S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/26/2017 - 02:25

తిరుపతి, జూన్ 25: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా బూర్గంపాడుకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం (63) ఆదివారం తిరుమలలో తప్పిపోయారు. ఈ మేరకు ఆయన సతీమణి వెంకటరమణ తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం పెద్దల్లుడు డాక్టర్ సంతోష్‌కుమార్ కథనం మేరకు- తన మామ కుంజా భిక్షం రెండేళ్లుగా మతిమరుపుతో బాధపడుతున్నారన్నారు.

06/26/2017 - 03:34

నిజామాబాద్, జూన్ 25: నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు. ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి భారీ ఎత్తున దొంగతనాలకు పాల్పడడం, సొత్తును తస్కరించిన మీదట దర్జాగా కారులో పారిపోయేవారని నిర్ధారణ అయింది.

06/26/2017 - 03:35

హైదరాబాద్, జూన్ 25: ‘వకీల్’ కావాల్సినవాడ్ని, ఇందిరా గాంధీ పుణ్యమా అని రాజకీయాల్లోకి వచ్చి, ఇక్కడ ఇలా ఉన్నానని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ‘ఎమర్జెన్సీ-చీకటి రోజులు’ అనే అంశంపై బిజెపి రాష్ట్ర శాఖ ఆదివారం నిర్వహించిన సభకు వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వారికి ఆయన ఈ సందర్భంగా సన్మానించారు.

06/26/2017 - 02:07

హైదరాబాద్, జూన్ 25: వచ్చే ఏడాది నుంచి రైతులకు ఉచితంగా పెట్టుబడిని సమకూర్చడానికి సుమారు రూ. 7నుంచి 8వేల ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇది రైతులకు నాలుగు విడతలలో మాఫీ చేసిన పంట రుణం కంటే ఏడాదికి సుమారు రూ. 3వేల కోట్లు ఎక్కువ. రైతలకు పంట రుణమాఫీ కోసం నాలుగు విడతలకు కలిపి ప్రభుత్వానికి రూ.17వేల కోట్లు ఖర్చు కాగా, ఉచిత పెట్టుబడికిగాను ఐదు సంవత్సరాల వ్యవధిలో దాదాపు రూ.

06/26/2017 - 02:03

హైదరాబాద్/చేవెళ్ల/షాబాద్, జూన్ 25: బోరుబావిలో పడిన చిన్నారి మీనా మృతి చెందింది. విషాదాంతంగా మారిన చిన్నారి మీనా శరీరావయవాలు విడివిడిగా బయటకు రావటం అందరినీ కలచివేసింది. పాప అవయవాలకు ఆదివారం చేవెళ్ల ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈనెల 22న సాయంత్రం చిన్నారి మీనా ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన విషయం తెలిసిందే.

06/26/2017 - 02:00

హైదరాబాద్/శంషాబాద్, జూన్ 25: హీరో రవితేజ సోదరుడు, నటుడు భూపతిరాజు భరత్ దుర్మరణం చెందా రు. హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి నోవాటెల్ హోటల్‌లో స్నేహితులతో ఓ పార్టీకి హాజరైన భరత్ జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి తిరిగి వెళుతుండగా కొత్వాల్‌గూడ వద్ద బ్రేక్ ఫెయిలయి ఆగి ఉన్న ఓ లారీని బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది.

06/26/2017 - 01:57

విజయవాడ, జూన్ 25: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి నిర్మాణ దశలోనే జాతీయ ఖ్యాతి లభించగా ఇక నిర్మాణం పూర్తయితే అంతర్జాతీయ ఖ్యాతి పొందుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. అమరావతికి తాజాగా స్మార్ట్ సిటీ గుర్తింపు దక్కిన నేపథ్యంలో చంద్రబాబు ఆదివారం తన నివాస గృహం నుంచి సిఆర్‌డిఏ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రానికి ‘అమరావతి స్మార్ట్’ మణిహారం కానుందన్నారు.

06/26/2017 - 01:39

తిరుపతి, జూన్ 25: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ కుటుంబ సమేతంగా ఆదివారం తెల్లవారుజామున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి జరిగిన సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతికి చేరుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్, జెఇఓ శ్రీనివాసరాజు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

06/26/2017 - 01:33

హైదరాబాద్, జూన్ 25: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన సానుభూతిపరుడు కొనకళ్ల సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీ (సిట్) అధికారులు ఈనెల 23న సాయంత్రం టోలిచౌక్‌లోని పారావౌంట్ కాలనీలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్ల క్రితం వరకు సుబ్రహ్మణ్యంగా ఉన్న ఒమర్ గుజరాత్ వెళ్లిన తరువాత మత ఛాందసవాదిగా మారాడు.

06/26/2017 - 03:02

ద్వారకాతిరుమల, జూన్ 25: హిందూ ధర్మ వైశిష్టతపై సైద్ధాంతిక దాడులుచేసే వారికి దీటైన సమాధానం చెప్పే యోగ్యులైన యువకులను అన్ని మఠాల అధిపతులు తయారుచేయాలని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం (తిరుపతి) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి మురళీధరశర్మ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ హిం దూ ధార్మిక సమ్మేళనంలో భాగంగా సాధు శం ఖారావం నిర్వహించారు.

Pages