S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/05/2017 - 03:30

కుంటాల, డిసెంబర్ 4: ఉద్యోగం రాదేమోనన్న బెంగతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా(కె) గ్రామానికి చెందిన బొద్దోల్ల భీమేష్ (35) బీఈడీ చేశాడు. కుటుంబ భారం తనపై ఉండడంతో ఉద్యోగం వస్తుందో లేదోనన్న బెంగతో ఆదివారం ఇంట్లో ఉన్న దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై యూనుస్ పేర్కొన్నారు.

12/05/2017 - 03:29

హైదరాబాద్, డిసెంబర్ 4: ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఎల్బీ స్టేడియంలో సాహిత్యం, సంగీత విభావరితోపాటు ఆహార ప్రదర్శన, ఫుడ్ కోర్టులు, పుస్తక ప్రదర్శన, విక్రయశాలలు, హస్తకళల ప్రదర్శన, పురావస్తుశాఖ ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు నిర్వహకులను ఆదేశించారు. ఎల్బీ స్టేడియం లోపల, వెలుపల అలంకరణలు, సాహితీమూర్తుల కటౌట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

12/05/2017 - 03:26

హైదరాబాద్, డిసెంబర్ 4: ‘స్వాతంత్య్ర తెలంగాణ కోసం మరో సంగ్రామం చేద్దాం. సిఎం కె. చంద్రశేఖర్ రావును ఇంటి బాట పట్టిద్దాం’ అని వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, నిరుద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. టీజేఏసీ ఆధ్వర్యంలో సోమవారం సరూర్‌నగర్ స్టేడియంలో ‘కొలువుల కొట్లాట’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. వేల సంఖ్యలో హాజరైన యువకులను ఉద్ధేశించి వక్తలు ఆవేశంగా ప్రసంగించారు.

12/05/2017 - 03:22

హైదరాబాద్, డిసెంబర్ 4: రాష్ట్రంలో పాత పది జిల్లాల ప్రాతిపదికగానే టీచర్సు రిక్రూట్‌మెంట్ నిర్వహించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. సోమవారం పబ్లిక్ సర్వీసు కమిషన్, పాఠశాల విద్య అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

12/05/2017 - 04:49

హైదరాబాద్, డిసెంబర్ 4: అగ్రిగోల్డ్ కేసు వ్యవహారం సోమవారం నాడు మరో మలుపు తిరిగింది. ఆ కంపెనీతో పాటు అనుంబంధ సంస్థలన్నింటినీ టేకోవర్ చేస్తామంటూ గతంలో ముందుకు వచ్చిన జీ గ్రూప్ సంస్థ వెనక్కు తగ్గింది. కేవలం అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులను మాత్రమే కొనుగోలు చేస్తామని సోమవారం నాడు హైకోర్టు విచారణ సందర్భంగా ప్రతిపాదన చేసింది. స్వాధీనం చేసుకోవడానికి మరో మూడు నెలల గడవుపొడిగించాలని కూడా కోరింది.

12/05/2017 - 03:08

రాజమహేంద్రవరం, డిసెంబబర్ 4: కేంద్ర నిధులకు రాష్ట్రంలో తాత్కాలిక బ్రేకు పడింది. ఇకపై పనులు చేపట్టాలంటే తాజా మార్గదర్శకాలతో చేపడితేనే తదుపరి నిధులు వస్తాయని షరతులతో కూడిన విధి విధానాలు అమల్లోకి వచ్చాయి.

12/05/2017 - 03:07

జమ్మలమడుగు, డిసెంబర్ 4: కరవు సీమకు జీవనాడి అయిన గండికోట జలాశయంలో నీటి నిల్వపై అధికారుల అంచనాలు తారుమారవుతున్నాయి. జలాశయం ముంపు గ్రామాల లెక్కల్లో ఇంజినీర్ల అంచనాలు తప్పా యి. ఫలితంగా గండికోట బ్యాక్‌వాటర్ ముందే గ్రామాలను ముంచెత్తుతోంది. దీంతో ముంపువాసులు అధికారులపై మండిపడుతున్నారు. ఓ పక్క నీళ్లు ఊళ్లలోకి వస్తుంటే ఏంచేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

12/05/2017 - 02:54

అమరావతి, డిసెంబర్ 4: సీఎం చంద్రబాబు తొలిరోజు దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైంది. కొరియా పారిశ్రామికవేత్తల నుంచి అనూహ్య స్పందన లభించింది. 37 కంపెనీలతో కూడిన పారిశ్రామిక బృందంతో ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ‘లెటర్ ఆఫ్ ఇండెంట్’ తీసుకుంది. ఒప్పందాల విలువ అక్షరాలా రూ. 3వేల కోట్లగా అంచనా. ఈ సంస్థల ద్వారా మొత్తం 7,171 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

12/05/2017 - 02:52

అమరావతి, డిసెంబర్ 4: విభిన్న వ్యాపార రంగాలను విజయవంతంగా నిర్వహిస్తున్న దక్షిణ కొరియాకు చెందిన ‘లొట్టే కార్పొరేషన్’.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు సంయుక్త కార్యసాధన బృందం ఏర్పా టు కానుంది. లొట్టే కార్పొరేషన్ ప్రెసిడెంట్, సీఈవో వాన్గ్ కాగ్‌జు దక్షిణ కొరియా పర్యటనలో

12/05/2017 - 00:18

హైదరాబాద్, డిసెంబర్ 4: అగ్రిగోల్డ్ కేసు వ్యవహారం సోమవారం నాడు మరో మలుపు తిరిగింది. ఆ కంపెనీతో పాటు అనుంబంధ సంస్థలన్నింటినీ టేకోవర్ చేస్తామంటూ గతంలో ముందుకు వచ్చిన జీ గ్రూప్ సంస్థ వెనక్కు తగ్గింది. కేవలం అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులను మాత్రమే కొనుగోలు చేస్తామని సోమవారం నాడు హైకోర్టు విచారణ సందర్భంగా ప్రతిపాదన చేసింది. స్వాధీనం చేసుకోవడానికి మరో మూడు నెలల గడవుపొడిగించాలని కూడా కోరింది.

Pages