S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/04/2017 - 01:32

అమరావతి, డిసెంబర్ 3: ‘కాపు రిజర్వేషన్లను ఓకే చేసి కేంద్రానికి పంపించాం. దాన్ని సాధించుకుందాం. ఈలోపు సంబరాలు చేసుకుని మరొకరికి ఇబ్బంది కలిగించవద్దు. బీసీల వ్యవహారంపై ఆయా వర్గాలకు నచ్చచెప్పి వివరించే బాధ్యతను మంత్రులు తీసుకోవాలి. మనం సమాజంలో వెనుకబడిన కులాలందరి పక్షాన ఉన్నాం. అన్ని కులాలు పేదరికం నుంచి బయటపడాలన్నదే మన సిద్ధాంతం. బీసీలు మన పార్టీకి పునాదిరాళ్లు.

12/04/2017 - 01:45

అమరావతి, డిసెంబర్ 3: తెలుగుదేశం పార్టీకి పునాదిరాళ్లయిన బీసీలు భగ్గుమంటున్నారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ వర్గాలు రోడ్డెక్కుతున్నాయి.

12/03/2017 - 05:00

హైదరాబాద్, డిసెంబర్ 2: అధిక రద్దీ నివారణ దృష్ట్యా కాచిగూడ నుంచి పలు గమ్య స్ధానాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-కాకినాడ టౌన్ మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. డిసెంబర్ 8, 15, 29 తేదీల్లో సాయంత్రం 6.45కి కాచిగూడ నుంచి నెం.07425 ప్రత్యేక రైలు బయలు దేరుతుంది.

12/03/2017 - 04:43

హైదరాబాద్, డిసెంబర్ 2: పసిపిల్లల పట్ల నేరాలు, లైంగిక దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశం మొత్తం మీద 2016లో 98,344 నేరాలు నమోదయ్యాయి. 2014లో 79,758, 2015లో 85189 నేరాలు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోప్రకటించింది. బాలలపై నేరాలకు పాల్పడిన కేసులను విశే్లషిస్తే ఉత్తరప్రదేశ్ ఒకటో స్థానంలో, రెండో స్థానంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి.

12/03/2017 - 03:34

నిజామాబాద్, డిసెంబర్ 2: బీజేపీ మాజీ నాయకుడు భరత్‌రెడ్డి ఇద్దరు దళిత యువకుల పట్ల దాష్టీకానికి పాల్పడిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కిడ్నాప్‌కు గురైనట్టు భావిస్తున్న ఇద్దరు యువకులు రాజేశ్వర్, లక్ష్మణ్ ఆచూకీని ఎట్టకేలకు పోలీసులు పసిగట్టి వారిని సురక్షితంగానే ఇళ్లకు చేర్చినప్పటికీ, బాధిత యువకులు మీడియా సమక్షంలో చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలతో మరింత గందరగోళ పరిస్థితి నెలకొంది.

12/03/2017 - 03:30

హైదరాబాద్, డిసెంబర్ 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రచయితలు, కవులు, కళాకారులను ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనాలని ఆహ్వానించేందుకు ఈ నెల 4న విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

12/03/2017 - 02:21

ఆదిలాబాద్, డిసెంబర్ 2: ఈ సీజన్‌లో మంచుదుప్పటి కప్పుకునే ఆదిలాబాద్‌లో వేకువజామున ఇంటిగడప దాటడానికీ ఎవరూ సాహసించరు. అలాంటిది గడ్డకట్టే చలిలో ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి బుద్దప్రకాష్‌జ్యోతి, నిర్మల్ కలెక్టర్ ఇల్లంబర్ది ఏకంగా 25 కిలోమీటర్ల దూరం వరకు సైకిల్‌పై సవారీ చేసి ఆశ్చర్యపర్చారు. ప్రతి ఆదివారం ఇద్దరు ఐఏఎస్‌లు ఆటవిడుపుగా వ్యాయామం, కాలి నడక, జిమ్‌లో సాధనవంటివి చేయడం పరిపాటి.

12/03/2017 - 01:51

సంగనభట్ల రామకిష్టయ్య

12/03/2017 - 01:47

హైదరాబాద్, డిసెంబర్ 2: తెలంగాణలో తొలిసారిగా బీసీ వర్గాల ప్రజా ప్రతినిధులతో సిఎం కేసీఆర్ ఆదివారం విస్తృత సమావేశం నిర్వహించనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సమైక్యపాలనలో ఒక్క సిఎం కూడా బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. తెలంగాణలో బీసీ వర్గాలు రాజకీయంగా బలమైన ఓటు బ్యాంకు.

12/03/2017 - 01:39

కర్నూలు, డిసెంబర్ 2: అరకొర, అత్తెసరు మార్కులు వచ్చినా ఇంజినీరింగ్ సీటు వస్తుందన్న భావనలో ఉన్న విద్యార్థులు ఇక ముందు తమ అభిప్రాయం మార్చుకోవాల్సిందే. వచ్చే ఏడాది ఇంజినీరింగ్ ప్రవేశపరీక్షలో సాధ్యమైనన్ని ఎక్కువ మార్కులు పొంది మంచి ర్యాంకు సాధించగలిగితేనే ఇంజినీరింగ్ విద్యనభ్యసించడానికి వీలవుతుంది. లేదంటే ప్రత్యామ్నాయ విద్య ఎంపిక చేసుకోవాల్సిందే.

Pages