S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/08/2017 - 05:01

లీగల్ (కరీంనగర్), మార్చి 7: ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కరీంనగర్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు సిసి.నం.1/2017 కింద కేసు నమోదు చేసింది. నగరానికి చెందిన సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి 11-7-2016న కరీంనగర్ స్పెషల్ మెజిస్టేట్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. 19-6-2016న ఓ టివి ఛానల్ చూస్తుండగా కోడెల శివప్రసాద్ ఇంటర్వ్యూ ప్రసారం జరుగుతోంది.

03/08/2017 - 04:09

తిరుపతి, మార్చి 7: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి టిటిడి బోర్డుసభ్యుడు, తెలంగాణ రాష్ట్రం ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తన కుమారుడు ఖగేంద్ర రామానుజ జన్మదినాన్ని పురస్కరించుకొని రూ.17 లక్షల విలువచేసే స్వర్ణ శఠారిని మంగళవారం స్వామివారికి కానుకగా సమర్పించారు. 502 గ్రామల బరువు కలిగిన ఈ బంగారు శఠారిని చింతల రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా ఆలయంలోకి తీసుకెళ్లి అర్చకస్వాములకు అందజేశారు.

03/08/2017 - 02:19

విజయవాడ, మార్చి 7 : తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ తరహా పథకాన్ని రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వాటర్ గ్రిడ్ పథకం అమలుకు భగీరథ తరహాలో బోర్డు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

03/08/2017 - 02:17

అమరావతి, మార్చి 7: వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మరో ఏడాది సస్పెన్షన్ వేటు తప్పదా? శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఈ అనుమానం నిజమేననిపిస్తోంది.

03/08/2017 - 01:57

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణ జెఎసిలో ఆరంభమైన ముసలం ముదిరి ఇద్దరు నేతల సస్పెన్షన్‌కు దారి తీసింది. టి.జెఎసి రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవీందర్, కో-చైర్మన్ నల్లపు ప్రహ్లాద్‌లను సస్పెండ్ చేస్తూ మంగళవారం జరిగిన టి.జెఎసి సమావేశం తీర్మానించింది. ప్రొఫెసర్ కోదండరామ్ వ్యవహార శైలిని తప్పుపడుతూ రవీందర్, ప్రహ్లాద్ మీడియాకు బహిరంగ లేఖలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. టి.జెఎసిని యధావిధిగా కొనసాగిస్తారా?

03/08/2017 - 01:54

హైదరాబాద్, మార్చి 7:ప్రభుత్వరంగ సంస్థలు (పిఎస్‌యులు) గత ప్రభుత్వాలకు గుదిబండ కాగా తెలంగాణ ప్రభుత్వం వీటిని బంగారు బాతులుగా భావిస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో పిఎస్‌యుల నిర్వహణ పెనుభారంగా మారింది. వీటిపై చేసిన అప్పులు తడిసిమోపెడయ్యాయి. ఒక్కో సంస్థ వందలాది కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో గత ప్రభుత్వాలు వీటికి పాలకవర్గాలను కూడా నియమించకుండా వదిలేశాయి.

03/08/2017 - 01:51

హైదరాబాద్, మార్చి 7:తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రాధాన్యత లేదన్న విమర్శలపై నష్ట నివారణకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎట్టకేలకు చర్యలు చేపట్టారు. రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిథ్యం లేకుండానే దాదాపు మూడేళ్లు గడిచిపోవడంపై వస్తున్న విమర్శలకు ఇక తెర దించాలని నిర్ణయించారు. మంత్రివర్గంలో స్థానం కల్పించకపోయినా కనీసం నామినేటెడ్ పదవులైనా ఇచ్చి, ఈ విమర్శలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు.

03/08/2017 - 01:45

గుంటూరు, మార్చి 7: ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా మిర్చి కొనుగోళ్లను నిలిపివేయడంతో సుదూర ప్రాంతాల నుంచి గుంటూరు యార్డ్‌కు సరుకు తీసుకువచ్చిన రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే గిట్టుబాటు ధర లభించక ఆందోళనకు గురవుతుంటే తెచ్చిన సరుకును కూడా కొనుగోలు చేయకపోతే ఎలా అంటూ ఆందోళనకు దిగారు.

03/08/2017 - 01:41

హైదరాబాద్, మార్చి 7: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణల కేసులో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు యావజ్జీవ శిక్ష విధిస్తూ గడ్చిరొలి కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేస్తామని సాయిబాబా భార్య వసంత తెలిపారు.ఈ కేసులో నిందితులుగా ఉన్న వారందరికీ శిక్ష పడటం తనను దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. న్యాయవ్యవస్థపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వత్తిడి చేసినట్టు కనిపిస్తోందని అన్నారు.

03/08/2017 - 01:36

విజయవాడ: ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే...మరోవైపు ఇద్దరు మహిళా మంత్రులు తీరిక చేసుకుని అసెంబ్లీ క్యాంటీన్‌లో పాకశాస్త్రంలో తమ ప్రావీణ్యాన్ని చాటుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను పరిశీలించేందుకు మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత వచ్చారు. కిచెన్‌లోకి రాగానే పకోడీల ఘుమఘుమలు వారిని పలకరించాయి.

Pages