S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/09/2017 - 02:59

హైదరాబాద్, సెప్టెంబర్ 8: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కాంగ్రెస్‌కు శాపాలుగా మారాయని, వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న సీట్లు కూడా రావని మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. తెరాసఎల్‌పిలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి మంత్రులు మాట్లాడారు.

09/09/2017 - 01:18

హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణలో పెసర్లు కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రెండు రోజుల క్రితం ఢిల్లీలో తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్‌సింగ్‌తో జరిపిన చర్చలు ఫలించాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ తెలంగాణ మార్క్‌ఫెడ్ సంస్థ సోమవారం నుంచి పెసర్ల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించనుంది.

09/09/2017 - 01:13

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 8: వినియోగదారులకు అందాల్సిన ఉచిత ఇసుక దారిమళ్లించి ప్రజాప్రతినిధుల సొంత నిర్మాణాలకు తరలిస్తోన్న అక్రమం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ర్యాంపులో యధేచ్ఛగా సాగిపోతోంది. ఈ ఇసుక ర్యాంపుల వివాదం ఇప్పుడు సిఎం చంద్రబాబు దృష్టికి వెళ్లినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

09/09/2017 - 01:11

కర్నూలు, సెప్టెంబర్ 8: రాయలసీమలో తాగు, సాగునీటి సమస్య పరిష్కారానికి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం జీవనాడి వంటిదని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన జలసిరికి హారతిలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా మల్యాల వద్ద కృష్ణమ్మకు హారతిఇచ్చారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు.

09/09/2017 - 00:10

ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 8: భారత దేశంలో రానున్న దశాబ్దకాలంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం లేదని ఉభయ తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలేశుని దర్శనానికి శుక్రవారం ఇక్కడకు వచ్చిన ఆయన కొద్దిసేపు విలేఖర్లతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అవసరమైతే చట్టసవరణ చేయాల్సి ఉంటుందన్నారు.

09/08/2017 - 02:21

హైదరాబాద్, సెప్టెంబర్ 7: సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ దారుణ హత్యను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా ఖండించారు. ఈ హత్య ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛను భగ్నం చేశామనుకుంటే పొరపాటని, ఇటువంటి పిరికి చర్యలు పనికిరావని అన్నారు.

09/08/2017 - 01:51

ఖమ్మం, సెప్టెంబర్ 7: దేశవ్యాప్తంగా పలు పాఠశాలలను దత్తత తీసుకొని, వౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు కృషి చేస్తున్న టీచ్ ఫర్ చేంజ్ సంస్థ తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో పది పాఠశాలలను దత్తత తీసుకున్నది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో ఈ పాఠశాలలు ఉండటం గమనార్హం.

09/08/2017 - 01:31

హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణ ప్రజల పాలిట తెరాస ప్రభుత్వ పాలన శాపంగా మారిందని టిపిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఖరి వల్ల రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోందని అన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రైతుల విషయంలో సిఎం కెసిఆర్ పూర్తి నిర్లక్ష్యం వహించారని అన్నారు.

09/08/2017 - 01:28

హైదరాబాద్, సెప్టెంబర్ 7: మూడేళ్ల కిందట ప్రారంభం కావాల్సిన హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం లభించబోతుంది. మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టును నవంబర్ నెలాఖరున ప్రారంభించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆహ్వానిస్తూ గురువారం లేఖ రాసారు.

09/08/2017 - 01:25

హైదరాబాద్, సెప్టెంబర్ 7: విద్యుత్ రంగంలో సంస్కరణలను రాష్ట్రప్రభుత్వం వేగవంతం చేసింది. వ్యాపార నిర్వహణ సులభతరం సంస్కరణలో భాగంగా విద్యుత్ కనెక్షన్ల మంజూరు ప్రక్రియను సరళీకృతం చేశారు. విద్యుత్ కనెక్షన్లు కావాలంటే ఇకపై కరెంటు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన పనిలేదు. బోలెడన్ని డాక్యుమెంట్లు అవసరం లేదు. రెండే రెండు డాక్యుమెంట్లతో కరెంట్ కనెక్షన్ పొందవచ్చు.

Pages