S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/29/2017 - 01:44

అమరావతి, జూన్ 28: తెలుగుదేశం పార్టీలో నెంబర్ వన్, నెంబర్ టూ స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి, పార్టీ చీఫ్ చంద్రబాబు, ఆయన తనయుడైన మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఒకేరోజు వివిధ సందర్భాల్లో తడబాటుతో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

06/29/2017 - 01:56

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 28: ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగం కావాలని, బ్యాడ్మింటన్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సిఎం చంద్రబాబు అన్నారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వరుసగా రెండు సూపర్ సిరీస్ చాంపియన్ షిప్‌లను కైవసం చేసుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

06/29/2017 - 01:43

అమరావతి, జూన్ 28: పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించి 15 రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక వందశాతం పూర్తి చేసి, జూలై రెండో వారంలో గృహ నిర్మాణాలు మొదలెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పేదలకు సకల వసతులతో నాణ్యమైన ఇళ్లు నిర్మించాలన్నారు. పట్టణ గృహ నిర్మాణ ప్రగతిపై బుధవారం సాయంత్రం సచివాలయంలో పురపాలక మంత్రి పి నారాయణతో కలిసి చంద్రబాబు సమీక్షించారు.

06/28/2017 - 03:57

న్యూఢిల్లీ, జూన్ 27: తెలుగు రాష్ట్రాల్లోని పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం రూ.103 కోట్లు విడుదల చేసిం ది. ఏపీకి రూ.49.10 కోట్లు, తెలంగాణకు రూ.54.28 కోట్ల ను మంగళవారం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై కేంద్ర పర్యాటకశాఖమంత్రి మహేశ్‌శర్మతో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తన కార్యలయంలో భేటీ అయ్యారు.

06/28/2017 - 03:11

హైదరాబాద్, జూన్ 27: శ్రీమంతుడు సినిమా దర్శక నిర్మాతలపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరో మహేశ్‌బాబుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వలేమని కోర్టు పునరుద్ఘాటించింది. మహేశ్‌బాబుతో పాటు నిర్మాత ఎర్నేని నవీన్‌కు మరోసారి సమన్లు జారీ చేసింది.

06/28/2017 - 02:53

హైదరాబాద్, జూన్ 27: రెండు తెలుగురాష్ట్రాల్లో విషాదం నింపిన దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఘటనకు సంబంధించి ట్రావెల్స్‌కు సంస్ధకు ఆంధ్ర రవాణా శాఖ, కార్మిక శాఖ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని హైకోర్టు తప్పు బట్టింది. కృష్ణా జిల్లాలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు దుర్ఘటనలో 11 మంది మృతి చెందిన విషయం విదితమే.

06/28/2017 - 02:37

హైదరాబాద్, జూన్ 27: తెలంగాణలో గోదావరి కళకళలాడుతోంది. ఐదారు జిల్లాలకు జీవధారగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి వరద నీరు చేరుతోంది. గత ఐదేళ్లలో జూన్ నెలలోనే పెద్దఎత్తున వరద నీరు చేరడం ఈ ఏడాదే. ఇదిలావుంటే కృష్ణా బేసిన్‌లో నీటి నిల్వలు అడుగంటాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు వెలవెలబోతున్నాయి. జూలై, ఆగస్టు నెలల్లో కురిసే వర్షాలపై రెండు జలాశయాల భవిత ఆధారపడి ఉంది.

06/28/2017 - 02:35

న్యూఢిల్లీ, జూన్ 27: తెలంగాణలో హరితహారాన్ని మొక్కవోని దీక్షతో నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్‌కు వివరించారు. రాష్టవ్య్రాప్తంగా కోట్లాది మొక్కలను నాటే సంకల్పంతో ముందుకెళ్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అటవీ భూముల వినియోగానికి అనుమతించడం పట్ల కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

06/28/2017 - 02:33

వస్త్ర వ్యాపార రంగంపై జిఎస్‌టిని నిరసిస్తూ నాలుగురోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తెలంగాణలో వస్త్ర వ్యాపారులు మంగళవారం దుకాణాలు మూసివేసి బంద్ పాటించారు. బంద్‌తో కళావిహీనంగా కనిపిస్తున్న హైదరాబాద్ టెక్స్‌టైల్ మార్కెట్

06/28/2017 - 02:24

శ్రీకాకుళం, జూన్ 27: ఆంధ్రా -తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఒప్పందం తెగిపోవడంతో పవర్ ప్రాజెక్టుల నుంచి కొనుగోలు చేస్తున్న విద్యుత్ ఇకపై అవసరం లేదంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విద్యుత్ ప్రత్యేకంగా రూ.5.50లు యూనిట్‌కు వెచ్చించి కొనుగోలు చేసేంత కొరత లేదంటూ ఏపీ ట్రాన్స్‌కో, ఎపిఎస్‌ఎల్‌డిసీ చీఫ్ ఇంజనీర్ అత్యవసర ఆదేశాలిచ్చారు.

Pages