S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/30/2017 - 02:13

హైదరాబాద్, జూన్ 29: వస్తు సేవా పన్ను (జిఎస్‌టి) అమలు రాష్ట్ర ప్రభుత్వానికి పెనుభారం కాబోతుంది. సామాన్య ప్రజలపై ఎలాంటి భారం పడదని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తున్నా, ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది.

06/30/2017 - 01:43

అమరావతి, జూన్ 29: ఒకేరోజు కోటి మొక్కలు నాటే మహా యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. జూలై 1న రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు ‘వనం- మనం’ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.

06/30/2017 - 01:41

విజయవాడ, జూన్ 29: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుకు రాష్ట్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న ఈ పన్ను వల్ల రాప్ట్రంపై భారం పడుతున్నప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడుతున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

06/30/2017 - 01:01

హైదరాబాద్, జూన్ 29: విశాఖపట్టణంలోని స్కూళ్లకు హార్టువేర్ , సాఫ్ట్‌వేర్ శిక్షణ, సర్ట్ఫికేషన్‌తో పాటు పాఠశాలలకు సాఫ్ట్‌వేర్‌ను, సమగ్ర విద్యా పరిష్కారాలను అందించేందుకు గూగుల్ భాగస్వామి ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్‌తో గ్రేటర్ విశాఖ స్మార్టు సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మూడేళ్ల పాటు అమలులో ఉంటుంది.

06/29/2017 - 02:56

హైదరాబాద్, జూన్ 28: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల స్కీంకు సంబంధించి చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే మంజూరు చేసింది. ప్రాజెక్టు మొదటి దశ కింద ఇరిగేషన్ లేదా మంచినీటి కోసం వినియోగిస్తున్నారా? లేదా? అనే అంశాన్ని ధృవీకరించేందుకు నేషనల్ గ్రీన్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ట్రిబ్యునల్ ఆదేశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది.

06/29/2017 - 02:55

హైదరాబాద్, జూన్ 28: తెలంగాణలో ఇకపై బోర్‌బావుల మరణాలు లేకుండా చూస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. బోర్‌బావుల తీరుతెన్నులపై పంచాయతీరాజ్, రెవెన్యూ, భూగర్భ జలశాఖ అధికారులతో బుధవారం రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. బోర్‌బావుల్లో పడి చిన్నారులు మరణిస్తుండటం తన మనస్సును కలిచివేసిందని, భవిష్యత్తులో అలాంటి మరణాలు ఉండకూడదన్నారు.

06/29/2017 - 02:54

హైదరాబాద్, జూన్ 28: ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో 500 కోట్లు. ఏసీబీ నిగ్గుతేల్చిన లెక్కలతో జనం గుండెలపై చేయి వేసుకుంటున్నారు. హైదరాబాద్ మియాపూర్ భూకుంభకోణం కేసులో సబ్ రిజిస్ట్రార్ల పోలీస్ కస్టడీ బుధవారంతో ముగిసింది. కూకట్‌పల్లి, బాలానగర్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్లు భారీఎత్తున ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఏసిబి అధికారులు ధృవీకరించారు.

06/29/2017 - 02:59

హైదరాబాద్, జూన్ 28: పరిపాలనా వ్యవస్థలో స్టేట్, జోనల్, డిస్ట్రిక్ట్ మూడంచెల వ్యవస్థకు స్వస్థిపలికి స్టేట్, డిస్ట్రిక్ట్‌గా రెండంచెల వ్యవస్థ రూపొందించడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జోనల్ వ్యవస్థ రద్దుకు ఇటీవల జరిగిన మంత్రిమండలి సిఫారసు చేయడంతోపాటు రెండంచెల వ్యవస్థ రూపకల్పనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

06/29/2017 - 03:10

న్యూఢిల్లీ, జూన్ 28: ఆంధ్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే ఐదు ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఏపీ ఐటీ మంత్రి లోకేష్ దేశ రాజధానిలో బీజీ బీజీగా గడిపారు.

06/29/2017 - 01:54

అమరావతి, జూన్ 28: విశాఖ, తూర్పు ఏజెన్సీ మరణాలు రాష్ట్ర ఆరోగ్య పరిస్థితిని ప్రశ్నిస్తున్నాయి. మన్యంలో వినిపిస్తోన్న మరణమృదంగం ఆరోగ్య మంత్రి పనితీరును తేటతెల్లం చేస్తోంది. వరుస మరణాలకు మందు కనిపెట్టకపోగా, కొండోళ్లకు సౌకర్యాలెలా కల్పించగలమంటూ మాటజారి సర్కారును మరింత కష్టాల్లోకి నెట్టారు. 16మంది గిరిజనులు ప్రాణాలొదిలేస్తే తప్ప మంత్రికి, వైద్యశాఖకు ఏజెన్సీ గుర్తుకు రాలేదు.

Pages