S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/12/2018 - 05:11

తిరుపతి, సెప్టెంబర్ 11: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధికార్యక్రమంలో పాల్గొన్నారు.

09/12/2018 - 05:13

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ఒత్తిడి లేని చదువులతో సత్ఫలితాలు వస్తాయని కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. మంగళవారం నాడు రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్రమోదీ రాసిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తక తెలుగు అనువాద సంపుటిని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆవిష్కరించారు.

09/11/2018 - 16:50

కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఓ బస్సు బోల్తాపడిన ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 50కి పెరిగింది. బస్సులో దాదాపు 70మంది ప్రయాణిస్తున్నారు. మృతిచెందినవారిలో 25మంది మహిళలు ఉన్నారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందగానే కలెక్టర్ శరత్, ఎస్పీ సింధూశర్మ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతిచెందినవారిలో ఇప్పటివరకు 35మందిని గుర్తించారు.

09/11/2018 - 12:49

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత-మాజీ ఎమ్మెల్యేజగ్గారెడ్డి చేసిన రాజకీయ కక్ష సాధింపు ఆరోపణల్ని నార్త్‌ జోన్‌ డిసిపి సుమతి కొట్టిపారేశారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పక్కా ఆధారాలతోనే జగ్గారెడ్డిని అరెస్టు చేశామని స్పష్టం చేశారు. ఆధార్‌ డేటా ఆధారంగా కేసును చేధించామని పేర్కొన్నారు. జగ్గారెడ్డి 2004 లో ముగ్గురిని విదేశాలకు అక్రమంగా పంపించారని తెలిపారు.

09/11/2018 - 03:52

హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన వెంటనే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు ఏడాదికి ఆరు వంట గ్యాస్ సిలెండర్లు (ఎల్‌పీజీ) ఉచితంగా అందించి ఆదుకుంటామని టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

09/11/2018 - 03:21

విజయవాడ, సెప్టెంబర్ 10: కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, దానిని సాధించుకోవడానికి కష్టపడాలని పార్టీ నేతలకు మాజీ సీఎం కొణిజేటి రోశయ్య సూచించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయన పార్టీ ఆహ్వానం మేరకు పీసీసీ రాష్ట్ర కార్యాలయాన్ని సోమవారం సాయంత్రం సందర్శించారు.

09/11/2018 - 02:53

ఖమ్మం, సెప్టెంబర్ 10: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాల్లో పోటీ చేసే టీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించిన నాటినుంచే అసమ్మతివాదుల నిరసనలు అధికమయ్యాయి. ప్రధానంగా మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది.

09/11/2018 - 02:47

విశాఖపట్నం, సెప్టెంబర్ 10: గతంతో పోలిస్తే మెరుగైన స్థితిలో దేశ ప్రయోజనాలు పరిరక్షించే విధంగా భారత్ - అమెరికా సంబంధాలు బలోపేతమవుతున్నాయని భారత మాజీ రాయబారి అశోక్ సజ్జనార్ అన్నారు. భారత ప్రభుత్వ విదేశీ మంత్రిత్వ శాఖ గీతం డీమ్డ్ యూనివర్శిటీలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశాధినేతలు మారుతున్నప్పటికీ భారత్ - అమెరికా సంబంధాలపై ఏ విధమైన ప్రభావం లేదన్నారు.

09/11/2018 - 02:39

అమరావతి, సెప్టెంబర్ 10: మెరుగైన ప్యాకేజీతో తమ భవిష్యత్తుకు బంగారుబాట వేశారని గన్నవరం రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున రైతులు ముఖ్యమంత్రిని కలుసుకుని గన్నవరం విమానాశ్రయ రన్‌వే విస్తరణకు భూములిచ్చి తాము కూడా రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావటం సంతోషంగా ఉందన్నారు.

09/11/2018 - 02:39

విజయవాడ, సెప్టెంబర్ 10: కాంట్రాక్టు ఉద్యోగులే అన్ని విధులను నిర్వహిస్తున్నా వీరికి నామమాత్రపు వేతనాలే ఇస్తున్నారని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను సీనియారిటీ ఆధారంగా రెగ్యులరైజ్ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు డిమాండ్ చేశారు.

Pages