S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/06/2017 - 01:59

సింహాచలం, సెప్టెంబర్ 5: శ్రీకృష్ణాపురంలో సింహాచలం దేవస్థానం సాగుచేస్తున్న వంద ఎకరాల నృసింహవనంలో అరుదైన అరటిగెల ఆకట్టుకుంటోంది. పూర్తిస్థాయి సేంద్రియ ఎరువులతో సాగు చేస్తుండడంతో మంచి ఫలితాలు సాధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అరటి చెట్టుకు సుమారు 170 కాయలతో పెద్ద గెల వేసింది.ఇక్కడ పండిస్తున్న పంటంతా సింహగిరిపై నిత్యాన్నప్రసాదానికి తరలిస్తామని అధికారులు తెలియజేసారు. అలాగే అలంకారం కోసం

09/06/2017 - 01:56

హైదరాబాద్, సెప్టెంబర్ 5: శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చిన స్వల్ప వరద నీటి ప్రవాహంతో నీటిమట్టం 800అడుగులకు చేరడం, దాదాపు 30.66టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడంతో మంచి నీటి అవసరాలకు నాగార్జునసాగర్‌కు నీరు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరనుంది. ఈ విషయమై కృష్ణా బోర్డుకు నేడో, రేపో లేఖ రాయనుంది. శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రభుత్వం ఆధీనంలో ఉంది.

09/06/2017 - 01:49

న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా తెలంగాణ నుంచి ఆరుగురు అవార్డులును అందుకున్నారు.

09/06/2017 - 01:45

హైదరాబాద్, సెప్టెంబర్ 5: మద్యం వ్యాపారానికి దసరా పండుగ పీక్ సీజన్. ఈ సీజన్‌లోపుననే మద్యం ధరలను పెంచడానికి రంగం సిద్ధం అయింది. అన్ని రకాల మద్యంపై ధరలు పెంచాలని ప్రభుత్వానికి ఎక్సైజుశాఖ ప్రతిపాదనలు పంపించడంతో ఈ నెల మూడవ వారంలో ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎక్సైజు ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి ప్రారంభం అవుతుంది.

09/06/2017 - 01:43

హైదరాబాద్, సెప్టెంబర్ 5: గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలకు ఊతమిచ్చేందుకు కాంగ్రెస్ హయాంలో ‘ఆదర్శరైతు’ విధానాన్ని ప్రవేశపెట్టగా, ప్రస్తుతం అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ‘సమన్వయ సమితి’లను ఏర్పాటు చేస్తోంది. రైతులకు ఏదో ఒక విధంగా చేయూత ఇవ్వాలన్న ప్రభుత్వ విధానంలో అప్పటికీ (కాంగ్రెస్ హయాం), ఇప్పటికీ (టిఆర్‌ఎస్ హయాం) పెద్దగా తేడా ఏమీ లేదు.

09/06/2017 - 01:36

న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తొమ్మిది మంది అవార్డులను అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులకు ఈ అవార్డులను ప్రదానం చేశారు.

09/06/2017 - 01:37

విజయవాడ, సెప్టెంబర్ 5: భారతదేశంలోనే ఎంతో చరిత్ర కలిగిన కృష్ణానది ప్రవాహానికి ఇటీవలి కాలంలో అనేక అవరోధాలు వస్తున్నప్పటికీ ఆ నది నిరంతరం ప్రవహించాలని మనసా వాచా కోరుకుంటున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. జలహారతి కార్యక్రమంలో భాగం గా చంద్రబాబు మంగళవారం పవిత్ర సంగమం వద్ద భక్తిప్రపత్తులతో జల హారతి ఇచ్చారు.

09/06/2017 - 01:32

అమరావతి, సెప్టెంబర్ 5: ‘బలం పెంచుకోండి.. బలహీనత సరిదిద్దుకోండి. ఇప్పటిదాకా రియల్ టైమ్ గవర్నెన్స్ చేశాను, ఇకపై రియల్ టైమ్ పాలిటిక్స్ చేస్తాను. రాజకీయం అంటే నిరంతర ప్రజామోదం పొందడం. రాబోయే ఆరు నెలల్లో 10శాతం ఓట్లు పెరగాలి. ప్రజల్లో సంతృప్తి మరో 10శాతం పెరగాలి’ అని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

09/06/2017 - 01:29

అమరావతి, సెప్టెంబర్ 5: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రుణ ఉపశమన పథకం కింద మూడో విడత రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. మొదటి విడత 54.98 లక్షల రైతుల ఖాతాలకు 7564.69 కోట్లు జమ చేశామన్నారు.

09/06/2017 - 01:24

గణపతి బప్పా మోరియా అన్న నినాదంతో జంటనగరాలు మార్మోగాయి. రెండు నగరాల నలు చెరగులా వెలసిన గణనాథుల నిమజ్జనోత్సవానికి భక్తులు వేల సంఖ్యలో హాజరై వీడ్కోలు పలికారు. పదకొండు రోజుల పాటు నిత్య నీరాజనాలు, పూజలను అందుకున్న వినాయక విగ్రహాలను భక్తిపారవశ్యంతో, నినాదాలతో నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా అంతటా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.

Pages