S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/27/2017 - 00:56

హైదరాబాద్, జూన్ 26: తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మంగళవారం రాత్రి వరకు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలహీనపడ్డదని తెలిపారు.

06/27/2017 - 02:24

రాజమహేంద్రవరం/విశాఖపట్నం,జూన్ 26: మన్యం రోగాలతో అల్లాడిపోతోంది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల జనం వైద్యం అందక మృతి చెందుతున్నారు. తూర్పు ఏజెన్సీలో చాపరాయి గ్రామాన్ని మలేరియా మహమ్మారి చుట్టుముట్టింది. ఇప్పటికే 16మంది ప్రాణాలను కబళించగా, పదుల సంఖ్యలో వ్యాధిగ్రస్థులు చికిత్స పొందుతున్నారు.

06/27/2017 - 02:28

విజయవాడ, జూన్ 26: దాదాపు దశాబ్దం తరువాత కృష్ణా డెల్టాకు జూన్‌లోనే సాగు నీరు విడుదల చేశారు. తుపానుల నుంచి పంటలకు రక్షణ కల్పించేలా గతానికి భిన్నంగా ఖరీఫ్ కాలంలో రైతులకు 20 రోజుల ముందుగానే కాలువలకు నీళ్లు విడుదల చేస్తున్నామని సిఎం చంద్రబాబు అన్నారు. స్థానిక కృష్ణా తూర్పు డెల్టా ప్రధాన హెడ్ స్లూయిస్ వద్ద సోమవారం 2,500 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు.

06/27/2017 - 02:32

విజయవాడ, జూన్ 26: ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం ఏపి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్‌మీరా ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రిని. రంజాన్ సందర్భంగా ముఖ్యమంత్రి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ శుభ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

06/26/2017 - 03:21

హైదరాబాద్, జూన్ 25: దేశవ్యాప్తంగా నీట్ ర్యాంకు ఆధారంగా ఎంబిబిఎస్, బిడిఎస్ కాలేజీల్లో కన్వీనర్ కోటాకు వచ్చే నెల 3వ తేదీ నుండి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూలై 3 నుండి జూలై 11 వరకూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. తనకు కావల్సిన కాలేజీల ఛాయిస్ ఫిల్లింగ్‌కు జూలై 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ అవకాశం ఇస్తారు.

06/26/2017 - 02:44

ఏలూరు, జూన్ 25: దేశంలో ప్రస్తుత పరిస్థితులు అనుకూలిస్తే అయోధ్యలో రామాలయం విషయంలో దీపావళిలోగానే శుభవార్త వినే అవకాశాలున్నాయని బిజెపి ఎంపి సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి 2018నాటికి అయోధ్యలో పూర్తిస్థాయి రామాలయం నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

06/26/2017 - 02:41

హైదరాబాద్, జూన్ 25: దోనకొండ ప్రాంతంలో తనకు వందల, వేల ఎకరాల భూమి ఉందంటూ పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు చేసిన ఆరోపణలపై విచారణ చేయించాలని ఎపి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఎపి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వాన్ని కోరారు.

06/26/2017 - 02:29

హైదరాబాద్, జూన్ 25: ‘ఎమర్జెన్సీ-దేశానికి చీకటి రోజులు’ అనే అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చి భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. నాడు ఎమర్జెన్సీని సిపిఐలో కొంత మంది సమర్థించారని ఆయన తెలిపారు.

06/26/2017 - 03:27

విశాఖపట్నం, జూన్ 25: సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణకు త్రుటిలో ప్రమాదం తప్పింది. విశాఖ నగరం కేంద్రంగా చోటుచేసుకున్న భూ కుంభకోణంలో ప్రభుత్వ భూములను పరిశీలించే క్రమంలో ఆదివారం ఆయన మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో పర్యటించారు.

06/26/2017 - 02:32

విజయవాడ, జూన్ 25: ఫిజికల్ లిటరసీ పేరుతో వ్యాయామ విద్యను రాష్ట్ర ప్రభుత్వం కొత్త పుంతలు తొక్కించనుంది. క్రీడలుసహా యోగా, సంగీతం, నృత్యం వంటి అంశాలను జోడించడంద్వారా మరింతమంది విద్యార్థులకు వ్యాయామాన్ని చేరువ చేయనుంది. విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, పెరుగుదల, ఆనందం, జీవితకాలంపై వ్యాయామ విద్య ప్రభావం చూపుతుంది.

Pages