S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/06/2017 - 03:55

హైదరాబాద్, డిసెంబర్ 5: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు పండ్ల వర్తకులు పండ్లను కృత్రిమ పద్ధతిలో కాల్షియం కార్బైడ్ రసాయనం ఉపయోగించి మగ్గపెట్టడాన్ని నిరోధించడానికి తనిఖీలను నిర్వహించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయమై రెండు రాష్ట్రప్రభుత్వాలు వారం రోజుల్లోగా అఫిడవిట్‌లను దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

12/06/2017 - 03:18

అమరావతి, డిసెంబర్ 5: ‘ముస్లిం మైనారిటీలకు 4 నుంచి 12 శాతం పెంచుతూ చేసిన తీర్మానం ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి చేస్తాం. 9వ షెడ్యూల్‌లో చేర్పించేందుకు అవసరమైతే పోరాడతాం. ప్రధాని కూడా నాకు హామీ ఇచ్చారు’ - ముస్లింలకు రిజర్వేషన్లు ఆమోదించిన సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ఇచ్చిన మాట ప్రకారం కాపు వర్గాలకు 5 శాతం రిజర్వేషన్ల తీర్మానాన్ని కేంద్రానికి పంపుతాం.

12/06/2017 - 03:14

ఖమ్మం, డిసెంబర్ 5: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల నుంచి నిషేధిత గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేసేందుకు ఖమ్మం నగరం కీలకంగా మారింది. ఆ ప్రాంతాల నుంచి హైదరాబాద్, మహారాష్టత్రో పాటు ఉత్తర భారత దేశానికి గంజాయిని సరఫరా చేయాలంటే ఖమ్మం నగరం మీదుగానే వెళ్ళాల్సి ఉంది. రైలు మార్గమైనా, రోడ్డు మార్గమైనా ఖమ్మం మీదుగానే వెళతారు.

12/06/2017 - 02:51

హైదరాబాద్, డిసెంబర్ 5: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు పండ్ల వర్తకులు పండ్లను కృత్రిమ పద్ధతిలో కాల్షియం కార్బైడ్ రసాయనం ఉపయోగించి మగ్గపెట్టడాన్ని నిరోధించడానికి తనిఖీలను నిర్వహించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయమై రెండు రాష్ట్రప్రభుత్వాలు వారం రోజుల్లోగా అఫిడవిట్‌లను దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

12/06/2017 - 02:58

హైదరాబాద్, డిసెంబర్ 5: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన పలు దుర్ఘటనల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఈ నెల 6వ తేదీ నుండి పర్యటించనున్నారు. ఆరో తేదీ ఉదయం 8.30కి విశాఖ చేరుకుని అక్కడి నుండి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాల యం వద్దకు వెళ్లి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

12/06/2017 - 01:24

హైదరాబాద్, డిసెంబర్ 5: తెలంగాణలో మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్, నేరాల అదుపులో ఫ్రెండ్లీ పోలీసింగ్ విజయవంతం కావడంతో పోలీస్ శాఖ క్రైమ్స్ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈమేరకు స్పెషల్ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర హైకోర్టు కూడా అనుమతిచ్చిందని అదనపు కమిషనర్ క్రైమ్స్ అండ్ సిట్ చీఫ్ స్వాతిలక్రా వెల్లడించారు.

12/06/2017 - 01:22

హైదరాబాద్, డిసెంబర్ 5: పంచాయతీరాజ్ చట్టం సమూల మార్పులు, సంస్కరణలు ప్రవేశపెట్టడానికి త్వరలో శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానున్న నేపథ్యంలో స్థానిక సంస్థలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ ప్రజా ప్రతినిధుల కమిటీ ప్రతిపాదించింది. బీసీలు రాజకీయంగా ఎదగడానికి స్థానిక సంస్థల్లో ప్రస్తుతం కేటాయించిన 34 శాతం రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని సూచించింది.

12/06/2017 - 01:13

హైదరాబాద్, డిసెంబర్ 5: తెలంగాణ ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా ప్రపంచ తెలుగు మహాసభలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ జీవన సౌందర్యాన్ని ప్రపంచానికి తెలిపేలా రెండున్నర కోట్లతో ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఎల్‌బి స్టేడియంలో సమీక్ష నిర్వహించారు.

12/06/2017 - 01:10

అమరావతి, డిసెంబర్ 5: కాపు వర్గాలకు 5 శాతం రిజర్వేషన్లు సిఫార్సు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీలు భగ్గుమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీ సంఘాలు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కలెక్టరేట్ల ముట్టడి విజయవంతమైంది. కాపులకు రిజర్వేషన్‌ను అడ్డుకోవడంలో బీసీ మంత్రులు విఫలమయ్యారని, బీసీ జాతి ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారంటూ ఆందోళనకారులు ఆగ్రహంతో రగిలిపోయారు.

12/06/2017 - 01:08

తిరుపతి, డిసెంబర్ 5: కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న శ్రీ వేంకటేశ్వరుని ఆలనా పాలనా చూసే తిరుమల తిరుపతి దేవస్థానం సంక్షేమ శాఖలో ఉప కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న స్నేహలత టీటీడీ కేటాయించిన వాహనంలో ప్రార్థనలు చేయడానికి చర్చికి వెళ్లడం వివాదాస్పదమైంది. మంగళవారం ఈస్ట్ చర్చి వద్ద టీటీడీ వాహనం ఏపి 03 టీవి 6240 నెంబర్ కలిగిన వాహనం ఉండటాన్ని కొందరు గుర్తించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

Pages