డిసెంబర్ 7: ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిర్వహించిన రాష్టస్థ్రాయి పరిశోధనా వ్యాసరచన పోటీల ఫలితాలను ప్రకటించారు. ఈ పోటీల కోసం వ్యాసాలను ఆహ్వానించి, నవంబర్ 30 తేదీలోగా వ్యాసాలను పంపించాలంటూ గడువుగా నిర్ణయించారు. గడువులోగా 130 పరిశోధనా వ్యాసాలు రాగా, వీటిని ఉన్నతస్థాయి కమిటీ పరిశీలించింది.

12/07/2017 - 00:05

విశాఖపట్నం, డిసెంబర్ 6: తన రాజకీయ భవిష్యత్‌పై నిన్న మొన్నటి వరకూ స్పష్టత లేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ ప్రయాణంపై స్పష్టత తీసుకున్నట్టు కనిపిస్తోంది. విశాఖలో బుధవారం జరిగిన పార్టీ కార్యకర్తల తొలి సమావేశంలో పవన్ విసిరిన పంచ్ డైలాగులు అన్ని రాజకీయ పార్టీలను ఒక్కసారిగా అయోమయంలో పడేశాయ.

12/06/2017 - 23:59

ఆదిలాబాద్, డిసెంబర్ 6: మహారాష్టల్రోని గడ్చిరోలి జిల్లా ప్రాణహిత నదీ తీరంలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు, నక్సల్స్‌కు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గడ్చిరోలి జిల్లా సిరోం చ తాలూకా ఇంగనూర్‌కల్హాడి అటవీ ప్రాంతంలో పీపుల్స్

12/06/2017 - 23:55

విజయవాడ డిసెంబర్ 6: అకుంటిత దీక్ష... అధ్యాపకుల తర్ఫీదు.. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. లక్ష్యసాధనలో అలుపెరగని ప్రయత్నం.. కలగలిపి ఒక బాలుడిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దరిచేరేలా చేసింది. జనగణమన గేయంతో దేశ భక్తిని పెంపొందించే క్రమంలో మరెందరికో స్ఫూర్తినిచ్చేలా.. కౌశిక్ తన కళా ప్రతిభతో కందిపప్పు గింజలతో జనగణమన గీతాన్ని తీర్చిదిద్దిన తీరు అద్భుతాన్ని తలపించింది.

12/06/2017 - 23:51

హైదరాబాద్, డిసెంబర్ 6: దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ కాలేజీల్లో అడ్మిషన్లకు నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (నీట్ యుజి- 2018)ను వచ్చే ఏడాది మే 10న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ జనవరిలో మొదలవుతుంది. దరఖాస్తులను మార్చి మొదటివారం వరకూ ఆన్‌లైన్‌లో పంపించుకునేందుకు, ఫీజు చెల్లించేందుకు గడువు ఉంటుంది.

12/06/2017 - 04:26

హైదరాబాద్, డిసెంబర్ 5: మిషన్ కాకతీయ నాలుగవ దశ కింద 5703 చెరువుల పునరుద్ధరణ చేపట్టనున్నట్టు నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు తెలిపారు. ఈ నెలాఖరులోగా పాలనాపరమైన అనుమతులు పొంది జనవరి మొదటి వారం నుంచి పనులు ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మిషన్ కాకతీయ 4వ దశపై సచివాలయం నుంచి జిల్లాల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Pages