S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/03/2017 - 01:35

విజయవాడ, డిసెంబర్ 2: కమిటీ సభ్యుల రిపోర్టునకు, తన రిపోర్టునకు సంబంధం లేదని బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ తెలిపారు. విజయవాడలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ అందరికీ న్యాయం చేసేలా తన నివేదిక ఉంటుందన్నారు. 68 కులాలకు సంబంధించి నివేదిక రూపొందించామని తెలిపారు. తనను సంప్రదించకుండానే కమిషన్ సభ్యులు నివేదికను ప్రభుత్వానికి అందచేశారన్నారు.

12/03/2017 - 01:32

ఖమ్మం, డిసెంబర్ 2: మావోయిస్టులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఏ) వారోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాల్లో మావోయిస్టులు తమ భవిష్యత్తు కార్యచరణను రూపొందించుకోవడంతో పాటు నియామకాలు కూడా చేస్తుంటారు. వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

12/03/2017 - 01:29

గంగాధరనెల్లూరు, డిసెంబర్ 2: పెళ్లి అయిన మొదటి రాత్రి జరగాల్సిన శోభనంలో శాడిస్ట్భ్‌ర్త తన భార్యకు నరకాన్ని చూపించాడు. పారాణి ఆరకముందే నూతన వధువుపై బ్లేడ్‌తో పలుచోట్ల గాయాలుచేశాడు. పిడి గుద్దులు కురిపించి తీవ్రంగా గాయపరిచాడు. వధువు ఆసుపత్రి పాలు కాగా, ఆమెపై దాడి చేసిన భర్త కటకటాల పాలైయ్యాడు.

12/03/2017 - 01:27

అమరావతి, డిసెంబర్ 2: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టిన చందంగా సిఎం చంద్రబాబు కాపువర్గాలకు ఐదుశాతం రిజర్వేషన్ ప్రకటించి రాజకీయ ప్రత్యర్థులను వ్యూహాత్మకంగా దెబ్బతీశారు. బాబు ప్రకటించిన 5 శాతం రిజర్వేషన్ అమలుకు నోచుకోవాలంటే కేంద్రం మద్దతు తప్పనిసరి. అసెంబ్లీ తీర్మానానికి చట్టబద్ధత కల్పించాలంటే ఆ బిల్లును 9వ షెడ్యూలులో చేర్చాల్సి ఉంటుంది. అలా చేస్తేనే దానికి న్యాయరక్షణ ఉంటుంది.

12/03/2017 - 00:47

గుంటూరు, డిసెంబర్ 2: దేశానికి యువశక్తి ఓ సంపద.. ఆ శక్తిని వినియోగించుకుంటే ప్రపంచాన్ని శాసించే శక్తి భారత్‌కే ఉంటుంది.. నవ్యాంధ్రప్రదేశ్‌కు భారీ పరిశ్రమలు వస్తున్నాయి.. ప్రైవేటు కంపెనీలతో పాటు ప్రభుత్వరంగ సంస్థలలో ఉపాధి కల్పనకు ప్రణాళిక సిద్ధం చేశాం. నిరుద్యోగ యువతకు అర్హత ఆధారంగా భృతి కల్పించడంతో పాటు భవిష్య త్తుకు బాట వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు.

12/03/2017 - 00:46

పొందూరు, డిసెంబర్ 2: శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలంలోని కింతలి గ్రామం సమీపంలోని ఆదర్శతోటలో శనివారం ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పొందూరు ఇన్‌చార్జి ఎస్‌ఐ కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు 17 ఏళ్ళ వయస్సు ఉన్న మొదలవలస గ్రామానికి మొదలవలస రేణుక, కనిమెట్టకు చెందిన అనె్నపు పవన్‌కుమార్‌లుగా గుర్తించారు.

12/03/2017 - 00:44

గుంటూరు, డిసెంబర్ 2: రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉన్నచోటే ఉపాధి కల్పన జరిగేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని పరిశ్రమలు,ఉపాధికల్పనశాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ప్రకటించారు.

12/03/2017 - 00:44

గుంటూరు/విజయవాడ, డిసెంబర్ 2: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు శనివారంతో ముగిసాయి.. గత నెల 10వ తేదీ నుండి సమావేశాలు ప్రారంభం కాగా 12 రోజుల పనిదినాల్లో మొత్తం 67 గంటల 48 నిముషాల పాటు సాగాయి.. సమావేశ వివరాలను శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వివరించారు. మొత్తం 94 ప్రశ్నలకు సమాధానాలు మరో 22 ప్రశ్నలు టేబుల్ ఐటమ్‌గా స్వీకరించారు.

12/02/2017 - 04:08

హైదరాబాద్, డిసెంబర్ 1: ఉభయ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్నాయని గవర్నర్ నరసింహన్ అన్నారు. సాగునీరు, విద్యుత్, ఆరోగ్యం, విద్య, పారిశ్రామిక రంగ అభివృద్ధిపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు అంకిత భావంతో పని చేస్తున్నాయని కొనియాడారు. శుక్రవారం నాడిక్కడ రాజ్‌భవన్‌లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు హాజరైన అమెరికా పారిశ్రామిక ప్రతినిధుల బృందం గవర్నర్‌ను కలిసింది.

12/02/2017 - 03:56

జంగారెడ్డిగూడెం, డిసెంబర్1: పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం సమీపంలోని కిచ్చప్పగూడెం రోడ్డులో మామాడి చెట్టుకు ఉరి వేసుకుని ఒక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. టిఎస్ 05 ఇజె 6255 నంబర్‌గల మోటార్ సైకిల్‌పై వచ్చిన యువ జంట గురువారం రాత్రి మామిడి చెట్టుకు ఉరి వేసుకున్నారని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Pages