S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/24/2017 - 02:46

విజయవాడ, జూన్ 23: హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామికి అందించే సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్తానం జెఈవో పోలా భాస్కర్ తెలిపారు.

06/24/2017 - 02:45

హైదరాబాద్, జూన్ 23: ఓటుకు ఐదు వేల రూపాయలు ఇవ్వగలనన్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి జైలుకు పంపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణలో ఓటు కోసం ఒక ఎమ్మెల్సీకి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఓటర్లకు ఐదు వేల రూపాయల చొప్పున ఇవ్వగలనని అనడం దారుణమని భూమన శుక్రవారం విలేఖరుల సమావేశంలో అన్నారు.

06/24/2017 - 02:04

ఇబ్రహీంపట్నం, జూన్ 23: అప్పుల బాధతో రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లా రంగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసు లు, గ్రామస్థుల కథనం ప్రకారం రంగాపూర్‌కు చెందిన పెండ్యాల రాములుచారి, మణెమ్మకు నలుగురు కుమారులు. వీరిలో చిన్నవాడైన మోహనాచారి (45) ఇరవై సంవత్సరాల క్రితం నగరంలోని సరూర్‌నగర్‌కు చెందిన సరిత (40)ను పెళ్లి చేసుకున్నాడు.

06/24/2017 - 02:15

చేవెళ్ల/ షాబాద్, జూన్ 23: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని ఇక్కారెడ్డిగూడా గ్రామంలో బోరు బావిలో పడిన చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. ప్రమాదంలో ఇరుక్కుని 24 గంటలు గడవటంతో పాప పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గురువారం సాయంత్రం నుంచి అధికారులు నిరంతరంగా నాలుగు ఇటాచీలతో బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు జరుపుతున్న ఎలాంటి ఫలితం లేకపోయింది.

06/24/2017 - 01:58

హైదరాబాద్, జూన్ 23: ఖరీఫ్‌లో పంటల సాగుకు బ్యాంకర్లు రుణాలివ్వడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణల్లోని వాస్తవాన్ని రాష్ట్ర మంత్రులు ఇద్దరు పరోక్షంగా అంగీకరించారు. ఖరీఫ్‌లో పెట్టుబడికి డబ్బుల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా, ఎందుకు రుణాలివ్వడం లేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బ్యాంకర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

06/24/2017 - 01:46

సామర్లకోట, జూన్ 23: తల్లిదండ్రులే ఇద్దరు కుమార్తెలకు కూల్‌డ్రింకులో విషంకలిపి తాగించి కడతేర్చిన విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో శుక్రవారం వెలుగుచూసింది. విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలోని బెల్గాం ప్రాంతానికి చెందిన కోడూరి సత్యనారాయణ విశాఖపట్నంలోని పెద వాల్తేరులో సెలూన్ షాపు నిర్వహిస్తున్నాడు.

06/24/2017 - 01:54

విశాఖపట్నం/ తిరుపతి/ విజయవాడ, జూన్ 23: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ప్రజారోగ్య శాఖ ఈఎన్‌సి పాము పాండురంగారావు, ఆయన బంధువు, ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రొఫెసర్, కెజిహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎన్‌బి విజయకుమార్‌లను అవినీతి నిరోధక శాఖ వలపన్ని పట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అనేకచోట్ల కూడబెట్టిన ఆస్తులపై ఆరా తీస్తోంది.

06/23/2017 - 03:02

హైదరాబాద్, జూన్ 22: సమాజంలో అధర్మం పెరిగితే భగవంతుడు భువిపై అవతారమెత్తుతాడని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి పేర్కొన్నారు. రిషికేష్‌లోని శారదాపీఠం భవనంలో గీతాచార్యుల (శ్రీకృష్ణుడి) విగ్రహాన్ని గురువారం ఆయన ప్రతిష్టించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎక్కడైతే అధర్మం పెరిగిపోతుందో అక్కడ భగవంతుడు అవతరిస్తారన్నారు.

06/23/2017 - 02:29

హైదరాబాద్, జూన్ 22: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోనూ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ అవసరమైన భూమిని కేటాయిస్తుందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. గురువారం బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 17వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.

06/23/2017 - 02:06

ఖమ్మం, జూన్ 22: రాష్ట్రంలోని మున్సిపాలీటీలు, నగరపాలక సంస్థల పరిధిలోని ఆస్తుల వివరాలను చిత్రాలతో సహా ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి ‘్భవన్’ యాప్ రూపొందించి దాని ద్వారా సేకరించిన ఛాయా చిత్రాలను పురపాలక, రెవిన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల వెబ్‌సైట్లతో అనుసంధానించాలని నిర్ణయించారు.

Pages