S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/14/2017 - 01:36

విజయవాడ, మార్చి 13:అడుగంటుతున్న భూగర్భ జలాలతో ప్రజలకు వేసవి నీటి కష్టాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే సోమవారం నాటికి రాష్ట్రంలో సగటున 2.31 మీటర్ల మేర లోపలికి భూగర్భ జలాలు పడిపోయాయి. కోస్తా జిల్లాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉండగా, రాయలసీమ ప్రాంతంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది.

03/14/2017 - 01:43

విశాఖపట్నం, మార్చి 13: లాభాల బాటలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డిసిఐ)ని ప్రైవేటుపరం చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మొట్టమొదటిదైన డిసిఐలో మెజార్టీ వాటాలను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. డిసిఐని 1976లో విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేశారు.

03/13/2017 - 04:35

చిత్రం.. రాజ్‌భవన్‌లో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ నరసింహన్ దంపతులు

03/13/2017 - 04:25

భద్రాచలం, మార్చి 12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి పెళ్లి పనులు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. హోలీ పర్వదిన సందర్భంగా ఆదివారం రామయ్యను పెళ్లికొడుకును చేసి, వసంతోత్సవం నిర్వహించారు. పెళ్లి తలంబ్రాలు, పసుపు కొట్టే పనులు ప్రారంభించారు. ఆర్డీవో శివనారాయణరెడ్డి, దేవస్థానం ఇవో తాళ్లూరి రమేశాబాబు ఆధ్వర్యంలో భక్తులు తలంబ్రాల బియ్యం కలిపారు.

03/13/2017 - 03:04

కర్నూలు/ నంద్యాల, మార్చి 12: చిన్న వయసులో తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్యాక్షన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భూమా నాగిరెడ్డి (54) కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. ఆయన అండ ఉంటే చాలు అని పార్టీల అధినేతలు సైతం ఆలోచించే స్థాయికి ఎదిగిన నాగిరెడ్డి ఆకస్మిక మృతి ప్రజలను కలచివేసింది.

03/13/2017 - 02:59

కర్నూలు, మార్చి 12: తన భార్య భూమా శోభారాణి మరణం తరువాత మానసికంగా కుంగిపోయిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి (54) ఇక రాజకీయాల నుంచి విరమించుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉన్న బంధుమిత్రుల ద్వారా తెలుస్తోంది.

03/13/2017 - 02:04

ధర్మపురి, మార్చి 12: సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మపురిలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించి బ్రహ్మపుష్కరిణిలో రాత్రి 9 గంటల వరకు నిర్వహించిన శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి.

03/13/2017 - 01:58

హైదరాబాద్, మార్చి 12: సమైక్య రాష్ట్రంలో ఎపిలో పనిచేసిన తెలంగాణ ఉద్యోగుల పిల్లలు ‘స్థానికత’ విషయంలో విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

03/13/2017 - 03:25

హైదరాబాద్, మార్చి 12: నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతి పట్ల వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్‌కు తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాగా, తన సన్నిహితుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.

03/13/2017 - 01:52

హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ ఎమ్సెట్-2 కేసు దర్యాప్తు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ కేసులో గుర్గావ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నాపత్రం బయటకు తెచ్చిన కీలక నిందితుడిని సిఐడి పోలీసులు గుర్తించారు. వారణాసికి చెందిన ఎస్ బహదూర్ సింగ్ ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రాన్ని ప్రింటింగ్ ప్రెస్ నుంచి స్వయంగా బయటకు తెచ్చాడని సిఐడి పోలీసులు తెలిపారు.

Pages