S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/09/2017 - 02:02

విజయవాడ, డిసెంబర్ 8: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబం ఆస్తులను శుక్రవారం రాష్ట్ర ఐటి మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. సీఎం కుటుంబ సభ్యులకు రూ.142.34 కోట్లమేర ఆస్తులు ఉండగా, రూ. 70.5 కోట్లమేర ఆప్పులు ఉన్నాయి. దీంతో నికర ఆస్తుల విలువ 75.06 కోట్లు అని మంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న నికర ఆస్తుల విలువ రూ. 2.53 కోట్ల రూపాయలుగా వెల్లడించారు.

12/09/2017 - 04:03

హైదరాబాద్, డిసెంబర్ 8: దేశ వ్యాప్తంగా అవినీతినిరోధక శాఖ, విజిలెన్స్ శాఖలు నమోదు చేస్తున్న కేసుల నమోదు 2015తో పోల్చితే 2016లో గణనీయంగా తగ్గాయి. దేశంలో 2016లో 4400 కేసులు, 2015లో 5191 కేసులు, 2014లో 4888 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర 1016 కేసులతో ప్రథమ స్థానంలో ఉండగా, ఒడిశా రాష్ట్రంలో 569 కేసులు, కేరళ 430 కేసులు, మధ్యప్రదేశ్‌లో 402 కేసులు నమోదయాయ్యాయి.

12/08/2017 - 04:02

ఖమ్మం, డిసెంబర్ 7: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐసీసీ నాయకులు కుంతియా, రేణుకాచౌదరి పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామం వద్ద గురువారం రాత్రి జరిగిన పార్టీ బహిరంగ సభలో వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.

12/08/2017 - 03:42

ఖమ్మం, డిసెంబర్ 7: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహరచనతో ముందుకు పోతున్నామని, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం బీజేపీనేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగిస్తూ అవినీతి, కుటుంబ పాలనతో ప్రజలకు దూరమవుతున్నాడన్నారు.

12/08/2017 - 03:40

కొత్తగూడెం, డిసెంబర్ 7: తెలంగాణలో తీవ్ర నిర్బంధంతో సతమతమవుతున్న న్యూడెమక్రసీ (ఎన్‌డీ) పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ఏరియా దళ కమాండర్, ఎన్‌డీ రాష్ట్ర నాయకుడు లింగన్నను గురువారం ఖమ్మం సమీపంలోని రఘునాథపాలెంలో పోలీసులు అరెస్టు చేశారు.

12/08/2017 - 02:02

హైదరాబాద్, డిసెంబర్ 7: తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూమి సర్వే పనులు 85 శాతం పూర్తికావడంతో ఇందుకు సంబంధించిన రికార్డుల కంప్యూటీకరణపై దృష్టిని సారించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభించిన సంగతి విదితమే. మొత్తం 10975 గ్రామాల్లో 7300 గ్రామాల్లో భూమి సర్వే ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి.

12/08/2017 - 02:01

హైదరాబాద్, డిసెంబర్ 7: ఇంజినీరింగ్ కాలేజీల ఫీజుల దందాపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఐటి మంత్రి కె తారకరామారావులు గురువారం నాడు స్పందించారు. కడియం శ్రీహరి జెఎన్‌టియు సమావేశంలో స్పందించగా, కెటిఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. ఏ విద్యాసంస్థ కోర్సు మధ్యలో ఫీజులు పెంచడానికి వీలు లేదని స్పష్టం చేశారు.

12/08/2017 - 01:58

వరంగల్, డిసెంబర్ 7: నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సమీక్షలు జరిపిన సందర్భంలో ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది మరొకటని ఆయన వ్యాఖ్యానించారు.

12/08/2017 - 04:07

విజయవాడ, డిసెంబర్ 7: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకానికి ఇకనైనా తెరదించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రధానాంశాలన్నీ కూడా వివాదాస్పదమవుతున్నాయని ఆయన తెలిపారు. వీటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రాజకీయ పార్టీలకు స్పష్టత, వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

12/08/2017 - 01:38

అనంతపురం, డిసెంబర్ 7: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అనుభవ రాహిత్యంతో మాట్లాడుతున్నారని వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా శింగనమల మండలం కల్లుమడిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీల బృందం పోలవరం ప్రాజెక్టును పరిశీలించడానికి వెళ్తోందని తెలిసి పవన్ వచ్చారన్నారు.

Pages