S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/23/2016 - 08:47

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాలకు పాలక మండళ్లను నియమించింది. వీటిలో పారిశ్రామికవేత్తలు, మాజీ ఎమ్మెల్యేలు, న్యాయవాదులకు సభ్యులుగా చోటు లభించింది. మార్గదర్శి ఎండి శైలజా కిరణ్‌ను, అపోలో ఆస్పత్రి డైరెక్టర్ సంగీతరెడ్డిలను మహిళా విశ్వవిద్యాలయం పాలక మండలికి నియమించారు.
యోగివేమన పాలక మండలి

02/23/2016 - 08:38

విశాఖపట్నం: అవినీతి ఉద్యోగుల ఆటకట్టించడానికి ఏసిబి అధికారులు చేస్తున్న శ్రమ వృథాగా మారుతోంది. ఉద్యోగులపై వచ్చే ఆరోపణలను నిశితంగా పరిశీలించి, అనేక రోజులు నిఘా పెట్టి, వారి వెనుకున్న అక్రమార్జనపై అధ్యయనం చేసి, పదుల సంఖ్యలో ఏసిబి సిబ్బంది దాడులు నిర్వహిస్తున్నారు. వీరి దాడుల్లో వేల కోట్ల రూపాయల అక్రమార్జన బయటపడుతోంది.

02/23/2016 - 08:31

విజయవాడ: వైకాపాకు సోమవారం పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. గత వారం రోజులుగా వచ్చిన ఊహాగానాలకు తెరదించుతూ వైకాపాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఒకరు తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకున్నారు. సిఎం చంద్రబాబును కలిసిన అనంతరం వారు పాత్రికేయులతో మాట్లాడుతూ రాయలసీమతో పాటు నవ్యాంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆశించి చేరాము తప్ప పదవుల కోసం కాదని వివరణ ఇచ్చారు.

02/23/2016 - 07:37

హైదరాబాద్:ఏ వర్గానికీ రిజర్వేషన్లు కల్పించాలని తాము ప్రభుత్వాన్ని ఆదేశించ లేమని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. గరీబ్ గైడ్ అనే స్వచ్ఛంద సంస్థ కాపులకు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఏ వర్గానికి రిజర్వేషన్ ఇవ్వాలి, ఇవ్వవద్దు అనే నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం మాత్రమేనని హైకోర్టు స్పష్టం చేసింది.

02/23/2016 - 06:53

విజయవాడ: రాష్ట్ర రాజధాని అమరావతి నగర మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి ముసాయిదా ప్లాన్‌పై వచ్చిన అభ్యంతరాల్లో 90శాతాన్ని పరిష్కరించటమే కాకుండా రహదారుల వల్ల 3వేల ఇళ్లు దెబ్బతినకుండా ఉండేలా రూపొందించిన తుది బృహత్ ప్రణాళికను మున్సిపల్ మంత్రి పి నారాయణ సోమవారం రాత్రి విజయవాడలో విడుదల చేశారు.

02/23/2016 - 06:51

విజయవాడ: రాష్ట్ర విభజనతో ఆంధ్ర తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా, స్థానిక ఉత్పాదనలు, ఆర్థిక వనరులు పెంచుకుంటూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు సిఎం చంద్రబాబు ప్రకటించారు. పథకాల అమలు విషయంలో రాజీ ప్రసక్తే లేదన్నారు. జాతీయ సగటు వృద్ధిరేటు 7.3 శాతం కాగా ఇప్పటికే రాష్ట్రం 10.5 శాతం సాధించిందని, ఈ విషయంలో ఉన్నతాధికారులు, కలెక్టర్ల పాత్ర మరువలేమన్నారు.

02/23/2016 - 06:48

విజయవాడ, ఫిబ్రవరి 22: అధికార తెలుగు దేశం ఆకర్ష్ మంత్రం ఫలిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన వైకాపాకు చెందిన ఐదుగురు సీనియర్ నేతలు సోమవారం తెలుగు దేశంలో చేరారు.

02/23/2016 - 06:21

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు సన్నద్ధమవుతున్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు 16 రోజుల పాటు జరుగుతాయని చెబుతున్నారు. మార్చి 5న సమావేశాలు హైదరాబాద్‌లో మొదలవుతాయి. 8న వ్యవసాయ బడ్జెట్‌ను ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెడతారు. 10న సాధారణ బడ్జెట్‌ను మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెడతారు. 6, 7, 13, 20, 27 తేదీలు ఆదివారాలు, ప్రభుత్వ సెలవుదినాలు ఉన్నాయి.

02/22/2016 - 05:12

హైదరాబాద్: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను విభజన కష్టాలు ఇంకా వెంటాడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగుల పంపకాల్లో ప్రతిష్టంభన వీడలేదు. విభజన జరిగి 21 నెలలు కావస్తున్నా, ఇంకా ఉద్యోగుల విభజన, ఆస్తుల పంపకం జరగకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ చట్టం షెడ్యూల్ 9లో ప్రభుత్వ రంగ సంస్ధలను చేర్చారు.

02/22/2016 - 01:42

హైదరాబాద్: విభజన కష్టాలతో ఆర్ధిక సంక్షోభంలో కూరుకున్న ఆంధ్రకు మంచిరోజులు ముందున్నాయన్న సంకేతాలను కేంద్రం పంపుతోంది. మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరం లోగానే కేంద్రం నిధులు అందించే అవకాశం కనిపిస్తోంది. ‘సిఎం చంద్రబాబు ఐదుసార్లు ప్రధానిని కలిశారు. ఆర్థిక మంత్రి పదిసార్లు ఢిల్లీకెళ్లి వివిధ శాఖాధికారులతో సమావేశమయ్యారు.

Pages