S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/10/2017 - 01:27

హైదరాబాద్/ రాజేంద్రనగర్, సెప్టెంబర్ 9: హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) జాడలు మళ్లీ కనిపించడం కలకలం రేపుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు శనివారం ముగ్గురు ఐసిస్ అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. టోలీచౌకీకి చెందిన అబ్దుల్ మాలిక్, ఫజియుల్లా, ఖయ్యూంలను రాజేంద్రనగర్- బండ్లగూడలోని సన్‌సిటీ రెసిడెన్సీలో అదుపులోకి తీసుకున్నారు.

09/10/2017 - 01:26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: తెలంగాణలో రానున్న ఆరు నెలల్లో ప్రతి ఇంటికీ స్వచ్చమైన తాగునీరు, ఇంటర్‌నెట్ అందిస్తామని ఐటి, పంచాయతీరాజ్ మంత్రి కెటి రామారావు ప్రకటించారు. శనివారం ఢిల్లీలో ప్రముఖ స్కోచ్ సంస్థనుంచి ఐటీ మినిష్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడుతూ దేశంలోనే ప్రతి ఇంటికీ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్‌నెట్ సేవలు అందించే తొలి రాష్ట్రం తెలంగాణ అవుతుందన్నారు.

09/10/2017 - 01:24

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న బ్లూవేల్ గేమ్ కట్టడికి ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. బ్లూవేల్ గేమ్ బారిన పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ముందస్తుగానే ఈ అంశంపై దృష్టిసారించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దాంతో ఈ నెల 15వ తేదీన యాజమాన్యాలతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

09/10/2017 - 01:21

హైదరాబాద్, సెప్టెంబర్ 9: నీటిపారుదల ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అమలు చేస్తున్న జిఎస్‌టిపై తెలంగాణ ప్రభుత్వం కోరికను నెరవేరుస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు.

09/10/2017 - 01:11

విజయవాడ, సెప్టెంబర్ 9: ఉల్లి ధరలు అనూహ్యంగా పతనం కావడంతో రైతును ఆదుకునేందుకు వీలుగా టన్ను ఉల్లిని ఆరువేల చొప్పున మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగులు, పశుసంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, సహకార శాఖల మంత్రి ఆదినారాయణరెడ్డి శనివారం ప్రకటించారు. మొన్నటిదాకా ఉల్లికి ధర బాగానే ఉన్నా, రైతుల చేతికి పంట విరివిగా రాగానే టన్ను ధర నాలుగు వేలకు పడిపోయిందన్నారు.

09/10/2017 - 01:10

హైదరాబాద్, సెప్టెంబర్ 9: తెలుగు రాష్ట్రాల మధ్య రావణకాష్టంలా మండుతున్న జల జగడాల పరిష్కారానికి అపెక్స్ (కేంద్ర అత్యున్నత మండలి) భేటీ ఒక్కటే మార్గంగా కనిపిస్తోందంటూ కృష్ణా, గోదావరి బోర్డులు కేంద్ర జలవనరుల శాఖకు నివేదిక ఇచ్చాయి. మరోవైపు శ్రీశైలంలో నీటిమట్టం 37 టిఎంసికి చేరుకోవడం, ఆల్మట్టి నుంచి వస్తున్న వరదతో జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది.

09/10/2017 - 01:08

విజయవాడ, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో అనధికారికంగా నిర్వహిస్తున్న వ్యవసాయ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. గిరిజన ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇకపై 24 గంటలూ తెరచి ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామంలోని క్యాప్టీవ్ పోర్టును స్విస్ ఛాలెంజ్ విధానంలో కమర్షియల్ పోర్టుగా మార్చే ప్రతిపాదనను ఆమోదించింది.

09/10/2017 - 01:06

హైదరాబాద్, సెప్టెంబర్ 9: వచ్చే జిఎస్‌టి మీటింగ్‌లోనే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై జిఎస్‌టి తగ్గింపుపై స్పష్టత వస్తుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న వర్క్స్ కాంట్రాక్టుపై జిఎస్‌టి సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామని, ఇప్పటికే 18 శాతం నుంచి 12 శాతం వరకు తగ్గించారన్నారు.

09/10/2017 - 01:02

విజయవాడ, సెప్టెంబర్ 9: బ్యాంకు రిక్రూట్‌మెంట్ బోర్డు, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు నిర్వహించిన ఎంపిక పరీక్షలు రాసేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల యువతపై బెంగళూరు, హుబ్లీ పట్టణాల్లో కన్నడిగులు దాడులకు తెగబడ్డారు. కర్నాటక వచ్చి పరీక్షలు రాస్తే ఇక్కడి వారు ఏం కావాలంటూ కన్నడ సంఘాల ప్రతినిధులు దాడులకు దిగడంతో ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు భయబ్రాంతులయ్యారు.

09/09/2017 - 02:45

హైదరాబాద్, సెప్టెంబర్ 8: శ్రీశైలం ప్రాజెక్టుకు అంతంతమాత్రంగా వచ్చిన వరద నీటి ప్రవాహంతో నీటి మట్టం 812.7 అడుగులకు, నీటి లభ్యత 35.93 టిఎంసికి పెరగడంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఈ నీటి వినియోగంపై కన్ను వేశాయి. రెండు రాష్ట్రాలు ఈ నీటిని వినియోగించుకోవడం కసరత్తును ప్రారంభించాయి.

Pages