S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/20/2016 - 01:32

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు వారికి వేతనాలు పెంచుతూ ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన వేతనాలు జనవరి ఒకటి, 2016 నుంచి అమలులోకి వస్తాయని ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్ శివశంకర్ పేరుతో విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.

02/20/2016 - 01:32

ప్రత్తిపాడు, ఫిబ్రవరి 19: కాపు ఉద్యమకారులపై రాష్టవ్య్రాప్తంగా పోలీసులు రకరకాల కేసులు బనాయించడం దారుణమని కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో సెక్షన్ 144, 30 ఉల్లంఘించారని కేసులు పెడుతున్నరని, అవి ఉల్లంఘన కాదని, తమ జాతి ఆకలి కేకలతో చూపించిన ఉద్యమ స్ఫూర్తి అని స్పష్టంచేశారు. ఈమేరకు రాష్ట్ర డిజిపి జెవి రాముడుకు ఆయన ఒక లేఖ రాశారు.

02/20/2016 - 01:31

విజయవాడ, ఫిబ్రవరి 19: కుప్పలు తెప్పలుగా హామీల వర్షం కురిపించి అధికారంలోకొచ్చిన ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండేళ్లు గడిచినా ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలుచేయకుండా అన్నింటిని నిస్సిగ్గుగా విస్మరిస్తున్నారంటూ ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ధ్వజమెత్తారు.

02/20/2016 - 01:30

హైదరాబాద్, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో శాసనసభా స్థానాల సంఖ్యను 119 నుంచి 153కి పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలలోనూ జనాభా నిష్పత్తిని అనుసరించి శాసనసభ స్థానాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ కేంద్ర హోం మంత్రిత్వశాఖకు లేఖ రాశారు.

02/20/2016 - 01:30

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను నగరంలోని ‘కిమ్స్’ ఆసుపత్రిలో చేర్పించారు. రాంరెడ్డి కొంత కాలంగా శ్వాస కోశ వ్యాధితో బాధపడుతున్నారు. ఎమ్మెల్యే రాంరెడ్డి లోగడ సుజాతనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.

02/20/2016 - 01:29

నాగార్జున యూనివర్సిటీ, ఫిబ్రవరి 19: ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎపిపిఇసెట్)-2016 షెడ్యూల్‌ను పీసెట్ కన్వీనర్ ఆచార్య వై కిషోర్ గురువారం విడుదల చేశారు. ఈ నెల 26న పీసెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని, మార్చి 4వ తేది నుండి పీసెట్‌కు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

02/20/2016 - 01:28

హైదరాబాద్, ఫిబ్రవరి 19: తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచుకుంటూపోతున్నా వారిని ప్రశ్నించే నాధుడే లేకుండా పోయారు. మిగిలిన ఏ శాఖల్లో లేని విధంగా క్షేత్రస్థాయి వరకూ పాఠశాల విద్యకు యంత్రాంగం ఉన్నా, ప్రైవేటు స్కూళ్ల ఫీజుల జులుం యథేచ్ఛగా కొనసాగుతోంది.

02/20/2016 - 00:59

వరంగల్, ఫిబ్రవరి 19: వరంగల్ నగరాన్ని ఐటి హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కృతనిశ్చయంతో ఉన్నారని సమాచార టెక్నాలజీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కె.తారకరామారావు శుక్రవారం నాడిక్కడ తెలిపారు. ఐటి కంపెనీల ఏర్పాటుతో నగరం మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.

02/20/2016 - 00:56

హైదరాబాద్, ఫిబ్రవరి 19: తెలంగాణ పోలీసు శాఖ కమ్యూనికేషన్ విభాగంలో 332 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నెల 25వ తేదీ నుంచి మార్చి 15 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించబడతాయని, నమూనా దరఖాస్తు ఫారం పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో ఉందని తెలిపింది.

02/20/2016 - 00:55

మేడారం జాతరకు శుక్రవారం నిండుతనం చేకూరింది.
తల్లులు గద్దెనెక్కిన దృశ్యాన్ని చూసిన భక్తులు ఆనంద పారవశ్యంతో ఉప్పొంగిపోయారు.
కోటి 20లక్షల మందికి పైగా తరలివచ్చిన భక్తులతో జాతర ప్రాంగణం కిటకిటలాడింది. జంపన్నవాగులో తల్లీబిడ్డలకు మొక్కులు చెల్లించుకున్నారు. నేడు సమ్మక్క, సారలమ్మ తల్లులు వన ప్రవేశం చేయనున్నారు.

Pages