S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/05/2017 - 03:04

హైదరాబాద్, సెప్టెంబర్ 4: జంట నగరాల్లో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో తలసాని మాట్లాడారు. ఈ సంవత్సరం 10,200 మండపాలకు అనుమతి ఇవ్వగా, వీటిలో 4,101 విగ్రహాల నిమజ్జనం ఇప్పటికే జరిగిందని, మిగిలిన 6,100 విగ్రహాలను మంగళవారం నిమజ్జనం చేస్తారని చెప్పారు.

09/05/2017 - 01:28

హైదరాబాద్, సెప్టెంబర్ 4: చిన్నతరహా పరిశ్రమలకు ఆశించిన మేర బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి సహకారం లభించడం లేదని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె తారకరామారావు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఊర్జిత్ పటేల్ దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవానికి చిన్నతరహా పరిశ్రమల నుంచే పారిశ్రామిక ఉత్పత్తులు 45శాతం, ఎగుమతులు 40 శాతం ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు.

09/05/2017 - 01:25

హైదరాబాద్, సెప్టెంబర్ 4: రాష్ట్రంలో భూముల రికార్డులు అయోమయంగా, గందరగోళంగా మారడంతో రాష్టవ్య్రాప్తంగా సమగ్ర భూ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. స్వాతంత్రానికి పూర్వం ఎప్పుడో నిజాం హయాంలో భూముల సర్వే జరగడంతో భూ వివరాలు రెవిన్యూ రికార్డుల్లో ఒకలాగా, వ్యవసాయ రికార్డులలో మరొకలాగా ఉండటంతో వీటిని అప్‌డేట్ చేసి రికార్డులను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

09/05/2017 - 01:23

హైదరాబాద్, సెప్టెంబర్ 4: గణేశ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని, నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 94,846 వినాయక విగ్రహాల ప్రతిష్ఠ జరిగిందన్నారు. సోమవారం డిజిపి అనురాగ్ శర్మ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

09/05/2017 - 01:11

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 4: ఏలేరు రిజర్వాయర్ పరిధిలోని ఆయకట్టు ప్రస్తుత ఖరీఫ్‌కు సాగునీరు అందించేందుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పాక్షికంగా సిద్ధమైంది. రోజుకు 700 క్యూసెక్కుల సాగునీరు అందించేందుకు పథకాన్ని సిద్ధం చేశారు. మొత్తం 98వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు లభించనుంది. అంటే, ఏలేరు ఆయకట్టుకు ఈ ఖరీఫ్ నుంచే స్థిరీకరణ లభించినట్టయింది.

09/05/2017 - 01:42

అమరావతి, సెప్టెంబర్ 4: శాసనమండలి చైర్మన్‌గా మాజీ మంత్రి ఎన్‌ఎండి ఫరూఖ్‌ను నియమిస్తున్నట్లు సిఎం చంద్రబాబు ప్రకటించారు. సోమవారం మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్‌లో సెంటర్ ఫర్ లీడర్‌షిప్ ఎక్స్‌లెన్స్ పేరిట జరుగుతున్న పార్టీ నేతల సమావేశంలో ఫరూఖ్ పేరును చంద్రబాబు ఖరారు చేశారు. దీనికి పార్టీ నేతలు పెద్దపెట్టున హర్షధ్వానాలతో స్పందన తెలియచేశారు.

09/05/2017 - 01:40

అమరావతి, సెప్టెంబర్ 4: ఒక ఎన్నికతో అనేక ప్రశ్నలకు దీటైన జవాబిచ్చారని ప్రజలను టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు అభినందించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం తెదేపా నాయకత్వ శిబిరంలో అధ్యక్షోపన్యాసం చేశారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల వల్ల ప్రజల్లో విశ్వాసం, పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందని చెప్పారు. జాతీయంగా, అంతర్జాతీయంగా ఈ ఉప ఎన్నికలు రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింప చేశాయన్నారు.

09/05/2017 - 01:47

దేశంలో సివిల్ సర్వీసు అధికారులతో జాతీయ సమైక్యత ఇనుమడిస్తుందని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో 92వ ఫౌండేషన్ కోర్సుకు హాజరైన ఏఐఎస్-సిసిఎస్ అధికారులతో ముచ్చటిస్తున్న ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు

09/04/2017 - 03:12

ఖమ్మం, సెప్టెంబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికార టిఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని, పోరాటాలను మజ్లిస్‌కు తాకట్టు పెడుతున్న కెసిఆర్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.

09/04/2017 - 02:38

హైదరాబాద్, సెప్టెంబర్ 3:కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు చోటు లేక పోవడం మంచి సంకేతం కాదని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రివర్గంపై నెట్ జన్‌లో ట్విట్టర్‌లో కెటిఆర్‌ను ప్రశ్నించగా, ఆయన సమాధానం చెప్పారు. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఏకైక ప్రతినిధి బండారు దత్తాత్రేయ ఉన్నారు. ఈ విస్తరణలో దత్తాత్రేయను తొలగించారు.

Pages