S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/26/2017 - 01:31

హైదరాబాద్, జూన్ 25: బోరుబావిలో పడిన చిన్నారి మీనా కథ విషాదంగానే ముగిసింది. జిల్లా అధికార యంత్రాంగం మూడు రోజులపాటు శ్రమించినా చిట్టితల్లి మీనాను కాపాడలేకపోయారు. పాప మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా చూడాల్సి రావడంతో తల్లిదండ్రులతోపాటు సంఘటన స్థలంలో పలువురు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. అసలేం జరిగిందంటే..

06/25/2017 - 04:25

భద్రాచలం టౌన్, జూన్ 24: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయంలో వరుసగా చోటు చేసుకున్న సంఘటనలు ఆలయంలో భద్రతను ప్రశ్నిస్తున్నాయి. భద్రతకు పెద్దపీట వేస్తున్నా తరచూ చోటు చేసుకుంటున్న తప్పిదాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి.

06/25/2017 - 04:10

ద్వారకాతిరుమల, జూన్ 24: ఆలయాలకు అర్చకులు ఆత్మలాంటి వారని, అటువంటి వారిని ప్రభుత్వం పదవీ విరమణ పేరుతో ఇంటికి సాగనంపడం తగదని, ఇది హిందూ వ్యవస్థకే దౌర్భాగ్యమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.

06/25/2017 - 03:59

హైదరాబాద్, జూన్ 24: విశ్వవ్యాప్తంగా విస్తరిసూ, ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ సానుభూతిపరుడిని నగర పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టోలిచౌక్‌లోని పారావౌంట్ కాలనీలో నివాసముంటున్న కొనకళ్ల సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్‌ను పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఒమర్ ఉగ్రవాద సంస్థలో ఎందుకు చేరాడు?

06/25/2017 - 03:42

హైదరాబాద్, జూన్ 24: ప్రమాదంలో దెబ్బతిన్న వాహనానికి వేసిన కొత్త ‘చేసిస్’ను రిజిస్ట్రేషన్ చేసి అవసరమైన సర్ట్ఫికెట్ ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్‌టిఎ అధికారులను ఆదేశించింది. మహ్మద్ జావిద్ వాహనం ప్రమాదంలో దెబ్బతిన్నది. దీంతో వాహనం చేసిస్ కూడా పూర్తిగా తుక్కుతుక్కు అయ్యింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్, వారంటీ గడువులోగా చేసిస్ దెబ్బతిన్నందున సదరు కంపెనీ కొత్త చేసిస్‌ను అమర్చింది.

06/25/2017 - 01:37

చేవెళ్ల/ షాబాద్ 24: రెండు రోజులు గడుస్తున్నా బోరుబావిలో పడిన చిన్నారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో రెస్క్యూ బృందాల్లోనూ ఆందోళన కనిపిస్తోంది. రెండు రోజులుగా చేవెళ్ల మండల పరిధిలోని ఇక్కారెడ్డిగూడలో అధికార యంత్రాగం అన్ని శక్తులొడ్డి కృషి చేస్తున్నా ఎలాంటి ఫలితం కనిపించలేదు. చిన్నారి క్షేమంగా ఉండాలని దేవుడిపైనే భారం వేసి అధికార యంత్రాగం నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగిస్తోంది.

06/25/2017 - 01:34

నల్లగొండ, జూన్ 24: నేత వృత్తికి అండ, కార్మిక సంక్షేమానికి ‘చేయూత’ నివ్వడం ప్రభుత్వ ప్రాధాన్యతా లక్ష్యమని జౌళి శాఖా మంత్రి కె తారక రామారావు ప్రకటించారు. అందుకోసం చేయూత పేరిట థ్రిప్ట్ పథకం ప్రారంభించామన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో నేతన్నకు చేయూత పథకాన్ని మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, జి జగదీష్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు.

06/25/2017 - 01:29

ధర్మవరం, జూన్ 24: రాష్ట్రంలో 30 వేల జనాభా ఉన్న ప్రతి పట్టణంలో బార్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఎక్సైజ్‌శాఖ మంత్రి జవహర్ తెలిపారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేవాలయాలు, గృహ సముదాయాలు లేనిచోటే బార్ల ఏర్పాటుకు లైసెన్సులు ఇస్తున్నామన్నారు. ఐదేళ్లపాటు బార్లకు లైసెన్స్‌లు మంజూరు చేస్తామన్నారు.

06/25/2017 - 01:25

గుంటూరు, జూన్ 24: సాగర్ ఆయకట్టు రైతులు ఈ ఏడాది కూడా సాగునీటి కోసం వేచి చూడాల్సిందేనా? నాగార్జున సాగర్ జలాశయం అడుగంటిపోవటంతో ఖరీఫ్‌పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. గత రెండేళ్లుగా ఇక్కడ అనధికార క్రాప్ హాలీడే కొనసాగుతోంది. రాష్ట్ర విభజన తరువాత మంచినీటి అవసరాలకు మినహా సాగుకు నీరందక పోవటంతో రైతులు నిరుడు రెండు పంటలు కోల్పోయారు. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు.

06/24/2017 - 03:27

మహబూబ్‌నగర్, జూన్ 23: జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని భీమా, కృష్ణానదుల పరిసరాల ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది నుండి జారాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం వస్తోంది. భీమా నది పరిసర ప్రాంతాలలో కురుస్తున్న వర్షంతో ఆ నీటి వరద కృష్ణానదిలో తెలంగాణలో ప్రారంభమయ్యే తంగిడికి దాదాపు పది కిలోమీటర్ల దూరంలోని భీమా నది కృష్ణానదిలో కలుస్తుంది.

Pages